డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడితే ప్రమాదాలు జరుగుతాయని అధికారులు హెచ్చరికలు చేస్తుంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో కూడా ప్రమాదానికి సెల్‌ఫోనే కారణం.. కానీ ఇది పూర్తిగా విభిన్నం. ఏ వాహనం అతన్ని టచ్ చేయకుండానే బైక్‌పై నుంచి కిందపడ్డాడు. ఈ తీరు చూస్తే తప్పకుండా నవ్వు ఆపుకోలేరు.
వీడియోలో చూపిన విధంగా.. ఫోన్ మాట్లాడుతూ ఓ వ్యక్తి బైక్‌ను నడుపుతున్నాడు. కూడలిలో సిగ్నల్ రావడంతో బైక్‌ను నిలిపివేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఓ పక్క ఫోన్‌ను చెవి వద్ద పెట్టుకుని మరో పక్క బైక్‌ను అదుపు చేయలేక పోయాడు. రింగు రోడ్డుపై రౌండ్‌లు తిరుగుతూ కిందపడిపోయాడు. విచిత్రమేమంటే.. కిందపడిపోతున్నా.. అతను సెల్‌ఫోన్ విడవకపోవడం గమనార్హం.
Important call ayy untadi 🏃♂️🏃♂️😂😂
— Pakkinti Uncle (@Idly_Baba) July 18, 2023
pic.twitter.com/JHAJj5LQGj
ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పాపం.. చాలా ముఖ్యమైన కాల్ అనుకుంటా.. కిందపడిపోతున్నా చెవి వద్ద ఫోన్ తీయకుండా మాట్లాడుతున్నాడంటూ కామెంట్లు పెట్టారు.
ఇదీ చదవండి: Viral Video: అమ్మా! తల్లి ఏం డేరింగ్?..ఏకంగా సింహంతో ఒకే ప్లేట్‌లో..
Comments
Please login to add a commentAdd a comment