Sensex tanks, Nifty down: దేశీయస్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. ఆరంభంనుంచి నష్టాల్లోనే కొనసాగిన సూచీలు చివరల్లో కాస్త కోలుకున్నాయి. ఒక దశలో 1000 పాయింట్లు దాకా కుప్పకూలింది మార్కెట్. చివరకు సెన్సెక్స్ 677 పాయింట్ల మేర పతనమై 65783వద్ద, నిఫ్టీ 219 పాయింట్ల నష్టంతో 19,514 వద్ద ముగిసింది. అయితే ఇంట్రా-డే కనిష్ట స్థాయిలనుంచి కోలుకుంది.
ముఖ్యంగా అమెరికా సావరిన్ రేటింగ్‌ను ఫిచ్ కోత పెట్టడంతో గ్లోబల్ మార్కెట్లు ప్రతికూలంగా మారాయి. దీనికితోడు జూలై నెల ఆటోసేల్స్ ఆటో రంగ షేర్లను ప్రభావితం చేశాయి. దివీస్, నెస్లే, హెచ్‌యూఎల్, ఆసియన్ పెయింట్స్, టెక్ మహీంద్ర టాప్ గెయినర్స్‌గా ఉండగా, హీరోమోటో, టాటా స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్టీపీసీ టాప్ లూజర్స్‌గా మిగిలాయి. నిఫ్టీ బ్యాంక్ 597 పాయింట్లు పడిపోయి 44,996 స్థాయికి, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 501 పాయింట్లు 37,233కి పడిపోయింది. ఫలితంగా దాదాపు రూ. 2.61 లక్షల కోట్ల బిఎస్‌ఇ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) తుడిచిపెట్టుకుపోయింది.
అటు డాలరుమారకంలో రూపాయి 82.58 వద్ద నెగిటివ్‌గా ముగిసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment