లాభాలు పాయే, ఫ్లాట్‌గా సూచీలు | Sensex Falls Over 150 Points now turns flat | Sakshi
Sakshi News home page

లాభాలు పాయే, ఫ్లాట్‌గా సూచీలు

Published Tue, Jul 19 2022 10:02 AM | Last Updated on Tue, Jul 19 2022 10:32 AM

Sensex Falls Over 150 Points now turns flat - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్‌ నష్టాల్లో  ట్రేడ్‌ అవుతోంది. సెన్సెక్స్ 179 పాయింట్ల నష్టంతో  54,341 వద్ద,నిఫ్టీ 53 పాయింట్లు క్షీణించి 16,225 వద్దకు చేరాయి. ప్రస్తుతం నష్టాలను పరిమితం చేసుకుని ఫ్లాట్‌గా కొన సాగుతున్నాయి.  ఐటీ, బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు నష్టపోతున్నాయి. 

హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ టాప్ నిఫ్టీ లూజర్‌గా ఉంది.ఎస్‌బీఐ లైఫ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్ కూడా వెనుకబడి ఉన్నాయి. అలాగే దేశంలో అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్ అండ్ టి, ఐసిఐసిఐ బ్యాంక్, టైటాన్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ హిందుస్థాన్ యూనిలీవర్ టాప్ లూజర్‌గా ఉన్నాయి. టాటా స్టీల్,  ఎంఅండ్‌ ఎం అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ,  సన్ ఫార్మా లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా సోమవారంసెన్సెక్స్‌ ఏకంగా 740 పాయింట్లు ఎగిసి 54,521 వద్ద,  నిఫ్టీ 229 పాయింట్లు పెరిగి 16,279 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. 

మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయి తొలిసారి డాలరు మారకంలో 80 రూపాయిల స్థాయికి పడిపోయింది. ఈ వారం సెంట్రల్ బ్యాంక్ సమావేశాలపై, ముఖ్యంగా యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్‌పై ట్రేడర్లు దృష్టి సారించినందున, మంగళవారం నాడు తొలిసారిగా రూపాయి డాలర్‌కు 80కి చేరుకుంది. దీంతో మరింత క్షీణత  తప్పదనే ఆందోళన నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement