సాక్షి, ముంబై: పసిడి ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. ఫెడరల్ రిజర్వ్ పాలసీ వడ్డీరేట్లను పెద్దగా పెంచకపోవచ్చనే పెంచనుందన్న సంకేతాల నడుమ గురువారం బంగారం ధరలు క్షీణించాయి. దీనికి తోడు ఈక్విటీ మార్కెట్ల దన్ను, డాలరు మారకంలో దేశీయ రూపాయి బలంతో పసిడి పుంజుకుంది.
గురువారం బంగారం ధర రూ.250 తగ్గిన 10గ్రాం 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 24 క్యారెట్ల బంగారం ధర 270 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.47, 900గా ఉంది. 24 క్యారెట్స్ పసిడి ధర రూ. 52, 250 గా ఉంది.
జూన్ డెలివరీకి సంబంధించిన ఎంసీక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ. 324 లేదా 0.63 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.50,833 వద్ద ఉన్నాయి. అలాగే ఎంసీఎక్స్ వెండి ఫ్యూచర్స్ రూ.447 లేదా 0.72 శాతం క్షీణించి రూ.61,529కి చేరుకుంది. స్పాట్ గోల్డ్ 3.24 డాలర్లు తగ్గి 1,849 డాలర్ల రేంజ్‌కి పడిపోయింది. దేశీయంగా స్పాట్ గోల్డ్ ధర 0.12 శాతం లేదా రూ.178 తగ్గింది.
అధిక ట్రెజరీ దిగుబడుల కారణంగా అంతర్జాతీయ ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా బంగారం ధరలు గురువారం తగ్గాయి. దేశీయ ఈక్విటీలలో సానుకూల ధోరణి మరియు బలహీనమైన డాలర్ కారణంగా డాలరుమారకంలో 77.54 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment