
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ఈ వారాన్ని లాభాలతో శుభారంభం చేసిన సూచీలు చివరకు ఉత్సాహంగా ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు లాభాలతో ప్రారంభమయ్యాయి. మధ్యలో కాస్త పప్రాఫిట్ బుకింగ్ కనిపించినప్పటికీ, సెన్సెక్స్ ఒక దశలో 950 పాయింట్లకు పైగా ఎగియగా, నిఫ్టీ 18100 పాయింట్లుపైకి చేరింది. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్షియల్, మెటల్, స్టాక్స్ బాగా లాభపడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ 846 పాయింట్లు ఎగిసి 60747 వద్ద, నిఫ్టీ 230 పాయింట్ల లాభంతో 18089 వద్ద స్థిరపడ్డాయి.
ఎం అండ్ ఎం, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్ బ్యాంకు, టెక్ మహీంద్ర, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంకు టాప్ విన్నర్స్‌గా నిలవగా, టైటన్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, గ్రాసిం టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 42 పైసలు ఎగిసి 82.38 వద్దకు చేరింది.