Snooping
-
రహస్య ప్రాజెక్ట్.. ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలు
Facebook Secret Project: మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలకు సంబంధిచిన పత్రాలు బయటకొచ్చాయి. స్నాప్‌చాట్, యూట్యూబ్, అమెజాన్ వంటి ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌ల యూజర్లపై ఫేస్బుక్ స్నూపింగ్ (అనైతిక విశ్లేషణ) చేసినట్లు ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు కొత్త పత్రాలను విడుదల చేసింది. ‘టెక్ క్రంచ్’ కథనం ప్రకారం.. స్నాప్‌చాట్ (Snapchat) యాప్‌కి, తమ సర్వర్లకు మధ్య నెట్వర్క్ ట్రాఫిక్‌ను అడ్డగించడానికి, డీక్రిప్ట్ చేయడానికి ఫేస్బుక్ 2016లో 'ప్రాజెక్ట్ ఘోస్ట్‌బస్టర్స్' అనే రహస్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోర్టు పత్రాల ప్రకారం.. యూజర్ బిహేవియర్‌ను అర్థం చేసుకోవడానికి, స్నాప్‌చాట్‌పై ప్రయోజనాన్ని పొందేందుకు ఫేస్బుక్ ఈ చొరవను రూపొందించింది. ఈ పత్రాల్లో రహస్య ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించిన ఫేస్బుక్ అంతర్గత ఈమెయిల్‌లు కూడా ఉన్నాయి. 2016 జూన్ 9 నాటి అంతర్గత ఈమెయిల్లో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్నాప్‌చాట్‌లో ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ దానిలో విశ్లేషణలను పొందాలని ఉద్యోగులను ఆదేశించినట్లుగా ఉంది. దీంతో నిర్దిష్ట సబ్డొమైన్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడానికి 2013లో ఫేస్బుక్ ద్వారా పొందిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ‘ఒనావో’ను ఉపయోగించాలని ఫేస్బుక్ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఒక నెల తర్వాత, వారు ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్స్టాల్ చేయగల ప్రతిపాదన కిట్లను అందించారు. ఈ ప్రాజెక్ట్‌ను అమెజాన్, యూట్యూబ్ యూజర్ల డేటా కోసం విస్తరించారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల బృందంతో పాటు దాదాపు 41 మంది న్యాయవాదులు ప్రాజెక్ట్ ఘోస్ట్బస్టర్స్లో పనిచేశారు. ఓనావోను ఉపయోగించడానికి ఫేస్బుక్ టీనేజర్లకు రహస్యంగా డబ్బు చెల్లిస్తోందని దర్యాప్తులో వెల్లడైన తర్వాత, ఫేస్బుక్ 2019లో ఒనావోను మూసివేసింది. -
స్నూపింగ్ కేసు: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు భారీ షాక్..
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు భారీ షాక్ తలిగింది. స్నూపింగ్ కేసులో ఆయనపై న్యాయపమరైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. సిసోడియాను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను సీబీఐ కోరగా.. ఆయన ఇప్పటికే అంగీకారం తెలిపారు. అలాగే కేంద్ర హోంశాఖ అనుమతి కోసం పంపారు. ఈ విజ్ఞప్తికి హోంశాఖ కూడా ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియా.. ఇప్పుడు స్నూపింగ్ కేసులో కూడా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2015లో ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చాక ఫీడ్‌బ్యాక్ యూనిట్(ఎఫ్‌బీయూ)ను ఏర్పాటు చేసింది. 2016లో రూ.కోటి కేటాయించడంతో ఎఫ్‌బీయూ సీక్రెట్ సర్వీస్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. అయితే రాజకీయ పార్టీలు, ప్రభుత్వ, స్వతంత్ర సంస్థలపై రహస్య నిఘా పెట్టేందుకే దీన్ని ఏర్పాటు చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే దీన్ని ఏర్పాటు చేశారంటోంది. ఢిల్లీ విజిలెన్స్ శాఖకు నేతృత్వం వహిస్తున్న సిసోడియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అనుమతి కావాలని కోరింది. 2015లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఎఫ్‌బీయూ ఏర్పాటును సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదించారని, కానీ దాని ఎజెండాకు సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పలేదని సీబీఐ ఆరోపిస్తోంది. ఎఫ్‌బీయూ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి కూడా లేదని పేర్కొంది. సీబీఐ అభ్యర్థను ఆమోదిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎటువంటి శాసన, న్యాయ, కార్యనిర్వాహక పర్యవేక్షణ లేకుండా అధికారాన్ని ఉపయోగించి రహస్య ఏజెన్సీని స్థాపించేందుకు ఆప్ ప్రయత్నించిందని ధ్వజమెత్తారు. చదవండి: దేశంలోని నిరుద్యోగులకు మోదీ రూ.6,000 భృతి.. నిజమెంత? -
నిఘాపై అట్టుడికిన రాజ్యసభ
న్యూఢిల్లీ: కంప్యూటర్లపై నిఘా పెట్టేందుకు పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఢిల్లీ పోలీసులకు అధికారాలిస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వుల అంశంపై రాజ్యసభ అట్టుడికింది. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధింపుపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టాయి. సభ ప్రారంభం కాగానే ఈ అంశాలపై విపక్షాలు ఆందోళన చేపట్టడంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. తిరిగి 2.30 గంటలకు ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ కంప్యూటర్ సమాచారంపై నిఘా అంశాన్ని లేవనెత్తారు. దేశంలో అప్రకటిత అత్యయిక స్థితి తుదిరూపు దిద్దుకుందని ఆయన ఆరోపించారు. వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. 2009లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన నిబంధనలపైనే దొంగ ఏడుపు ఏడుస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ మాట్లాడుతూ.. ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని, రానురాను పోలీసుల రాజ్యంగా మారుతోందని మండిపడ్డారు. ఉత్తర్వుల్లో ఎక్కడ కూడా జాతీయ భద్రత, రక్షణ అనే పదం లేదని ఆజాద్ పేర్కొన్నారు. కావేరీ సమస్యపై రాజ్యసభలో అన్నా డీఎంకే సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. కశ్మీర్లో రాష్ట్రపతి పాలనపై పార్లమెంటు ఉభయసభల్లో చర్చ జరగకపోవడం దారుణం అని ఆజాద్ పేర్కొన్నారు. స్వీయ క్రమశిక్షణ అలవర్చుకోవాలి.. ప్రజా ప్రతినిధులకు స్వీయ క్రమశిక్షణ ఉండాలని, పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా నడిచేలా చూసే బాధ్యత వారిపై ఉందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించారు. కాగా, శుక్రవారం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే రఫేల్ వివాదంపై కాంగ్రెస్, కావేరీ డ్యాం వివాదంపై అన్నా డీఎంకే పార్టీల సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనలు చేపట్టారు. ఇకపై లోక్‌సభ వెల్‌లోకి దూసుకెళ్లి సభా కార్యకలాపాలకు భంగం కలిగించే ఎంపీలు ఆటోమేటిక్‌గా సస్పెండ్ కానున్నారు. ఉద్దేశపూర్వకంగా వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనలు చేపట్టే ఎంపీలపై ఆటోమేటిక్‌గా వేటు పడేలా నిబంధనను సవరించాలని నిబంధనల కమిటీ సిఫార్సు చేసింది. -
కంప్యూటర్లపై కేంద్రం నిఘా
న్యూఢిల్లీ: కంప్యూటర్లలోని సమాచారంపై నిఘా నేత్రం పెట్టేందుకు కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దేశంలోని ఏ కంప్యూటర్లోకి అయినా చొరబడి, అందులోని సమాచారాన్ని విశ్లేషించేందుకు, డీక్రిప్ట్(సంకేత భాష నుంచి సాధారణ భాషలోకి మార్చడం) చేయడానికి పది కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అధికారాలిచ్చింది. ఇందులో దర్యాప్తు, నిఘా, భద్రత, పోలీసు విభాగాలున్నాయి. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి దాటాక నోటిఫికేషన్ జారీ అయింది. నిఘా సంస్థలకు కొత్తగా ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని, 2009 నుంచి అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే తాజా ఆదేశాలు జారీ చేశామని కేంద్రం ప్రకటించింది. మరోవైపు, తాజా నోటిఫికేషన్ పౌరుల ప్రాథమిక హక్కులను ప్రమాదంలోకి నెడుతుందని, దేశాన్ని నిఘా రాజ్యంగా మారుస్తుందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ప్రభుత్వ చర్య చట్టబద్ధమేనని, ఈ అధికారాలు దుర్వినియోగం కాకుండా సమాచార సాంకేతిక చట్టంలో పలు రక్షణలున్నాయని కేంద్రం సమర్థించుకుంది. విపక్షాలు గుడ్డిగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని తిప్పికొట్టింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ ఈ నిబంధనల్ని రూపొందించింది. ప్రయోజనాలు ఇవే.. ‘ఏవైనా కంప్యూటర్లలో భద్రపరచిన, రూపొందించిన, అక్కడి నుంచి వేరే చోటికి పంపిన, వేరేచోటి నుంచి స్వీకరించిన సమాచారాన్ని అడ్డగించి, పర్యవేక్షించి, డిక్రిప్ట్ చేయడానికి ఈ పది సంస్థలకు అధికారాలు ఇస్తున్నాం’ అని హోం శాఖ ప్రకటనలో తెలిపింది. టెలిగ్రాఫ్ చట్టంలో మాదిరిగానే ఈ అధికారాలు దుర్వినియోగం కాకుండా రక్షణ చర్యలు తీసుకున్నామని పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌తో మూడు ముఖ్య ప్రయోజనాలున్నట్లు తెలిపింది. అందులో మొదటిది..సమాచార విశ్లేషణ, పర్యవేక్షణ చట్ట పరిధికి లోబడి జరుగుతుంది. రెండోది..ఈ అధికారాల్ని కొన్ని సంస్థలకే కట్టబెట్టడం ద్వారా అవి ఇతర సంస్థలు, వ్యక్తుల చేతుల్లో దుర్వినియోగం కాకుండా నిరోధించవచ్చు. మూడోది.. దేశ సార్వభౌమత్వం, రక్షణ, ఇతర ప్రయోజనాల రీత్యా అనుమానాస్పద సమాచార మార్పిడిపై ఓ కన్నేసేందుకు వీలవుతుంది. హోం శాఖ కార్యదర్శి అనుమతితోనే.. కంప్యూటర్లపై నిఘా పెట్టే ముందు కంపీటెంట్ అథారిటీగా వ్యవహరిస్తున్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి తీసుకోవాలి. ఐటీ చట్టంలోని సెక్షన్ 69లోని ఉప సెక్షన్1లో పేర్కొన్న అవసరం మేరకు పలానా కంప్యూటర్లలోని సమాచారంపై నిఘా ఉంచాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి జాబితాలోని సంస్థను కోరొచ్చు. టెలిగ్రాఫ్ చట్టం మాదిరిగానే ఇక్కడ కూడా సమీక్ష కమిటీకి లోబడికి ఈ మొత్తం ప్రక్రియ జరుగుతుంది. కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని ఈ కమిటీ కనీసం రెండు నెలలకోసారి సమావేశమై తమ ముందుకొచ్చిన ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రాల స్థాయిలో సమీక్ష కమిటీ సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరుగుతుంది. నిఘా సంస్థలు కోరితే సర్వీస్ ప్రొవైడర్లు, కంప్యూటర్ వినియోగదారులు, చివరికి వ్యక్తిగత కంప్యూటర్ల వినియోగదారులు కూడా అవసరమైన సహకారం అందించాలి. లేని పక్షంలో ఏడేళ్ల జైలు శిక్ష, భారీగా జరిమానా విధిస్తారు. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం.. పలానా ఫోన్‌కాల్స్‌ను ట్యాపింగ్ చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి నిఘా, భద్రతా సంస్థల్ని ఆదేశించేందుకు ఇది వరకే వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే. పాత నిబంధనలు అమలుచేసేందుకే: జైట్లీ హోం శాఖ తాజా నోటిఫికేషన్ రాజకీయంగా దుమారం రేపుతోంది. కేంద్రం నిఘా రాజ్యాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు మూకుమ్మడిగా దుమ్మెత్తిపోశాయి. కంప్యూటర్లలోని సమాచారాన్ని అడ్డగించి, విశ్లేషించేందుకు యూపీఏ హయంలో 2009లోనే నిబంధనలు రూపొందించారని, వాటిని అమలుచేసే సంస్థల్నే తాజాగా ప్రకటించామని కేంద్రం తన చర్యను సమర్థించుకుంది. దేశాన్ని పోలీసు రాజ్యంగా మారిస్తే ప్రధాని మోదీ సమస్యలు పరిష్కారం కావని, నిఘా పెంచే ప్రయత్నాలు ఆయన ఓ అభద్ర నిరంకుశ పాలకుడని సూచిస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కాగా, ఇదే వ్యవహారం పార్లమెంట్‌ను కూడా కుదిపేసింది. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి తుది దశకు చేరుకుందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. పూర్తి వివరాలు తెలుసుకుని ప్రతిపక్షాలు అభ్యంతరాలు లేవనెత్తితే బాగుంటుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు. పుట్టలు కూడా లేనిచోట శిఖరాలు ఉన్నట్లు విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కంప్యూటర్లపై నిఘా ఉంచేందుకు కేంద్రం అధికారాలిచ్చిన సంస్థలు ఇవే.. 1.ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) 2. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 3.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 4.ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) 5.డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) 6. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 7. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) 8. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) 9. డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్(కశ్మీర్, ఈశాన్య రాష్ట్రా ల్లో సేవల నిమిత్తం) 10. ఢిల్లీ పోలిస్ కమిషనర్. దేశ భద్రత కోసమే ‘దేశ భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ ఉత్తర్వులు జారీచేశాం. పౌరుల కంప్యూటర్లపై నిఘాకు 10 సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు మార్గదర్శకాలు ఉన్నాయి’ – ఐటీ మంత్రి రవిశంకర్ కాంగ్రెస్‌ది తప్పుడు ప్రచారం ‘పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగిస్తున్నామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఇది అబద్ధం. ఈ టెక్నాలజీని వాడకుంటే ఉగ్రవాదుల్ని ఎలా పట్టుకోగలం?’ – ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మోదీ గురించి తెలుస్తుంది ‘మోదీజీ.. భారత్‌ను పోలీస్ రాజ్యంగా మార్చేస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోవు. అది కేవలం మీరు ఎంత అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్న నియంతో దేశంలోని 100 కోట్ల మందికిపైగా ఉన్న భారతీయులకు తెలియజేస్తో్తంది’ – కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కొత్త ఉత్తర్వులెందుకు? 2009 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉంటే కొత్తగా ఉత్తర్వులు జారీచేయాల్సిన అవసరం ఏముంది? మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఓటమితో బీజేపీకి భయం పట్టుకుంది. దీంతో నిఘా పెట్టడం, సమాచార చౌర్యం ద్వారా ప్రజలను బెదిరించాలని చూస్తోంది. ప్రజా వ్యతిరేకతను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది’ –కాంగ్రెస్ నేత జయ్‌వీర్ షేర్గిల్ -
దర్యాప్తు సంస్థలు కంప్యూటర్లోకి చొరబడవచ్చు
న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థలకు సరికొత్త అధికారాన్ని కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏ కంప్యూటర్‌నైనా క్షుణంగా పరిశీలించే అధికారాన్ని పలు దర్యాప్తు సంస్థలకు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పది దర్యాప్తు సంస్థలకు ఈ నిబంధనలు వర్తింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా గురువారం సంతకం చేశారు. వీటిలో సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కో కంట్రోల్ బ్యూరో, ఈడీ, సీబీడీటీ, డీఆర్ఐ, ఎన్ఐఏ, రా, డీఎస్ఐ, ఢిల్లీ పోలీసులకు ఈ కొత్త అధికారాన్ని కల్పించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం కంప్యూటర్లోని సమాచారాన్ని, మెయిళ్లను, డేటాను పరిశీలించే అధికారం ఆయా దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. అంతేకాకుండా మెయిళ్లను అడ్డుకునే, పర్యవేక్షించే అధికారం కూడా దర్యాప్తు సంస్థలకు కల్పించబడింది. గతంలో దర్యాప్తు సంస్థలకు వాడుకలో ఉన్న డేటాను మాత్రమే నియంత్రించే అధికారం ఉండేది. దర్యాప్తు సంస్థలకు కొత్త అధికారాలు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వివాదస్పదంగా మారింది. ఈ నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తనకున్న అధికారాలను దుర్వినియోగం చేస్తుందని మండిపడుతున్నాయి. కేంద్రం బిగ్ బ్రదర్‌లా అన్నింట్లో వేలు పెట్టే ప్రయత్నం చేస్తుందని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఇది భారత పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అధికారాలు దుర్వినియోగం కావని కేంద్రం చెప్పగలదా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం అవసరం ఈ అపరమిత అధికారం ఇప్పుడెందుకని నిలదీస్తున్నారు. -
జస్ట్ మీ ఫోన్ నంబర్ ఉంటే చాలు..
