
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లోకొనసాగుతున్నాయి. చైనాలో మరోసారి కరోనా విస్తరణ, ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలున్నప్పటికీ, సెన్సెక్స్ ఆరంభంలో 200 పాయింట్లకు పైగా ఎసిగింది. ప్రస్తుతం102 పాయింట్ల లాభంతో 61,521 వద్ద ముగిసింది. నిఫ్టీ 28 పాయింట్లు లాభపడి 18,273వద్ద కొనసాగుతోంది.
ఐటీ, మెటల్ పీఎస్‌యూ బ్యాంక్ తోపాటు, దాదాపు అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, విప్రో, బజాజ్ ఫిన్‌సర్వ్, సిప్లా, మారుతి సుజుకి లాభాల్లోనూ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఐటీసీ, అదానీ పోర్ట్స్ ఇండస్ ఇండ్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనిలీవర్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలోరూపాయి 15 పైసలు నష్టంతో 81.78కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment