TodayStockMarketClosingదేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతోముగిసాయి. ఆరంభంనుంచి నష్టాల్లోనే కొనసాగిన సేచీలు చివరికి వారాంతంలో నెగిటివ్‌గానే ముగిసాయి. సెన్సెక్స్ 202.36 పాయింట్లు లేదా 0.31 శాతం క్షీణించి 64,949వద్ద, నిఫ్టీ 55.10 పాయింట్లు లేదా 0.28 శాతం క్షీణించి 19,310 ముగిసాయి. ఎఫ్‌ఎంసిజి, పవర్ మినహా దాదాపుఅన్ని రంగాలునష్టపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 1.5 శాతం, మెటల్ ఇండెక్స్ దాదాపు 1 శాతం క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలుప్రతికూలంగా ముగిశాయి.
అయితే పెట్టుబడుల జోష్‌తో అదానీ గ్రూపు షేర్లుభారీగా లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ దాదాపు 3 శాతం ఎగిసాయి. మొత్తం పది అదానీ గ్రూప్ కంపెనీలు షేర్లు లాభాలనార్జించాయి. అలాగే జియో ఫైనాన్షియల్ లిస్టింగ్ డేట్ ప్రకటించడంతో రిలయన్స్ లాభపడింది. ఇంకా ఐషర్ మోటార్స్, నెస్లే, యాక్సిస్ బ్యాంకు లాభపడిన వాటిల్లోఉండగా కోల్ ఇండియా, హీరోమోటో కాప్, టెక్ మహీంద్ర, టీసీఎస్, హిందాల్కో టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. (ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి..ఈ పతనం ఎందాక?)
అటు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి గత ముగింపు 83.15తో పోలిస్తే స్వల్పంగా పెరిగి 83.10 వద్ద ముగిసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment