
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో పప్రారంభమైనాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో వరుసగా ఏడో సెషన్‌లోనూ లాభాల జోరు కంటిన్యూ చేశాయి. కానీ లాభాల స్వీకరణతో నష్టాల్లోకి మళ్లింది. ప్రస్తుతం 81 పాయింట్లు ఎగిసి సెన్సెక్స్ 62751 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 18646 వద్ద కొనసాగుతుండటం విశేషం. ఆటో మెట్ రంగ షేర్లు లాభాల్లో ఉండగా, బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టోతున్నాయి.
హిందాల్కో, ఎం అండ్ ఎం, బజాజ్ ఆటో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డా.రెడ్డీస్ లాభాల్లో టాప్‌లో ఉండగా, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, బిపిసిఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ బ్యాంక్ టాప్ లూజర్లుగా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 11 పైసలు ఎగిసి 81.63 వద్ద ఉంది.
జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ2)దేశీయ జీడీపీ డేటా బుధవారం సాయంత్రం 5:30 గంటలకు విడుదల కానుంది. మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం పై టట్రేడర్లు దృష్టిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment