సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో బుధవారం నష్టాలతో ప్రారంభమైనాయి. వరుసగా ఏడో రోజు నష్టపోతున్న సెన్సెక్స్ 287 పాయింట్లు కుప్పకూలి 56821 వద్ద, నిఫ్టీ 89 పాయింట్ల నష్టంతో 16918 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా కీలక సూచీలు రెండు మద్దతు స్థాయిలకు దిగువకు చేరాయి. సెన్సెక్స్ 57వేల స్థాయిని, నిఫ్టీ 17వేల స్థాయిని కోల్పోయి మరింత బలహీన సంకేతాలిచ్చాయి.
ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఓఎన్టీజీ, ఎన్టీపీసీ హెచ్‌డీఎఫ్‌సీ నష్టపోతుండగా, సన్‌ఫార్మ, పవర్‌గగ్రిడ్, ఎం అండ్ ఎండ, డా.రెడ్డీస్, టాటా మోటార్స్ లాభాల్లో ఉన్నాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి 36 పైసలు కోల్పోయి 81.88 వద్ద సరికొత్త ఆల్ టైం కనిష్టానికి పతనమైంది.
Comments
Please login to add a commentAdd a comment