Today August 2nd gold and silver prices: హైదరాబాద్ మార్కెట్‌లో వెండి, బంగారం ధరలు వరుసగా దిగి వస్తున్నాయి. శ్రావణ మాసంలో బంగారం, వెండి ఆభరణాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈనేపథ్యంలో వరుస సెషన్లలో బంగారం కాస్త నెమ్మదిస్తున్నారు.తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 300 రూపాయలు క్షీణించి రూ. 55,110 గా ఉంది.అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 330 రూపాయలు తగ్గి రూ. 66110గా ఉంది. అటు వెండి ధర కూడా తగ్గింది. కిలోవెండి ధర 700 రూపాయలు పతనమై రూ. 80,300గా ఉంది. ( దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు (ఆగస్టు 2) బంగారం ధరలకోసం క్లిక్ చేయండి)
దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర 1 కేజీ వెండి ధర
ఢిల్లీ- రూ.77,300
చెన్నై- రూ. 80,300
ముంబై - రూ. 77,300
కోల్‌కతా - రూ. 78,000
బెంగళూరు - 76,500
ఎంసీఎక్స్ షాక్
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మంగళవారం భారత మార్కెట్‌లో క్షీణించిన పసిడి ధరలు ఆగస్టు 2, బుధవారం బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి. అక్టోబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ MCXలో రూ. 182 లేదా 0.31 శాతం స్వల్ప పెరుగుదను నమోదు చేశాయి.
అంతర్జాతీయ మార్కెట్
అమెరికా డాలర్‌తోపోలిస్తే బుధవారం బంగారంధర పెరిగింది. ట్రెజరీ దిగుబడులు, ఆసియా స్టాక్‌లు ఫిచ్ అమెరికా ట్రిపుల్-ఎ క్రెడిట్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడంతో డాలర్ బలహీన పడింది. దీంతో సురక్షితమైన బులియన్‌పై ఆసక్తిని పెంచిందని రాయిటర్స్ నివేదించింది. తాజా మెటల్ నివేదిక ప్రకారం స్పాట్ బంగారం 0.2 శాతం పెరిగి ఔన్స్‌కు 1,946.97 డాలర్లగానూ, అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 1,984కి డాలర్లు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment