
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. ఐటీ స్టాక్స్ బాగా నష్టపోతున్నాయి. ఫలితంగా కీలక సూచీలు కూడా నష్టాల్లో ఉన్నాయి. వినాయక చవితి సెలవు తరువాత సెప్టెంబరు తొలి రోజు మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 772 పాయింట్లు కుప్ప కూలి 58787 వద్ద,నిఫ్టీ 217పాయింట్ల నష్టంతో 17543 వద్ద కొనసాగుతున్నాయి. ఫలితంగా నిఫ్టీ 17600 స్థాయి దిగువకు చేరింది. బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.
బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ బ్యాంకు, టెక్ మహీంద్ర, టాటా మోటార్స్ అశోక్ లేలాండ్, అదానీ గ్రూపు షేర్లు, లాభపడుతున్నాయి. హిందాల్కో, ఇన్ఫోసిస్,టీసీఎస్, ఓఎన్జీసీ నష్టపోతున్నాయి.అటు డాలరు మారకంలో రూపాయి 24 పైసలు నష్టంతో 79.64 వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment