
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. యుఎస్ ఫెడ్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాలు, యుఎస్ సిపిఐ డేటకోసం ఆసక్తి ఎదురు చూస్తున్న గ్లోబల్, ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో భారత ఈక్విటీ సూచీలు మంగళవారం గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. ఐటీ మెటల్, ఎఫ్‌ఎంసిజి సహా అన్ని రంగాల షేర్లు జోరుగా ఉన్నాయి. మెటల్ రంగ షేర్లు మాత్రం స్వల్పంగా నష్టపోతున్నాయి.
సెన్సెక్స్ 416 పాయింట్ల లాభంతో 60847 వద్ద, నిఫ్టీ 106 పాయిట్లు ఎగిసి 17876 వద్ద కొన సాగుతున్నాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్‌లలో ఇన్ఫోసిస్, టిసిఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా ఉన్నాయి. ఇంకా రిలయన్స్, ఐటీసీ,యూపీఎల్ లాభపడుతుండగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా మోటార్స్, ఇండస్‌ఇంద్ బ్యాంక్, ఎస్‌బిఐఎన్ నష్టాల్లో ఉన్నాయి.అటు డాలరు మారకంలో రూపాయ 82.58 వద్ద కొనసాగుతోంది. చమురు ధరల క్షీణతతో డాలరు పడిపోవడంతో రూపాయి బలం వచ్చింది.