
సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్ల బలహీనతల ప్రభావంతో సూచీలు గ్యాప్ డౌన్ తో ఓపెనయ్యాయి. సెన్సెక్స్ 121 పాయింట్లు కోల్పోయి 57798 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 17146 వద్ద కొనసాగాయి. కానీ మొదటి గంట తరువాత సూచీలు అనూహ్యంగా లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ ఏకంగా 205 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్లు ఎగిసి ట్రేడ్ అవుతోంది.
బజాజ్ ఆటో, ఐసీఐసీఐ, ఐషర్ మోటార్స్, ఎస్‌బీఐ, హీరో మోటో కార్ప్, లాభపడు తుండగా, ఎం అండ్ ఎండ్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టాలతో 82.38 వద్ద ఉంది.