సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. వరుస నష్టాలకు చెక్ చెప్పిన సూచీలు బుధవారం సానుకూలంగా ప్రారంభమైనాయి. ఆ తరువాత మరింత ఎగిసి 400 పాయింట్లకు పైగా లాభపడ్డాయి. చివరికి సెన్సెక్స్ 390 పాయింట్ల లాభంతో 61,045 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు ఎగిసి 18,164 వద్ద రెండు వారాల గరిష్టం వద్ద స్థిరపడ్డాయి. తద్వారా సెన్సెక్స్ మళ్లీ 61వేల స్థాయికి, నిఫ్టీ 18150ఎగువకు చేరాయి. ఐటీ మెటల్ షేర్లు భారీగా లాభపడ్డాయి.
హిందాల్కో, టాటా స్టీల్, లార్సెన్, యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ భారీగా లాభపడగా, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీలైఫ్, అదానీ ఎంటర్ పప్రైజెస్, బీపీసీఎల్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రుపీ 64 పాయింట్లు ఎగిసి 81.24 వద్ద ఉంది. గత ఏడాది డిసెంబర్ తరువాత ఈ గరిష్ట స్థాయిల వద్ద ముగియడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment