
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. రోజంతా ఊగిసలాడిన సూచీలు చివరికి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా బ్యాంకులు, రియాల్టీ, ఐటీ షేర్ల నష్టాలు ప్రభావితంచేశాయి. చివరికి సెన్సెక్స్ 391 పాయింట్లు కుప్పకూలి 57235 వద్ద, నిఫ్టీ 106 పాయింట్ల నష్టంతో 17014 వద్ద క్లోజ్ అయ్యాయి. అయితే సెన్సెక్స్ 57200 మార్క్‌ను, నిఫ్టీ 17వేల మార్క్‌ను నిలబెట్టుకున్నాయి.
ఫలితాల షాక్‌తో విప్రో షేరు ఏకంగా 6శాతం నష్టపోయింది. అలాగే ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, అదానీ పోరర్ట్స్, ఎల్ అండ్ టీ భారీగా నష్టపోయాయి. అయితే ఫలితాలు, డివిడెండ్ నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ 4 శాతం ఎగిసింది. ఇంకా సన్ ఫార్మ, కోల్ ఇండియా, బ్రిటానియా, గ్రాసిం బాగా లాభపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్పల్ప లాభంతో 82.35 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment