భారతదేశంలో జూన్ ప్రారంభం నుంచి పసిడి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. రెండు రోజులకు ముందు తగ్గిన గోల్డ్ రేటు.. మళ్ళీ మెల్లగా తగ్గుముఖం పట్టాయి. దీంతో బంగారం ధర ఈ రోజు (జూన్ 18) స్వల్పంగా తగ్గింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడలలో బంగారం ధరలు కొంత మేర తగ్గాయి. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66200 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.72220 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గినట్లు తెలుస్తోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి నేడు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66350 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72470 వద్ద ఉంది. నిన్న రూ. 200 నుంచి రూ. 220 వరకు తగ్గినా బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ రూ. 100 నుంచి రూ. 110 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, ఢిల్లీలలో గరిష్టంగా రూ. 110 తగ్గిన గోల్డ్ రేటు చెన్నైలో మాత్రం గరిష్టంగా రూ. 60 మాత్రమే తగ్గింది. కాబట్టి చెన్నైలో పసిడి ధరలు వరుసగా రూ. 66950 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 73040 (24 క్యారెట్స్ 10 గ్రా) వద్ద నిలిచాయి. నిన్న రూ. 150 నుంచి రూ. 170 వరకు పెరిగిన గోల్డ్ రేటు ఈ రోజు మళ్ళీ రూ. 50 నుంచి రూ. 60 మాత్రమే తగ్గింది.
వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ రోజు (జూన్ 18) ఒక కేజీ వెండి ధర రూ. 96000 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు రూ. 400 వరకు తగ్గింది. ఇది బంగారం, వెండి కొనేవారికి శుభవార్త అనే చెప్పాలి.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment