సాక్షి, ముంబై: వరుసగా నాలుగో రోజు దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీ పతనాన్ని నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ 17700 స్థాయి వద్ద ఊగిసలాడింది. ఆ తరువాత అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 785 పాయింట్లు కుప్పకూలి 60వేల దిగువకు చేరింది. అటు కుప్పకూలిన నిఫ్టీ 235 పాయింట్ల నష్టంతో 17600 స్థాయిని కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 927.74 పాయింట్లు క్షీణించి 59,744.98 పాయింట్ల వద్ద, నిఫ్టీ 272.40 పాయింట్లు క్షీణించి 17,554.30 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇప్పటికే మంగళవారం నాటి గణాంకాల ప్రకారం బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ.265.21 లక్షల కోట్ల నుంచి రూ.2.79 లక్షల కోట్ల నుంచి రూ.262.41 లక్షల కోట్లకు పడిపోయింది. అటు హిండెన్‌బర్గ్ ఆరోపణలతో వరుస నష్టాలతో అదానీకి భారీ షాకే తగులుతోంది. అదానీ గ్రూప్ కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ మంగళవారం రూ.8,07,794 కోట్ల నుండి రూ. 7,74,356 కోట్లకు పడి పోయింది. ఇది దేశంలో మూడవ అత్యంత విలువైన సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎం క్యాప్ రూ. 9,12,986 కోట్ల కంటే తక్కువ కావడ గమనార్హం.
జనవరి 24న ప్రారంభమైన అమ్మకాల సెగతో అదానీ గ్రూప్ స్టాక్‌లు గత పంతొమ్మిది సెషన్లలో రూ.11,43,702 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఫలితంగా సంస్థ ఎం క్యాప్ 19,18,058 కోట్ల నుండి రూ. 7,74,356 కోట్లకు చేరింది. మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ( రూ.16,24,156 కోట్లు) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (రూ.12,57,268 కోట్లు) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోరర్ట్స్‌జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫినాన్స్, గగ్రాసిం భారీగా నష్టపోగా, సిప్లా, ఐటీసీ, దివీస్, డా. రెడ్డీస్, బజాజ్ ఆటో లాభాల్లో ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టంతో 82.85 వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment