Today Gold and Silver Price పండుగల వేళ బంగారం ప్రియులకు తీపి కబురు. భారతీయ మార్కెట్లో రెండు రోజులు వరుసగా పెరిగిన వెండి బంగారం ధరలు (సెప్టెంబర్ 13, 2023 )బుధవారం దిగి వచ్చాయి. దేశవ్యాప్తంగా వెండి బంగారం ధరలు తగ్గముఖం పట్టాయి.22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.340 మేర తగ్గింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.380లు తగ్గి 59,450 పలుకుతోంది. వెండి కిలో ఏకంగా వెయ్యి రూపాయిలు క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 73,500గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో పతనాన్ని నమోదు చేశాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్, రూ. 74 లేదా 0.13 శాతం స్వల్ప తగ్గుదల నమోదు చేసిన తర్వాత, 10 గ్రాములకు రూ. 58,592 వద్ద ఉంది. క్రితం ముగింపు రూ.58,626గా నమోదైంది. అదేవిధంగా డిసెంబర్ 5, 2023న వెండి ఫ్యూచర్స్ రూ. 385 లేదా 0.54 శాతం పతనాన్ని చవిచూశాయి .మునుపటి ముగింపు రూ. 71,934తో పోలిస్తే కిలోకు రూ. 71,750 వద్ద ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బుధవారం నాడు బంగారం ధరలు పడిపోయాయి. అయితే మునుపటి సెషన్‌లో రెండు వారాల కనిష్ట స్థాయికి స్వల్పంగా అధిగమించాయి. . అమెరికా మార్కెట్, ద్రవ్యోల్బణ డేటా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచుతుందా అనే కీలక అంశాలకోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. తాజా మెటల్ నివేదిక ప్రకారం స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.1 శాతం తగ్గి 1,910.87 డాలర్లు వద్ద ఉంది. ఆగస్టు 25 తరువాత నిన్న(మంగళవారం) 1,906.50 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.8 శాతం తగ్గి 22.92 డాలర్ల స్థాయికి చేరుకుంది.
మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు ప్రారంభ నష్టాలనుంచి భారీగా కోలుకున్నాయి.సెన్సెక్స్ ఏకంగా 330 పాయింట్లకు పైగా ఎగియగా, నిఫ్టీ 20090 వద్ద రికార్డు స్తాయిలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment