
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో భారీ లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 629 పాయింట్లుఎగిసి 62501 వద్ద ముగియగా, నిఫ్టీ 178 పాయింట్లు ఎగిసి 18499 వద్ద స్థిరపడింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల నార్జించాయి. దీంతో దలాల్ స్ట్రీట్‌లో ఇన్వెస్టర్ల సంపద 2. లక్షల కోట్లు పెరిగింది. (మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్‌కు గ్రీన్ సిగ్నల్)
ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకులు, ఫైనాన్షియల్స్, ఆటో, మీడియా, మెటల్, ఫార్మా, రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ లాభాల్లో ముగిశాయి.ప్రధానంగా రిలయన్స్, సన్‌ఫార్మా, హిందాల్కో, దివీస్, హెచ్‌యూఎల్ లాభపడగా, ఓఎన్‌జీసీ, గ్రాసిం, బజాజ్‌ఆటో, భారతి ఎయిర్టెల్, పవర్ గ్రిడ్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. (సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త ట్యాబ్: ధర రూ.15 వేల లోపే)
హైలైట్స్
హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలతో నిఫ్టీ శుక్రవారం 2023 ఏడాది తొలిసారి 18,500 మార్క్‌ను దాటింది.
ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.24 లక్షల కోట్లు పెరిగి రూ.282.57 లక్షల కోట్లకు చేరుకుంది.
సన్ ఫార్మా శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో మార్చి 31, 2023తో ముగిసిన త్రైమాసికంలో రూ. 1,984.47 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నివేదించింది, గత ఏడాది ఇదే కాలంలో రూ. 2,277.25 కోట్ల నష్టం నమోదు చేయడం గమనార‍్హం
నిఫ్టీ ఎఫ్‌ఎంసిజి ఇండెక్స్ 50,000 మార్క్‌ను అధిగమించి రికార్డు స్థాయికి చేరుకోవడం విశేషం.
మరిన్ని మార్కెట్ వార్తలు, ఇతర బిజినెస్ అప్‌డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్
Comments
Please login to add a commentAdd a comment