జస్ట్ మీ ఫోన్ నంబర్ ఒక్కటి తెలిస్తే చాలు.. మీ మొబైల్ ఫోన్ ఆధారంగా మీరు ఎక్కడ ఉన్నారు? ఎవరెవరికీ ఎస్సెమ్మెస్‌లు పంపారు? ఎవరెవరి నుంచి మీకు ఎస్సెమ్మెస్‌లు అందాయి? అన్నది తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఫోన్లో మాట్లాడిన విషయాలూ వినొచ్చు. వాటిని రికార్డ్ చేయవచ్చు. ఇలా కేవలం ఒక్క ఫోన్ నంబర్ తెలుసుకోవడంతో పౌరుల వ్యక్తిగత జీవితంలోకి చొరబడి హ్యాకర్లు బీభత్సం సృష్టించే అవకాశముందని తాజా నివేదిక ఒకటి స్పష్టం చేసింది. పౌరుల ప్రైవసీపై హ్యాకర్ల నీలినీడలు ఎంత బలంగా ఉన్నాయో ఈ నివేదిక చాటింది. ప్రజాహితమనే ముసుగుతోనే ఇప్పటికే అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు తమ దేశ పౌరుల వ్యక్తిగత జీవితాలపై నిఘా పెట్టిన అంశాన్ని బహిర్గతం చేయడం ద్వారా విజిల్ బ్లోయర్ ఎడ్వర్ స్నోడన్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇంత భారీస్థాయిలో హ్యాకింగ్ జరిగే అవకాశమున్నా వినియోగదారులు ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి పెద్దగా రక్షణ చర్యలు లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉన్నా.. నెట్వర్క్ వైపు నుంచి హ్యాకర్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసే అవకాశముంది. 1975లో అభివృద్ధి చేసిన ప్రోటోకాల్ సిగ్నలింగ్ సిస్టమ్ నంబర్ 7 (ఎస్ఎస్7) ఈ విషయంలో హ్యాకర్లకు సహాయపడుతోంది. దీనితో సులువుగా రాబట్టే అంశాలైన ఫోన్ నంబర్‌తో కూడా హ్యాకింగ్‌కు పాల్పడి.. కాల్స్, లోకేషన్లు, మెసేజ్‌లు వంటి సమాచారాన్ని సంగ్రహించవచ్చు. ఈ ఎస్ఎస్7 పద్ధతి ద్వారానే బ్రిటన్ పెద్ద ఎత్తున తమ పౌరుల వ్యక్తిగత జీవితాలపై నిఘా పెట్టిందనే అంశం వెలుగులోకి వచ్చింది. 2015లో జరిగిన ఓ హ్యాకర్ల కాన్ఫరెన్స్‌లో ఈ పద్ధతి ఎలా పనిచేస్తోందో తొలిసారిగా వెల్లడించాయి. అయినప్పటికీ ఈ విధానం యథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోందని తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల నడుమ ప్రైవసీని కాపాడుకోవడం కోసం టెలిగ్రామ్, వాట్సాప్, ఐ మెసేజ్స్, ఫేస్‌టైమ్ వంటి ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించడం ఉత్తమమని, వీటి ద్వారా మీ కమ్యూనికేషన్స్ ప్రైవేటుగా ఉండే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీనివల్ల ఓ ముప్పు లేకపోలేదు. ఈ యాప్‌ల వల్ల ఉగ్రవాదులు సోషల్ మీడియాలో జరిపే కార్యకలాపాలపై నిఘా పెట్టే అవకాశం ఉండదని భద్రతా వర్గాలు అంటున్నాయి. తాజాగా ఓ ఉగ్రవాది ఐఫోన్ అన్‌లాక్ వివాదంపై ఎఫ్‌బీఐ, యాపిల్ కంపెనీ ఘర్షణ పడిన సంగతి తెలిసిందే. దీంతో పౌరుల ప్రైవసీ అంశంపై ఎడతెగని చర్చ కొనసాగుతూనే ఉంది. -
'అమ్మాయిల రిక్వెస్ట్‌లు యాక్సెప్ట్ చేయొద్దు'
న్యూఢిల్లీ: భారత భద్రతాదళాల కీలక సమాచారాన్ని తస్కరించడానికి పొరుగు దేశాల గుఢాచార సంస్థలతో పాటూ పలు తీవ్రవాద సంస్థలు పని చేస్తున్నాయని ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ క్రిష్ణ చౌదరి వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో పనిచేస్తున్న అధికారులు, జవాన్లు మొబైల్ యాప్‌ల వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు. పాకిస్తాన్, చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు కొన్ని యాప్‌ల ద్వారా మొబైల్లోని సమాచారాన్ని తస్కరించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అంతే కాకుండా ఎవరైనా తెలియని వారి నుంచి ముఖ్యంగా అమ్మాయిల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయవద్దని హెచ్చరించారు. గూగుల్ ప్లే స్టోర్ లోని వీచాట్(WeChat), స్మెష్(Smesh), లైన్(Line)వంటి యాప్ లను అధికారులు, జవాన్లు వాడకూడదని ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. జవాన్లు వాడే స్మార్ట్ ఫోన్ల నుంచే విదేశాలకు చెందిన గూఢచార సంస్థలు ఆన్లైన్ ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని తస్కరించగలిగే అవకాశం ఉందని హెచ్చరించింది. వీరే కాకుండా పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ, తీవ్రవాద సంస్థలకు చెందిన హ్యాకర్లు కూడా భారత రహస్య సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా తస్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. వీరు ముఖ్యంగా జవాన్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అందమైన అమ్మాయిల ప్రొఫైల్ పిక్ల తో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తున్నారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత చాట్ చేయడానికి మరో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని కోరుతున్నారు. అనంతరం సదరు యాప్ ఇన్స్టాల్ అవ్వగానే వారు మొబైల్లోని కీలక సమాచారాన్ని(కాంటాక్ట్స్, మెసేజ్‌లు, వీడియోలు, జీపీఎస్ లొకేషన్) హ్యాక్ చేయగలుగుతున్నారు. కాగా ఈ యాప్‌ల ద్వారా ఎదురయ్యే దారుణమైన పరిణామాల గురించి తెలియని వారు ఇంకా వీటిని వాడుతున్నారని, ఏమౌతుందిలే అని వ్యవహరిస్తే చాలా ప్రమాదకరమైన సంఘటనలు ఎదుర్కోవలసి వస్తుందని క్రిష్ణ చౌదరి హెచ్చరించారు. -
రాహుల్ చుట్టూ రాజకీయాలు
-
కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోంది..
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ విచారణ అంశంపై రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్య విలువలకు, జాతి స్వేచ్ఛకు వ్యతిరేకమైందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మండిపడ్డారు. పార్లమెంటు లోపలా, బయటా రాజకీయ పార్టీలను భయపెట్టేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహిరిస్తోందన్నారు. ఈ వివాదంపై సభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు. గోరంతను కొండంతలు గా చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా ఇలాంటి విచారణలు జరిగాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంటికి ఢిల్లీ పోలీసులు వెళ్లి ఆయన గురించి వాకబు చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు శరద్ యాదవ్ మహిళల శరీర రంగుపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. సభ ప్రారంభంలోనే బీజేపీ నాయకుడు రవిశంకర్ మహిళలపై అనుచిత కమెంట్స్ చేసిన శరద్ యాదవ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోని మహిళల శరీర రంగుపై దయచేసి వ్యాఖ్యలు చేయొద్దంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌత్ ఇండియన్ మహిళలు నల్లగా ఉన్నా, అందంగా ఉంటారని, వాళ్లు డాన్స్ చేస్తోంటే చూడాలని ఉంటుందంటూ గత శనివారం సమాజ్ వాదీ నేత శరద్ యాదవ్ కమెంట్ చేయడం, ప్రతిపక్షాలు క్షమాపణకు పట్టుబట్టడం తెలిసిందే. -
మీ నిఘా సంగతేంటి?
* అమెరికాను ప్రశ్నించిన భారత్ న్యూఢిల్లీ: బీజేపీపై అమెరికా ప్రభుత్వం నిఘా పెట్టిందన్న కథనాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ విషయమై ఆ దేశానికి చెందిన ఉన్నతస్థాయి దౌత్యవేత్తని పిలిపించి నిరసన తెలిపింది. తమ సంస్థలు, పౌరుల విషయంలో పరిధిని ఉల్లంఘించి వ్యవహరించడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొంది. ఇలాంటివి పునరావృతం కానివ్వకుండా హామీ ఇవ్వాలంది. అయితే భారత్ పిలిపించిన అమెరికా దౌత్యాధికారి పేరును విదేశాంగ శాఖ వెల్లడించలేదు. ప్రస్తుతం దేశంలో అమెరికా తాత్కాలిక రాయబారిగా క్యాథ్లీన్ స్టీఫెన్స్ ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ సహా పలు సంస్థలు, వ్యక్తులపై నిఘా పెట్టడానికి జాతీయ భద్రతా సంస్థ(ఎన్ఎస్ఏ)కు అమెరికా సర్కారు అనుమతినిచ్చినట్లు కొన్ని పత్రాలను వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఇటీవలే బయటపెట్టడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.