
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిసాయి. ఆరంభంలో 200 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ మధ్యలో లాభాలను కోల్పోయినా వరుసగా రెండో సెషన్‌లోనూ లాభపడింది. సెన్సెక్స్ 92 పాయింట్లు లేదా 0.15 శాతం పెరిగి 61,511 వద్ద, నిఫ్టీ 0.13 శాతం లేదా 23.05 పాయింట్లు పెరిగి 18,267 వద్ద ముగిసింది.
అపోలో హాస్పిటల్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, విప్రో, బజాజ్ ఫిన్‌సర్వ్, సిప్లా, మారుతి సుజుకి టాప్ లాభాల్లోనూ, అదానీ ఎంటర్ ప్రైజెస్, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, హీరో మోటో, టెక్ మహీంద్ర టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలోరూపాయి 22 పైసలు నష్టంతో 81.84 వద్ద ముగిసింది.