
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడిగా చెప్పుకునే రియాజ్ భాటితో లింకులు ఉన్నాయని రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. ఫడ్నవీస్, రియాజ్ భాటి కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రియాజ్ భాటి నకిలీ పాస్‌పోర్టు కేసులో పట్టుబడితే రెండు రోజుల్లోనే అతనిని విడుదల చేశారని, ఆ తర్వాత ఫడ్నవీస్‌తో కలిసి ఒక ఫంక్షన్‌లో కనిపించారని వెల్లడించారు. నవాబ్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఫడ్నవీస్‌పై ఇంకా వెయ్యాల్సిన బాంబులు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఫడ్నవీస్ సీఎంగా ఉన్నప్పుడు నకిలీ నోట్ల రాకెట్‌ని చూసీచూడనట్టు వదిలేశారని, నేరచరిత కలిగిన వారిని ప్రభుత్వ బోర్డుల్లో నియమించారని తీవ్ర విమర్శలు చేశారు.
పందితో పోరాడితే..
నవాబ్ ఆరోపణల తర్వాత ఫడ్నవీస్ ట్విటర్ వేదికగా ప్రముఖ నాటక రచయిత జార్జ్ ఫెర్నాండెజ్ షా కొటేషన్‌ని పోస్టు చేశారు. ఎవరి పేర్లు ప్రస్తావించకుండా ‘నేను చాలా కాలం క్రితమే ఒక విషయం నేర్చుకున్నాను. పందితో ఎప్పుడూ కొట్లాడకూడదు. అలా చేస్తే మనకి బురద అంటుకుంటుంది. పందికి అది ఇష్టంగా అనిపిస్తుంది’ అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు.
చదవండి: పెళ్లికి ముందే అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment