
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ సేవలు గడిచిన 24 గంటల్లో పలుసార్లు నిలిచిపోయాయి. యూజర్లు టెలిగ్రామ్‌లో మెసేజ్‌లు పంపడం, డౌన్‌లోడ్, లాగిన్ చేసేపుడు ఇబ్బందులకు గురైనట్లు ఫిర్యాదు చేశారు.
దాదాపు 6700 మందికిపై టెలిగ్రామ్ పని చేయడం లేదని ఫిర్యాదులు చేసినట్లుగా డౌన్‌డిటెక్టర్ డేటా ద్వారా తెలిసింది. మొత్త ఫిర్యాదు చేసిన వారిలో 49 శాతం మంది మెసేజ్‌లు పంపించడంతో ఇబ్బందులు ఎదురైనట్లు చెప్పారు. 31 శాతం మంది యాప్ పనిచేయలేదని, 21 శాతం మంది లాగిన్ సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు.
Twitter users to telegram users right now#telegramdown pic.twitter.com/X4gP9hYn1R
— Dr.Duet🇵🇸 (@Drduet56) April 26, 2024
ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, లక్నో, పాట్నా, జైపుర్, అహ్మదాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందినట్లు తెలిసింది.
అయితే ఇప్పటివరకు టెలిగ్రామ్ ఈ సమస్యపై స్పందించలేదు. ఇలా ప్రముఖ యాప్‌లో సమస్య ఎదురైందనే వార్త క్షణాల్లో వైరల్ అవ్వడంతో వాటికి సంబంధించి ట్విటర్‌లో చాలా మీమ్స్ చక్కర్లు కొట్టాయి.
telegram users rn#telegramDownpic.twitter.com/wz7KYfLwIS
— F. 🇵🇸🚩 (@aaatankwaadi) April 26, 2024
Comments
Please login to add a commentAdd a comment