సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ వెబ్‌సైట్ స్తంభించింది. నిర్వహణ సమస్య వలన నిలిచిపోయినట్లు మార్గదర్శి పేర్కొంది. త్వరలో పునరుద్ధరిస్తామంటూ మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ వెల్లడించింది. అకస్మాతుగా మార్గదర్శి వెబ్‌సైట్ స్తంభించడంపై ఖాతాదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, మార్గదర్శి వ్యవహారంలో అనేక అక్రమాలు గుర్తించామని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. శుక్రవారం.. ఏపీ సీఐడీ కీలక ప్రెస్‌మీట్ నిర్వహించింది. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని, మార్గదర్శిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని సీఐడీ వెల్లడించింది.
‘‘మార్గదర్శిపై నమోదైన ఏడు క్రిమినల్ కేసులపై విచారణ చేస్తున్నాం. ఉషాకిరణ్ మీడియా లిమిటెడ్, ఉషోదయ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులు అటాచ్ చేస్తూ హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆర్డర్స్ నంబర్ 104,116ల ద్వారా మొత్తంగా 1035 కోట్ల చరాస్తులు అటాచ్ చేశాం. కోర్డులోనూ అటాచ్ మెంట్ పిటీషన్ దాఖలు చేశాం. రెండు క్రిమినల్ కేసులలో 15 మందిపై చార్జిషీట్ వేశాం. ఈ రెండు కేసుల్లో ఏ1 రామోజీ రావు, ఏ2 శైలజాకిరణ్ తదితరులపై చార్జి షీట్ నమోదైంది’’ అని సీఐడీ పేర్కొంది.
చదవండి: ఇదో కార్పొరేట్ ఫ్రాడ్.. మార్గదర్శి మోసాలపై ఏపీ సీఐడీ కీలక ప్రెస్‌మీట్
Comments
Please login to add a commentAdd a comment