దేశంలో బంగారం ధరలు స్తబ్దుగా ఉన్నాయి. ఇటీవల కాస్త పుంజుకున్న ధరలు సోమవారం మాత్రం అక్కడక్కడే కదలాడుతున్నాయి. గతం వారం పది గ్రాములకు రూ. 60 వేలకు పైన ఉన్న పసిడి ఒక దశలో 60వేల దిగువకు వచ్చింది. ప్రస్తుతం మద్దతు స్థాయిల వద్ద కొనసాగుతోంది. గత వారం బాగా పెరిగిన వెండి ధర ప్రస్తుతం హైదరాబాద్‌లో 80 వేల దిగుకు చేరింది.
హైదరాబాద్‌లో స్వల్పంగా ఎగిసిన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.55,150 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.60,160 పలుకుతోంది. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ఇక వెండి రూ. 200 తగ్గి 78,300 గా ఉంది. దాదాపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.60,310 పలుకుతోంది. ఢిల్లీలో కిలో వెండి 75,100గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
ఎంసీఎక్స్‌లో పతనం
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో (ఆగస్ట్ 7, 2023 సోమవారం)బంగారం , వెండి ధరలు రెండూ పతనాన్ని నమోదు చేశాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్, రూ. 91 లేదా 0.15 శాతం స్వల్ప తగ్గుదలని నమోదు చేసిన తర్వాత, 10 గ్రాములకు రూ.59,436గా ఉంది. క్రితం ముగింపు రూ.59,527గా నమోదైంది. అదేవిధంగా, సెప్టెంబరు 5, 2023న వెండి ఫ్యూచర్లు రూ. 300 లేదా 0.41 శాతం క్షీణతను చవిచూశాయి. మునుపటి ముగింపుతో పోలిస్తే MCXలో కిలో రూ. 72,178 వద్ద రిటైల్ అవుతున్నాయి. ఎక్సైజ్ సుంకం, మేకింగ్ ఛార్జీలు, పన్నుల వంటి నిర్దిష్ట పారామితుల ఆధారంగా వివిధ ప్రాంతాల్లో బంగారం ధర మారుతూ ఉంటుందనేది గమనించాలి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధర
అమెరికాలో జాబ్ గ్రోత్‌మందగింపు నేపథ్యంలో సోమవారం బంగారం ధరలు మూడు వారాల కనిష్టానికి పడిపోయాయి. ఉద్యోగ వృద్ధి డాలర్, బాండ్ ఈల్డ్స్ ఫలితాలు పసిడి గరిష్ట స్థాయినుంచి దిగజారాయి.. తాజా నివేదిక ప్రకారం, స్పాట్ గోల్డ్ 0325 ఔన్స్‌కు 1,940.99 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. స్పాట్ వెండి ఔన్స్‌కు 0.3శాతం తగ్గి 23.54 డాలర్ల వద్ద , ప్లాటినం 0.4శవాతం లాభంతో 926.05డాలర్లు వద్ద, పల్లాడియం 0.5శాతం లాభపడి 1,263.26డాలర్లకి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment