sensex profits
-
61 వేల ఎగువకు సెన్సెక్స్,18150 దాటిన నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. వరుస నష్టాలకు చెక్ చెప్పిన సూచీలు బుధవారం సానుకూలంగా ప్రారంభమైనాయి. ఆ తరువాత మరింత ఎగిసి 400 పాయింట్లకు పైగా లాభపడ్డాయి. చివరికి సెన్సెక్స్ 390 పాయింట్ల లాభంతో 61,045 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు ఎగిసి 18,164 వద్ద రెండు వారాల గరిష్టం వద్ద స్థిరపడ్డాయి. తద్వారా సెన్సెక్స్ మళ్లీ 61వేల స్థాయికి, నిఫ్టీ 18150ఎగువకు చేరాయి. ఐటీ మెటల్ షేర్లు భారీగా లాభపడ్డాయి. హిందాల్కో, టాటా స్టీల్, లార్సెన్, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ భారీగా లాభపడగా, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీలైఫ్, అదానీ ఎంటర్ పప్రైజెస్, బీపీసీఎల్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రుపీ 64 పాయింట్లు ఎగిసి 81.24 వద్ద ఉంది. గత ఏడాది డిసెంబర్ తరువాత ఈ గరిష్ట స్థాయిల వద్ద ముగియడం విశేషం. -
సరికొత్త శిఖరాలపై ముగింపు
ముంబై: మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మంగళవారం సరికొత్త శిఖరాలపై ముగిశాయి. మౌలిక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన రూ.6 లక్షల కోట్ల జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్(ఎన్ఎంపీ) కార్యక్రమం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచినట్లు స్టాక్ నిపుణులు తెలిపారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచీ సానుకూలతలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 403 పాయింట్ల లాభంతో 55,959 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 128 పాయింట్లు పెరిగి 16,625 వద్ద ముగిసింది. ఈ స్థాయిలు ఇరు సూచీలకు జీవితకాల ముగింపు స్థాయి. అలాగే వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు కావడం విశేషం. ఒక దశలో సెన్సెక్స్ 467 పాయింట్లు పెరిగి 56 వేల స్థాయిని అధిగమించి 56,023 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. నిఫ్టీ సైతం 151 పాయింట్లను ఆర్జించి 16,647 స్థాయిని తాకింది. కొన్ని రోజులుగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్న చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు రెండుశాతం లాభపడ్డాయి. అంతర్జాతీయంగా ఐరన్ ఓర్ ఫ్యూచర్లు కుప్పకూలిపోవడంతో నాలుగు రోజులుగా నష్టాలను చవిచూసిన మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీల్లోని అన్ని సెక్టార్ ఇండెక్స్‌ల్లోకెల్లా ఈ మెటల్ సూచీ అత్యధికంగా మూడుశాతం ర్యాలీ చేసింది. ట్రేడింగ్ తొలి భాగంలో రాణించిన ఐటీ షేర్లలో మిడ్‌సెషన్ తర్వాత లాభాల స్వీకరణ జరిగింది. ఎఫ్ఎంసీజీ షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సూచీలు కొత్త గరిష్టాలపై ముగిసిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో ఒక్కరోజులోనే రూ.2.79 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ మొత్తం రూ.240 లక్షల కోట్లకు చేరింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,645 కోట్ల షేర్లను అమ్మగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.2,380 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మూడు పైసలు బలపడి 74.19 వద్ద స్థిరపడింది. ఫైజర్–బయోఎన్‌టెక్ ఆవిష్కరించిన కోవిడ్–19 వ్యాక్సిన్‌కు యూఎస్ఎఫ్ఎడీఏ పూర్తి స్థాయి అనుమతులు జారీ చేసింది. దీంతో వ్యాక్సినేషన్ వేగవంతం, ఆర్థిక రికవరీ ఆశలతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. రెండు లిస్టింగ్లూ డీలా.. ఆప్టస్ వ్యాల్యూ హౌసింగ్ ఫైనాన్స్, కెమ్‌ప్లాస్ట్ సన్మార్ లిస్టింగ్‌లు రెండూ నిరాశపరిచాయి. ఆప్టస్ వ్యాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.353తో పోలిస్తే ఆరున్నర శాతం నష్టంతో రూ.330 వద్ద లిస్టయ్యాయి. మార్కెట్ ర్యాలీలో భాగంగా లిస్టింగ్ నష్టాలను పూడ్చుకున్నప్పటికీ.., లాభాలతో గట్టెక్కలేకపోయాయి. చివరికి రెండుశాతం నష్టంతో రూ.347 వద్ద ముగిశాయి. బీఎస్ఈలో మొత్తం 16 లక్షల షేర్లు చేతులు మారగా, కంపెనీ మార్కెట్ విలువ రూ.17,171 కోట్లుగా నమోదైంది. ప్రత్యేక రసాయన తయారీ కంపెనీ కెమ్‌ప్లాస్ట్ సన్మార్ లిస్టింగ్ కూడా ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయింది. ఐపీఓ ఇష్యూ ధర రూ.541తో పోలిస్తే బీఎస్ఈలో ఈ షేర్లు మూడు శాతం నష్టంతో రూ.525 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇంట్రాడేలో రూ.550 వద్ద గరిష్టాన్ని, రూ.510 స్థాయి వద్ద కనిష్టాన్ని నమోదుచేశాయి. చివరికి ఒకశాతానికి పైగా నష్టంతో రూ.535 వద్ద ముగిశాయి. 100 బిలియన్ డాలర్ల క్లబ్లో ఇన్ఫీ ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ కంపెనీ అరుదైన ఘనత సాధించింది. ఇంట్రాడేలో కంపెనీ షేరు ఒక శాతానికి పైగా లాభపడి రూ.1,756 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారి 100 బిలియన్ డాలర్ల మార్కు (రూ.7.47 లక్షల కోట్లు)ను అందుకుంది. తద్వారా 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిన నాలుగో భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉన్నాయి. -
నాలుగోరోజూ రికార్డులే
ముంబై: స్టాక్ మార్కెట్ దూకుడు ఆగడం లేదు. సూచీలు నాలుగోరోజూ సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించి రికార్డుల ర్యాలీకి అండగా నిలిచాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 272 పాయింట్లు ఎగసి 55,855 వద్ద, నిఫ్టీ 66 పాయింట్లు పెరిగి 16,629 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదుచేశాయి. జూన్ త్రైమాసిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించడంతో ఐటీ రంగ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. కొన్ని రోజులుగా అమ్మకాల ఒత్తిడికి లోనైన స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బ్యాంకింగ్, మెటల్, ఆటో, రియల్టీ షేర్లు నష్టాలను చవిచూశాయి. మెటల్ షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఆస్తుల నాణ్యత బాగా క్షీణించినట్లు పలు సర్వేలు తెలపడంతో ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లు పతనాన్ని చవిచూశాయి. చివరికి సెన్సెక్స్ 210 పాయింట్ల లాభంతో 55,792 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 52 పాయింట్లను ఆర్జించి 16,615 వద్ద ముగిసింది. ఈ స్థాయిలు ఇరు సూచీలకు కొత్త ముగింపు స్థాయిలు. నిఫ్టీకిది ఏడోరోజూ, సెన్సెక్స్‌కు నాలుగురోజూ లాభాల ముగింపు. విదేశీ ఇన్వెస్టర్లు రూ.345 కోట్ల షేర్లను అమ్మగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.266 కోట్ల షేర్లను విక్రయించారు. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 11 పైసలు బలహీనపడి 74.35 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఒడిదుడుకుల ట్రేడింగ్ ... దేశీయ స్టాక్ మార్కెట్ ఉదయం స్వల్ప నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 17 పాయింట్ల నష్టంతో 55,566, నిఫ్టీ 18 పాయింట్ల పతనంతో 16,545 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో తొలి సెషన్లో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 197 పాయింట్లు కోల్పోయి 55,386 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు క్షీణించి 16,495 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. చివరి అరగంటలో కొనుగోళ్ల జోరుతో సూచీలు రికార్డు స్థాయిల వద్ద ముగిశాయి. టీసీఎస్ రూ.13 లక్షల కోట్లు ఐటీ దిగ్గజ కంపెనీ టీసీఎస్ మార్కెట్క్యాప్ తొలిసారి రూ.13 లక్షల కోట్లకు అధిగమించింది. తద్వారా రిలయన్స్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో దేశీయ అతిపెద్ద కార్పొరేట్‌గా రికార్డు సృష్టించింది. ఐటీ షేర్ల ర్యాలీలో భాగంగా ఈ షేరు 2.5% ఎగసి రూ.3561 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి 2% లాభంతో రూ.3553 వద్ద స్థిరపడింది. ఈక్రమంలో కంపెనీ మార్కెట్ విలువ రూ.13.14 లక్షల కోట్లుగా నమోదైంది. టీసీఎస్ షేరు ఈ ఏడాది(2021)లో ఇప్పటికి వరకు 23.76 శాతం లాభపడింది. రిలయన్స్ రూ.13.70 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మార్కెట్లో మరిన్ని సంగతులు ►హైదరాబాద్ ఆధారిత కిమ్స్ హాస్పిటల్స్ షేరు 13 శాతం లాభపడి రూ.1,377 వద్ద ముగిసింది. జూన్ త్రైమాసికంలో ఉత్తమ ప్రదర్శన కనబరించడంతో పలు బ్రోకరేజ్ సంస్థలు ఈ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడం ర్యాలీకి కారణమైంది. ►డివిడెండ్ చెల్లింపును వాయిదా వేయడంతో హిందుస్తాన్ జింక్ 4% పతనమై రూ.318 వద్ద ముగిసింది. ►వివాదాస్పద ట్యూటికోరిన్ అంశంలో మద్రాసు హైకోర్టు వేదాంతకు నోటీసు లు జారీ చేయడంతో షేరు పదిశాతం పతనమై రూ.303 వద్ద స్థిరపడింది. -
కొత్త శిఖరాలకు సూచీలు
స్టాక్ మార్కెట్లో రికార్డ్ల పరంపర కొనసాగుతోంది. మంగళవారం ఇంట్రాడేలో కొత్త రికార్డ్లను సృష్టించిన సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం ముగింపులో కొత్త శిఖరాలకు చేరాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడటం సానుకూల ప్రభావం చూపించింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రోజులో ముగియనుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం కలసివచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 199 పాయింట్లు పెరిగి 41,021 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 63 పాయింట్లు ఎగసి 12,101 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలకు ఇవి జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపులు. వీటితో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా 31,876 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలో ముగిసింది. బ్యాంక్, ఆయిల్, గ్యాస్, వాహన, ప్రభుత్వ రంగ షేర్లు లాభపడ్డాయి. రియల్టీ, టెలికం, క్యాపిటల్ గూడ్స్ షేర్లు లాభాల స్వీకరణ కారణంగా నష్టపోయాయి. వాహన షేర్లకు ‘స్క్రాప్ పాలసీ’ లాభాలు ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించగలదన్న అంచనాలతో బ్యాంక్ షేర్లు పెరిగాయి. వాహన తుక్కు విధానాన్ని (స్క్రాపేజ్ పాలసీ) ప్రభుత్వం తీసుకు రానున్నదన్న వార్తల కారణంగా వాహన, వాహన విడిభాగాల షేర్లు పెరిగాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, మారుతీ సుజుకీ, ఐషర్ మోటార్స్, హీరో మోటొకార్ప్, టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటోలు 1–3 శాతం రేంజ్లో పెరిగాయి. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్, నిఫ్టీలు రోజంతా ఇదే జోరు చూపించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 254 పాయింట్ల లాభంతో 41,076 పాయింట్లకు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 77 పాయింట్లు ఎగసి 12,115 పాయింట్లకు చేరాయి. షాంఘై సూచీ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్‌టైమ్ హైల వద్ద ముగిసినప్పటికీ, వందకు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. అలహాబాద్ బ్యాంక్, చెన్నై పెట్రో, జైన్ ఇరిగేషన్, ఎంఫసిస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పలు షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరాయి. దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్సర్వ్, అదానీ గ్రీన్, పీఐ ఇండస్ట్రీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► యస్ బ్యాంక్ 8 శాతం లాభంతో రూ. 68 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. నిధుల సమీకరణ నిమిత్తం ఈ నెల 29న బోర్డ్ సమావేశం జరగనున్నదన్న వార్తలు దీనికి కారణం. ► ఎస్బీఐకు చెందిన క్రెడిట్ కార్డ్‌ల విభాగం, ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించిన నేపథ్యంలో ఎస్బీఐ షేర్ 2.4 శాతం లాభంతో రూ.344 వద్ద ముగిసింది.ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ మళ్లీ రూ.3 లక్షల కోట్లకు ఎగబాకింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా లాభపడ్డ రెండో షేర్ ఇదే. ► ఎల్ అండ్ టీ షేర్ 2 శాతం నష్టంతో రూ.1,335 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. రూ.8 పెరిగితే.. పది లక్షల కోట్లకు! రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 0.7 శాతం లాభంతో రూ.1,570 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాప్ రూ.9.96 లక్షల కోట్లకు పెరిగింది. ఈ షేర్ రూ.8 పెరిగితే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లకు పెరుగుతుంది. భారత్‌లో అత్యధిక మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇదే. -
నాలుగో రోజూ లాభాలే...
స్టాక్ మార్కెట్ లాభాలు వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ కొనసాగాయి. ఆర్థిక, ఇంధన, ఐటీ రంగ షేర్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. అయితే ట్రేడింగ్ ఆద్యంతం సెన్సెక్స్, నిఫ్టీలు లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి. రోజం తా 249 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 93 పాయింట్ల లాభంతో 38,599 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 11,464 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు పుంజుకోవడం కలసివచ్చింది. 249 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, విప్రో, ఏసీసీ తదితర కంపెనీల క్యూ2 ఫలితాలు పటిష్టంగా ఉండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ప్రపంచ మార్కెట్లు ఫ్లాట్‌గా ఉన్నా, మన మార్కెట్ వరుసగా నాలుగో రోజు లాభపడిందని శాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సునీల్ శర్మ తెలిపారు. కంపెనీల ఫలితాల సీజన్ అంచనాల కంటే మెరుగ్గానే ఉందని అంతేకాకుండా భవిష్యత్తు అంచనాలపై కంపెనీల యాజమాన్యాలు ఆశావహ ప్రకటనలు చేయడం సానుకూల ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. 20,000 కోట్ల డాలర్ల కంపెనీగా రిలయన్స్! రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 20,000 కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ గల తొలి కంపెనీగా అవతరించే సత్తా ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ తెలిపింది. ప్రస్తుతం 12,200 కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ గల ఈ కంపెనీ రెండేళ్లలో ఈ ఘనత సాధించగలదని ఈ సంస్థ అంచనా వేస్తోంది. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ఎస్ఎమ్ఈ ఎంటర్ప్రైజ్ స్పేస్‌లోకి ప్రవేశించడం, జియో ఫైబర్ బిజినెస్.. తదితర అంశాలతో రిలయన్స్ ఈ ఘనత సాధించనున్నదని పేర్కొంది. -
ఫలితాలపై పెరిగిన ఆశలు!!
కంపెనీలు వెలువరించే నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే ఆశావహ అంచనాలతో శుక్రవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు లాభాల్లో ముగియడం ఇది వరుసగా రెండో రోజు. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, సెన్సెక్స్, నిఫ్టీలు కీలకమైన స్థాయిలపైన ముగిశాయి. రోజంతా 264 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 160 పాయింట్ల లాభంతో 38,767 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 11,643 పాయింట్ల వద్దకు చేరింది. బ్యాంక్, ఆర్థిక రంగ, ఎఫ్ఎమ్సీజీ, విద్యుత్తు, కొన్ని వాహన షేర్లు లాభపడగా, టెలికం, క్యాపిటల్ గూడ్స్, కన్సూమర్ డ్యూరబుల్స్ షేర్లు నష్టపోయాయి. ఇక వారం పరంగా చూస్తే, ప్రధాన స్టాక్ సూచీలు నిరాశపరిచాయి. సెన్సెక్స్ 95 పాయింట్లు, నిఫ్టీ 23 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. 264 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... రూపాయి బలహీనపడినప్పటికీ, ఫలితాలపై ఆశావహ అంచనాలతో మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు ఆర్బీఐ నిర్దేశిత స్థాయి కంటే తక్కువగానే ఉంటాయన్న అంచనాలతో బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ లాభాల్లోనే ట్రేడింగ్‌ను ఆరంభించింది. ఆరంభ కొనుగోళ్ల జోరుతో లాభాలు పుంజుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. ట్రే డింగ్ చివర్లో కొనుగోళ్లు పుంజుకోవడంతో మళ్లీ లాభాల బాట పట్టింది. సెన్సెక్స్ ఒక దశలో 52 పా యింట్లు పతనం కాగా, మరో దశలో 212 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 264 పాయింట్ల రేంజ్లో కదలాడింది. స్టాక్‌మార్కెట్‌పై స్వల్ప కాలంలో ఎన్నికలు, కంపెనీల క్యూ4 ఫలితాలు ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. ► ఐటీసీ షేర్ 3.14 శాతం లాభంతో రూ.306 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► స్పైస్‌జెట్ షేర్ 9 శాతం లాభంతో రూ.110 వద్ద ముగిసింది. ఈ కంపెనీ కొత్తగా 16 బోయింగ్ 737–800 విమానాలను ఆర్డరిచ్చిందన్న వార్తలు దీనికి ప్రధాన కారణం. గత రెండు రోజుల్లో ఈ షేర్ 17 శాతం లాభపడింది. ► క్యూ4 ఫలితాల వెల్లడి కానున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్, టీసీఎస్‌లు మిశ్రమంగా ముగిశాయి. ఇన్ఫోసిస్ షేర్ 0.6 శాతం లాభంతో రూ. 748 వద్ద, టీసీఎస్ 0.2 శాతం నష్టంతో రూ.2,014 వద్ద ముగిశాయి. ► అంతర్జాతీయంగా వృద్ధిపై ఆందోళనతో ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడయ్యాయి. చైనా ఎగుమతుల గణాంకాలు ఒకింత మెరుగ్గా ఉండటంతో సానుకూల ప్రభావం కనిపించింది. షాంగై సూచీ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ఆరంభమై, అదేరీతిన ముగిశాయి. మే 31 నుంచి ఎన్ఐఐటీ ఓపెన్ ఆఫర్! జూన్ 14న ముగింపు ఎన్ఐఐటీ టెక్నాలజీస్ ఓపెన్ ఆఫర్ వచ్చే నెల 31నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ కంపెనీలో 30 శాతం వాటాను బారింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా కంపెనీ రూ.2,627 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు కారణంగా బారింగ్ కంపెనీ ఓపెన్ ఆఫర్లో మరో 26 శాతం వాటాను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ 26 శాతం ఓపెన్ ఆఫర్‌ను కూడా కలిపితే బారింగ్ సంస్థ మొత్తం రూ.4,890 కోట్ల ఎన్ఐఐటీ టెక్నాలజీస్ కోసం వెచ్చించనుంది. ఈ ఓపెన్ ఆఫర్ మే 31న ప్రారంభమై, జూన్ 14న ముగుస్తుంది. ఈ ఓపెన్ ఆఫర్లో భాగంగా 26 శాతం వాటాకు సమానమైన 1.62 కోట్ల షేర్లను బారింగ్ సంస్థ కొనుగోలు చేస్తుంది. -
సెన్సెక్స్ లాభం 173 పాయింట్లు
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై:స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 86.06 పాయింట్ల లాభంతో 28,793.81 దగ్గర, నిఫ్టీ 23.45పాయింట్ల లాభంతో 8,737.85 దగ్గర మొదలయ్యాయి. బ్యాంకింగ్, ఐటి, మెటల్ సెక్టార్లో కొనుగోళ్ల ట్రెండ్ కనిపిస్తోంటే, హెల్త్ కేర్ రంగంలో అమ్మకాలు భారీఎత్తున కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయ విలువ 9 పైసలు లాభపడి 62.15 దగ్గర ఉంది. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 155.07పాయింట్ల లాభంతో 28,671.66 దగ్గర, నిఫ్టీ 52.75పాయింట్ల లాభంతో 8,713.05 మొదలయ్యాయి.