
దేశీయ స్టాక్‌మార్కెట్లు పాజిటివ్‌గా ముగిసాయి.సెన్సెక్స్ 64 పాయింట్లు ఎగిసి 65344 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 19355 వద్ద స్థిర పడ్డాయి. మెటల్, ఆయిల్ & గ్యాస్ రెండు రంగాలు మాత్రమే లాభపడ్డాయి. ఎఫ్‌ఎమ్‌సిజి, కన్స్యూమర్ డ్యూరబుల్ , ఆటో , ఐటీ నష్ట పోయాయి.
రిలయన్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్,భారతి ఎ యిర్‌టెల్ టాప్ గెయినర్స్, హెచ్‌సీఎల్ టెక్, టైటన్, పవర్ గ్రిడ్, టీసీఎస్, నెస్లే టాప్ లూజర్స్‌గా నిలిచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మార్కెట్ విలువ ప్రకారం భారతదేశపు అతిపెద్ద సంస్థ తన ఆర్థిక సేవల డీమెర్జ్ వార్తలతో భారీగా లాభపడింది. మూడు నెలల్లో లేనంత అత్యధికంగా లాభపడింది. వరుస లాభాలతో రిలయన్స్ మార్కెట్ క్యాప్‌లో రూ. 70వేల కోట్లు వచ్చి చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)