
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిసాయి. మిడ్ సెషన్ నష్టాల కాస్త తేరుకున్నప్పటికీ ప్రధాన సూచీలు కీలక మద్దతు స్థాయిలకు దిగువనే ముగిసాయి.సెన్సెక్స్ 311 పాయింట్లు పతనమై 60692 వద్ద, నిఫ్టీ100 పాయింట్లు నష్టపోయి 17845 వద్ద ముగిసాయి.
దివీస్ ల్యాబ్స్,అల్ట్రాటెక్ సిమెంట్, టెక్‌మహీంద్ర, హిందాల్కో, పవర్‌గ్రిడ్ టాప్ విన్నర్స్‌గానూ, అదానీ ఎంటర్పప్రైజెస్, సిప్లా, బీపీసీఎల్, బ్రిటానియ, యూపీఎల్ టాప్ లూజర్స్‌గానూ స్థిర పడ్డాయి. ఐటీ, ఆటో రంగ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లు ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంక్, మెటల్ రంగ షేర్లు నష్టపోయాయి. అటు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి12 పైసల లాభంతో 82.73 వద్ద ముగిసింది. గత సెషన్‌లో 82.83 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.