
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతోముగిసాయి. ఆరంభంలోనే దాదాపు 200 పాయింట్లకు పైగా ఎగిసిన మార్కెట్ రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగింది. ఒక దశలో 300 పాయింట్ల మేర లాభపడింది. కానీ వెంటనే అమ్మకాల ఒత్తిడి కారణంగా చివరికి నష్టాల్లోనే ముగిసింది. సెన్సెక్స్ 67 పాయింట్లు నష్టపోయి 52482 వద్ద, నిఫ్టీ 27 పాయింట్లు క్షీణించి 15721 వద్ద స్థిరపడింది. డై గరిష్టంనుంచి సెన్సెక్స్ స్లిప్స్ 393 పాయింట్లు నిఫ్టీ 118 పాయింట్లు పతనమైనాయి. రూపాయి బలహీనతతో ఒక్క ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లలోఅమ్మకాల ఒత్తిడి కనిపించింది.
ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, ఎఫ్ఎంసిజి అత్యధికంగా నష్టపోయాయి. శ్రీ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, యూపీఎల్, ఐసిఐసిఐ బ్యాంక్ భారీగా నష్టపోగా, కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, డివిస్ లాబొరేటరీస్, ఇన్ఫోసిస్ మరియు టెక్ మహీంద్రా టాప్ ఇండెక్స్ లాభపడ్డాయి..
Comments
Please login to add a commentAdd a comment