భారీగా నష్టపోతున్న సూచీలు, మద్దతు స్థాయిలు బ్రేక్‌  | Sensex Nifty opens in red on global clues | Sakshi
Sakshi News home page

StockMarketOpening: భారీ నష్టాలు, మద్దతు స్థాయిలు బ్రేక్‌ 

Published Thu, Nov 10 2022 9:33 AM | Last Updated on Thu, Nov 10 2022 9:41 AM

Sensex Nifty opens in red on global clues - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. 

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్‌ 61 వేలు,  నిఫ్టీ 18100స్థాయి దిగువకు చేరాయి . ఫార్మా   మినహా, ఆటో ఇండెక్స్ అత్యధికంగా 1 శాతానికి పైగా క్షీణించింది. ఇంకా మెటల్, బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 335 పాయింట్లను కోల్పోయి 60698 వద్ద, నిఫ్టీ 102పాయింట్ల నష్టంతో 18155 వద్ద  కొనసాగుతున్నాయి.

నైకా షేర్లు 3 శాతం ఎగిసాయి. సిప్లా, హెచ్‌యూఎల్‌, డా. రెడ్డీస్‌, దివీస్‌, భారతి  ఎయిర్టెల్‌ లాభ పడుతుండగా, టాటామోటార్స్‌, మారుతి సుజుకి, అపోలో హాస్పిటల్స్‌, పీఎన్‌బీ, యాక్సిస్‌, ఐసీఐసీఐ, టెక్‌ మహీంద్ర, ఐషర్‌ మోటార్స్‌, ఇన్ఫోసిస్‌  నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 15 పైసలు నష్టంతో  81.56 వద్ద ఉంది.   బుధవారం 81.44  వద్ద ముగిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement