
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారం ఆరంభంలోనే నస్టాల్లోకి జారుకున్నాయి. ఓపెనింగ్‌లో పాజిటివ్‌గా ఉన్నప్పటికీ తరువాత నెగిటివ్‌గా మారాయి. లాభనష్టాల ఊగిసలాటల మధ్య సెన్సెక్స్ ఏకంగా 424 పాయింట్ల నష్టంతో 60417వద్ద, నిఫ్టీ 135 పాయింట్లు కోల్పోయి 17720 వద్ద కొనసాగు తున్నాయి. తద్వారా నిఫ్టీ కీలకమైన 17750 మార్క్‌ను కోల్పోయింది. ముఖ్యంగా ఐటీ, మెటల్ నష్టాలు ప్రభావవితం చేస్తున్నాయి.
ఇండస్ ఇండ్ బ్యాంకు, హీరో మోటో, ఐటీసీ, యాక్సిస్ బ్యాంకు, అదానీ పోర్ట్ప్ ఎక్కువగా లాభపడుతుండగా, అదానీ ఎంటర్ ప్రైజెస్, దివీస్ ల్యాబ్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐషర్ మోటార్స్, హిందాల్కో భారీగా నష్టపోతున్నాయి. మరోవైపు ఎల్‌ఐసి, అదానీ ట్రాన్స్‌మిషన్, టాటా స్టీల్ ఈ రోజు ఫలితాలను ప్రకటించనున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి భారీ నష్టాల్లోఉంది. 73 పైసలు కుప్పకూలి 82.43 స్థాయికి రూపాయి పడిపోయింది.