![netflix down for more than 11000 users - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/17/netflix.jpg.webp?itok=WJHZQ6J1)
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ ప్రసారాలు ఆదివారం (ఏప్రిల్ 16) కొంత మంది సబ్‌స్క్రయిబర్లకు నిలిచిపోయాయి. ఔటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Downdetector.com ప్రకారం.. ఆదివారం సాయంత్రం యునైటెడ్ స్టేట్స్‌లో 11,000 కంటే ఎక్కువ మంది యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ ప్రసారాల్లో అంతరాయం ఏర్పడింది.
(Dulquer Salmaan: రూ.3 కోట్లు పెట్టి దుల్కర్ సల్మాన్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా?)
భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 5 గంటలకు తలెత్తిన అంతరాయం 6.49 గంటలకు ముగిసింది. దీంతో ‘లవ్ ఈజ్ బ్లైండ్: ది లైవ్ రీయూనియన్’ స్ట్రీమింగ్ ఆలస్యం అయింది. వెనెస్, నిక్ లాచీ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమం లాస్ ఏంజెల్స్ నుంచి సాయంత్రం 5 గంటలకు ( భారత కాలమానం ప్రకారం ఉదయం 5:30) ప్రారంభం కావాల్సిఉంది. ఈ షో కోసం సబ్‌స్క్రయిబర్‌లు ప్రారంభ సమయానికి 10 నిమిషాల ముందే నుంచి వేచిఉన్నారు. ఇంతలో అంతరాయం తలెత్తడంతో ఒక గంటకు పైగా యూజర్లు వేచిఉన్నారు.
ఈ కార్యక్రమ ప్రసారం చివరకు సాయంత్రం 6:16 (పసిఫిక్ కాలమానం) గంటలకు ప్రారంభమైంది. ఆలస్యంగా మేల్కొన్న నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు క్షమాపణలు చెప్పింది. లవ్ ఈజ్ బ్లైండ్ లైవ్ రీయూనియన్ షో స్ట్రీమింగ్ ఆలస్యమైనందుకు చింతిస్తున్నామంటూ సాయంత్రం 6:29 గంటల (పసిఫిక్ కాలమానం) సమయంలో ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment