
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అయితే ఆరంభంలో బాగా నష్టపోయిన సూచీలు మిడ్‌సెషన్‌లో ఒక దశలో 59 వేల స్తాయిని కోల్పోయింది.తిరిగి అదే రేంజ్‌లో పుంజుకుంది. చివరికి సెన్సెక్స్ 337 పాయింట్లు క్షీణించి 59119 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు నష్టంతో 17629 వద్ద ముగిసింది.
గురువారం ఎఫ్‌అండ్‌ఓ గడువు ముగిసే రోజు కావడంతో తీవ్ర ఒడిదుడుకులు కొనసాగాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడినిఎదుర్కొన్నాయి.ఐటీ, బ్యాంకింగ్ షేర్ల నష్టాలు మరింత ఒత్తిడి పెంచాయి. ఇన్ఫోసిస్ షేర్లు ఏడు సెషన్లలో ఆరు సెషన్లకు పడిపోయి 16 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ,కోల్ ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్ భారీగా నష్టపోయాయి. టైటన్, హెచ్‌యూఎల్, ఏసియన్ పెయింట్స్, ఐఫర్ మోటార్స్, బ్రిటానియా లాభపడ్డాయి.
రుపీ ఢమాల్
అటు డాలరు మారకంలో రూపాయి ఆల్ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. 91 పైసలు కుప్పకూలి 80.70 చేరింది. ఆ తరువాత మరింత క్షీణించి ఏకంగా 99 పైసలు పతనమై 80.95 వద్ద రికార్డు కనిష్టానికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment