
Gold Price Today: పవిత్ర శ్రావణ మాసం ప్రారంభమైంది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ నెలలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. శ్రావణ మాసం తొలి రోజునే బంగారం కొనేవారికి శుభవార్త.. ఈ రోజు (ఆగస్ట్ 17) బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయిన నేపథ్యంలో దేశీయంగా కూడా పసిడి ధరలు తగ్గాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేవారికి ఊరట లభించింది.
దేశవ్యాప్తంగా బంగారం ధర గురువారం 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.350 తగ్గింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.380 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం నమోదైన బంగారం ధరలను పరిశీస్తే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,100గా ఉంది. బుధవారంతో పోల్చితే 10 గ్రాములపై రూ. 350 తగ్గింది. అదేవిధంగా 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 59,020లుగా ఉంది. బుధవారంతో పోల్చితే రూ. 380 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లోనూ బంగారం ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి.
వెండి ధర తగ్గుముఖం
బంగారం తర్వాత అత్యంత ప్రీతికరమైన లోహం వెండి ధర కూడా గురువారం కాస్త తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర రూ.500 మేర తగ్గింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 75,700గా ఉంది. అంతకు ముందు రోజు రూ.76,200గా ఉండేది.
ఇదీ చదవండి: దేశంలోని వివిధ నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు