సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లుభారీ నష్టాలతోముగిసాయి. ఆరంభంలోనే భారీగా నష్టపోయిన సెన్సెక్స్ ఆ తరువాత మరింత అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అన్ని రంగాల షేర్లలోలనూ ఇన్వెస్టర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ ఏకంగా 872 పాయింట్లు కుప్పకూలి 58773 వద్ద ముగిసింది. తద్వారా 59వేల స్థాయిని కూడా కోల్పోయింది. నిఫ్టీ కూడా 267 పాయింట్ల నష్టంతో 17490 వద్ద స్థిరపడింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ, మెటల్, రియల్టీ స్టాక్‌లలో సెల్లింగ్ ప్రెజర్ మార్కెట్‌ను ప్రభావితం చేసింది.
టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హీరో, కోటక్ మహీంద్ర, యాక్సిస్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్, విప్రో, యూపిఎల్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. టాటా కన్జూమర్, ఐటీసీ, కోల్ ఇండియా, బ్రిటానియా, నెస్లే లాభపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపాయి 12 పైసలు నష్టపోయి 79.87 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment