
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. ఈ వారంలో వరుసగా రెండో రోజు భారీ లాభాలను ఆర్జించాయి. ఆరంభం నుంచి దూకుడుమీద ఉన్న సూచీలు రోజంతా అదే ధోరణిని కంటిన్యూ చేశాయి. ఫలితంగా నిఫ్టీ 18వేలకు ఎగువన, సెన్సెక్స్ 61 వేలకు ఎగువన స్థిరపడటం విశేషం. ఇంట్రా డేలో 500 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ చివరికి సెన్సెక్స్ 375 పాయింట్ల లాభంతో 61121వద్ద, నిఫ్టీ 133 పాయింట్ల లాబంతో 18145 వద్ద పటిష్టంగా క్లోజ్ అయ్యాయి.
దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిసాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, దివీస్ లాబ్స్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, డా. రెడ్డీస్ లాబ్స్, పవర్ గ్రిడ్, , హిందాల్కో, గ్రాసిం, ఇన్ఫోసిస్ భారీగా లాభపడ్డాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంకు, యూపీఎల్, ఐషర్ మోటార్స్, రిలయన్స్, మారుతి సుజుకి, పీఎన్‌బీ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప లాభాలతో 82.71 వద్ద ముగిసింది.