దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. ఆరంభంలో లాభాలతో ఉన్నప్పటికీ మిడ్‌సెషన్‌నుంచి ప్రాఫిట్ బుకింగ్‌తో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫెడ్ నిర్ణయం, జూలై సిరీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టుల గడువు ఈరోజున ముగియనుండటంతో దాదాపు అన్ని రంగాలు రెడ్‌లోకి జారుకోవడంతో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆటో, ఆయిల్ & గ్యాస్, మెటల్, ఎఫ్‌ఎంసిజి పేర్లలో అమ్మకాల ప్రభావితం చేశాయి.
అయితే ఫార్మా ఇండెక్స్ 3 శాతం, రియల్టీ ఇండెక్స్ 2 శాతం పెరిగాయి. చివరికి సెన్సెక్స్ 440.38 పాయింట్లు లేదా 0.66 శాతం క్షీణించి 66,267 వద్ద, నిఫ్టీ 118.40 పాయింట్లు లేదా 0.60 శాతం క్షీణించి 19,660 వద్ద ముగిసాయి. సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి
నిఫ్టీ టాప్ లూజర్స్‌లో ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్ ఉన్నాయి, సిప్లా, సన్ ఫార్మా, దివిస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్ ,భారతీ ఎయిర్‌టెల్ లాభపడ్డాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment