
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ వారంలో రెండో రోజుకూడా లాభాల్లో ముగిసాయి. ఆరంభంలోనే లాభాల దూకుడును ప్రదర్శించిన సూచీలు రోజంతా లాభాలతో సందడి చేశాయి. ఒక దశలో సెన్సెక్స్ 59 వేల మార్క్‌ను అధిగమించింది. చివరికి సెన్సెక్స్ 550 పాయింట్లు లాభపడి 58960 వద్ద, నిఫ్టీ 175 పాయింట్లు ఎగిసి 17486 వద్ద స్థిరపడ్డాయి. బలమైన అంతర్జాతీయ సంకేతాలు, ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్లు సానుకూలంగా కొనసాగాయి.
బ్యాంకింగ్,ఆటో, ఐటీ, ఎఫ్‌ఎంసిజి ఇలా అన్ని రంగాల షేర్లు లాభానార్జించాయి. ప్రధానంగా రిలయన్స్, ఐటీసీ, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, నెస్లే ఎ స్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లాభపడ్డాయి. ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఆటో, టెక్ మహీంద్ర, బ్రిటానియా నష్టపోయాయి. అటు డాలరు మారకంలో మారకంలో రూపాయి 82.36 వద్ద ముగిసింది.