
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ సంకేతాలకు తోడు, రిటైల్ ద్రవ్యోల్బణం, ఐటీ మేజర్ కంపెనీల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 121 పాయింట్లు నష్టపోయి 57505 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు నష్టంతో 17095 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు బలహీనంగా ఉన్నాయి.
సెప్టెంబరు రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరుకుందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. దీంతో బరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మరింత వడ్డీరేట్ల పెంపు ఆందోళన నెలకొంది. అటు ఆహార ధరలు పెరగడంతో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 7.41 శాతానికి పెరిగింది.మరోవైపు ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ క్యూ 2 ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి.