Microsoft Edge
-
‘మొహమాటం వద్దు.. ఏదైనా నన్ను అడిగేయ్!’
కృత్రిమ మేధస్సు.. మనిషి జీవితంలో అంతర్లీనంగా మారిపోవడానికి ఇంకా ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే అనేక రంగాల్లో ఇది మనిషి అవసరాలను తీరుస్తోంది. అతిత్వరలో ఆపద్భాందువు అవతారమెత్తబోతోంది. మైక్రోసాఫ్ట్వారి కొత్త ఫీచర్ కోపైలట్ విజన్ అందుకు ఒక ఉదాహరణ మాత్రమే!.కోపైలట్.. మైక్రోసాఫ్ట్ కంపెనీ రూపొందించిన జనరేటెడ్ ఏఐ చాట్‌బోట్. చాట్‌బోట్ రూపంలో యూజర్లకు సమాచారాన్ని చేరవేస్తుండడం తెలిసిందే. ఏఐ సాయంతో పనిభారాన్ని తగ్గించడంతో పాటు ఆ పనిని వేగంగా పూర్తి చేసుకోవడానికి ఉపయోగపడుతోంది. అంతేకాదు.. తక్కువ టైంలో నాణ్యమైన కంటెంట్‌ను అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే దీనికి నెక్ట్స్ లెవల్‌గా కోపైలట్ విజన్ రాబోతోంది.👉ఎడ్జ్ బ్రౌజర్లో ఓ మూలన నీట్‌గా ‘కోపైలట్ విజన్’ ఏఐ ఫీచర్‌ను కనిపించనుంది. ఈ టూల్ సాయంతో ఇంటర్నెట్లో నేరుగా ఇంటరాక్ట్ అయ్యి.. ఎలాంటి సాయమైనా కోరవచ్చు. ఉదాహరణకు.. మీరు ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఎక్కడ బస చేయాలనే దానిపై మీకు కచ్చితమైన సమాచారం లేదు. ఆ గందరగోళంలో మీరు మీ డివైజ్‌లో వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కోపైలట్ విజన్‌ను సంప్రదించొచ్చు.👉మీకు ఎంత బడ్జెట్లో రూం కావాలి.. ఎలాంటి సౌకర్యాలు ఉండాలి.. ఇలాంటి వివరాలను చెబితే చాలూ!. కో పైలట్ విజన్ తన దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం జల్లెడ పడుతుంది. దానిని మీకు చెబుతూ పోతుంది. తద్వారా మీకు కావాల్సిన పక్కా సమాచారం చేరవేస్తుందన్నమాట. ఇది ఇక్కడితోనే ఆగిపోదు..👉రియల్ టైంలో వెబ్ కంటెంట్‌తో ఇంటెరాక్ట్ అయ్యేందుకు కూడా ఈ టూల్ ఉపయోగపడుతుంది. మీరు అడిగే ప్రశ్న రాతలు, ఫొటోలు, వీడియోల రూపకంలో కూడా ఉండొచ్చు. ఉదాహరణకు.. మీ స్మార్ట్ టీవీలోగానీ లేదంటే ల్యాప్ట్యాప్గానీ ఏదైనా సినిమా చూస్తుంటే అందులో నటీనటుల వివరాలను కూడా కోపైలట్ విజన్‌ను అడగొచ్చు. అప్పుడు అది తన దగ్గర ఉన్న సమాచారం సమీక్షించుకుని.. పూర్తి వివరాలు మీకు తెలియజేస్తుంది.👉అలాగే సందర్భోచితంగా సాయం కూడా అందిస్తుంది. అంటే షాపింగ్ చేసే టైంలో మీకు కావాల్సిన వివరాల ఆధారంగా ప్రొడక్టును మీకు చెబుతూ చూపిస్తుంది. అంతెందుకు.. సెలవు రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారో చెబితే.. ఆరోజు మీ వెసులుబాటును బట్టి ఎలా ఎక్కడ, గడపొచ్చో కూడా మీకు సలహా ఇస్తుందది. అంటే.. బ్రౌజింగ్ చేసే టైంలో ఇది మరో జత కండ్ల మాదిరి పని చేస్తుందన్నమాట.👉ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌లో ఉంచి ఉపయోగించుకోవాలి. ప్రైవసీ విషయంలో గ్యారంటీ ఇస్తోంది మైక్రోసాఫ్ట్. ఒకసారి సెషన్ ముగిశాక.. మనం అడిగిన సమాచారం.. దానికి కోపైలట్ ఇచ్చిన వివరాలు ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను అమెరికాలో కోపైలట్ ల్యాబ్స్ ప్రోగ్రాం కింద కోపైలట్ సబ్స్క్రయిబర్స్కు అందజేస్తోంది. ఎడ్జ్బ్రౌజర్లో ఉన్న ఈ టూల్‌ను.. త్వరలో మిగతా విస్తరించే ఆలోచనలో మైక్రోసాఫ్ట్ ఉంది. అప్పుడు యూజర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ ద్వారా లోటుపాట్లను సరిదిద్దుకుని మరింత మెరుగైన సేవలు అందిస్తుందట. ఎందెందు వెతికినా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాడ కనిపిస్తున్న కాలంలో మైక్రోసాఫ్ట్ అడుగు గేమ్‌ఛేంజర్ అనే చెప్పొచ్చు. ఈ ప్రయత్నంతో.. మిగతా కంపెనీలు పోటీగా కోపైలట్ విజన్ తరహా జనరేటెడ్ ఏఐ సేవలను అందించే అవకాశం లేకపోలేదు. -
ఐఫోన్ యూజర్లు జాగ్రత్త... ప్రభుత్వ హెచ్చరిక!
యాపిల్ ఐఫోన్లు ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన స్మార్ట్ఫోన్లు. చాలా మందికి ఇవంటే మోజు. డిజైన్, ఇతరత్రా ఫీచర్ల కోసం వీటిని ఇష్టపడతారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగిస్తున్న తమ ఫోన్ల భద్రత విషయంలో ఆపిల్ సంస్థ ఎప్పటికప్పడు నూతన ఐఓఎస్ వర్షన్లను విడుదల చేస్తూనే ఉంటుంది. వాటిని వెంటనే అప్డేట్ చేసుకోవాలని యూజర్లకు సూచిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది కొత్త వర్షన్లను అప్డేట్ చేయకుండా పాత వర్షన్లనే వినియోగిస్తుంటారు. అలాంటి వారిని భారత ప్రభుత్వం హెచ్చరించింది. పాత వర్షన్లు సురక్షితం కాదని, హ్యాకర్లు సులువుగా వాటిని హ్యాక్ చేస్తున్నారని గుర్తించిన మీదట ప్రభుత్వం ఈ హెచ్చరిక జారీ చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు అందించిన నివేదిక ప్రకారం.. ఐఓఎస్‌లో హ్యాకింగ్‌కు అనేక ఆస్కారాలు ఉన్నాయి. యూజర్ల సున్నితమైన సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. 16.3.1, అంతకు ముందుటి వర్షన్లతో ఉన్న ఐఫోన్8 లేదా ఆ తర్వాత వచ్చినవి, ఐపాడ్ ప్రో అన్ని మోడళ్లు, ఐపాడ్ ఎయిర్ థర్డ్ జనరేషన్, ఆ తర్వాతవి, ఐపాడ్ ఎయిర్ ఫిఫ్త్ జనరేషన్, ఆ తర్వాతివి, ఐపాడ్ మినీ ఫిఫ్త్ జనరేషన్, ఆతర్వాతి వాటిపై హ్యాకర్ల ప్రభావం ఉంటుందోని పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ యూజర్లు కూడా.. అలాగే శాంసంగ్ గెలాక్సీ వినియోగదారులకు కూడా భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. శాంసంగ్ కూడా తమ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త వర్షన్లను సూచిస్తూనే ఉంటుంది. అయితే పాత వర్షన్లకు అలవాటు పడిన వినియోగదారులు వాటిని అలాగే కొనసాగిస్తుంటారు. అలాంటి జాగ్రత్త పడాలి. ఈ స్మార్ట్ఫోన్లలో వచ్చే శాంసంగ్ గెలాక్సీ స్టోర్ యాప్‌లో హ్యాకింగ్ ప్రమాద ఆస్కారాన్ని గుర్తించినట్లు CERT-In పేర్కొంది. 4.5.49.8కి ముందుటి శాంసంగ్ గెలాక్సీ స్టోర్ యాప్ వెర్షన్‌తో ఫోన్లను ఇది ప్రభావితం చేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లలోనూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హ్యాకింగ్ ప్రమాదాన్ని గుర్తించింది. 109.0.1518.78కి ముందున్న ఎడ్జ్ బ్రౌజర్ వెర్షన్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. ఇది టార్గెటెడ్ సిస్టమ్‌లో డినైల్ ఆఫ్ సర్వీస్ (DoS) ఆప్షన్లను సైతం మార్చగలిగే అవకాశాన్ని హ్యాకర్‌రకు ఇస్తుంది. -
యూజర్లూ బీ అలర్ట్! 2022 మోస్ట్ రిస్కీ బ్రౌజర్ ఏదో తెలుసా?
న్యూఢిల్లీ: గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? అయితే మీకొక షాకింగ్ న్యూస్. 2022లో అత్యంత ప్రమాదకరమైన ఇంటర్నెట్ బ్రౌజర్‌గా క్రోమ్ తేలిందట. అట్లాస్ వీపీఎన్ తాజా విశ్లేషణ ప్రకారం 10 నెలల వ్యవధిలో గూగుల్ క్రోమ్ అత్యధికంగా 303 సమస్యలను ఎదుర్కొన్నట్లు కనుగొంది. అలాగే లైఫ్ టైంలో ఈ బ్రౌజర్ మొత్తం 3,159 వల్నరబులిటీలను ఎదుర్కొందని విశ్లేషించింది. (చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు) గూగుల్ క్రోమ్ తరువాత మొజిల్లా ఫైర్ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, యాపిల్ సఫారీ ఈ కోవలో నిలిచాయి. డేటా దుర్బలత్వ డేటాబేస్ (VulDB) నుండి వచ్చిందని ఈ నివేదిక తెలిపింది. జనవరి 1 నుండి అక్టోబర్ 5 వరకు డేటాను ఇది రివ్యూ చేసింది. పరిశోధన ప్రకారం, ఈ నెలలో ఇప్పటివరకు Google Chrome మాత్రమే సమస్యలక గురైంది. ముఖ్యంగా CVE-2022-3318, CVE-2022-3314, CVE-2022-3311, CVE-2022-3309, CVE-2022-3307 ఈ కొత్త భద్రతా సమస్యలు ప్రతీ డివైస్ మెమరీని దెబ్బతీస్తాయని పేర్కొంది. అయితే బ్రౌజర్ వెర్షన్ 106.0.5249.61కి అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చని వెల్లడించింది. 2022లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ 103 భద్రతా సమస్యలను, మొజిల్లా ఫైర్ఫాక్స్ 117 సమస్యలను ఎదుర్కొంది. మైక్రోసాప్ట్ ఎడ్జ్ లాంచ్ తరువాత మొత్తం 806 వల్నరబులిటీస్ని ఫేస్ చేసింది. 2021 నుండి 62 శాతం పెరుగుదల. ఇదీ చదవండి: Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ ఇటీవల వినియోగదారుల సంఖ్య ఇటీవల ఒక బిలియన్‌ను అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా యాపిల్ సఫారీ రెండవ స్థానానికి చేరుకుంది. 2022లో, ఈ బ్రౌజర్ అతి తక్కువ సమస్యలొచ్చాయి. ఈ పరిశోధన సమయంలో కేవలం 26 వల్నరబులిటీస్ని మాత్రమే ఎదుర్కొంది. అయితే మొత్తంగా 1,139 దుర్బలత్వాలను ఎదుర్కోవడం గమనార్హం. చివరగా, మొత్తం లైఫ్ టైంలో 344 భద్రతా సమస్యలను ఎదుర్కొన్న ఒపెరా బ్రౌజర్‌కు ఈ కాలంలో ఎలాంటి సమస్యా రాలేదు. అయితే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఒపెరా బ్రౌజర్లు ఒకే Chromium ఇంజిన్‌పై ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ సమస్యలు వాటిని ప్రభావితం చేయవచ్చని పరిశోధన వెల్లడించింది. -
గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ యూజర్లకు అలర్ట్..! కేంద్రం హెచ్చరికలు..!
కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ పరిధిలోకి వచ్చే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ యూజర్లకు హెచ్చరికలను జారీ చేసింది. ఈ బ్రౌజర్స్‌లో లోపాలున్నట్లుగా గుర్తించింది. గూగుల్ క్రోమ్‌లో లోపాలు..! గూగుల్ క్రోమ్ 99.0.4844.74 వెర్షన్ కంటే ముందు బ్రౌజర్‌ను వాడుతున్నవారికి తీవ్ర ప్రమాదంలో ఉన్నట్లు సెర్ట్-ఇన్ హెచ్చరికలను జారీ చేసింది. దీంతో గూగుల్ క్రోమ్ బ్రౌజర్స్‌ను వాడే యూజర్ల డేటాను హ్యకర్లు సులువుగా అపరేట్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాకుండా ఆయా యూజర్ల సున్నితమైన సమాచారాన్ని సులువుగా యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తాయని సెర్ట్-ఇన్ హెచ్చరించింది. సెర్ట్-ఇన్ హెచ్చరికల ప్రకారం... బ్లింక్ లేఅవుట్, ఎక్స్టెన్షన్స్, సేఫ్ బ్రౌజింగ్, స్ప్లిట్‌స్క్రీన్, ఆంగిల్, న్యూ ట్యాబ్ పేజీ, బ్రౌజర్ UI, GPUలో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో వంటి లోపాలున్నట్లు పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ గూగుల్ క్రోమ్‌తో పాటు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో కూడా భద్రతా లోపాలున్నట్లు CERT-In నివేదించింది. యాంగిల్ ఇన్ హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో, కాస్ట్ యూఐ ఇన్ ఫ్రీ యూజ్, ఓమ్నిబాక్స్ ఫ్రీ యూజ్‌వంటి లోపాల కారణంగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వాడే యూజర్ల డేటాను హ్యకర్లు సులువుగా పొందే అవకాశం ఉందని సెర్ట్-ఇన్ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజర్లు వెంటనే తమ బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోవాలని సెర్ట్ ఇన్ సూచించింది. కొద్ది రోజుల క్రితమే యాపిల్ ఉత్పత్తులపై కూడా కేంద్రం తీవ్ర హెచ్చరికలను జారీ చేసింది. చదవండి: పెను ప్రమాదంలో ఐఫోన్, యాపిల్ ఉత్పత్తులు..! హెచ్చరికలను జారీ చేసిన కేంద్రం..! -
ల్యాప్‌టాప్, పీసీలలో ఇలా చేస్తున్నారా? ఇక మీ పని అయిపోయినట్టే..
మీరు మీ సొంత/కంపెనీ ల్యాప్‌టాప్, పీసీలోని గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లలో ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను సేవ్ చేస్తున్నారా? అయితే, ఇక మీ పని అయిపోయినట్టే. హ్యాకర్లు మీ ల్యాప్‌టాప్, పీసీలోని పాస్‌వర్డ్‌లను రెడ్ లైన్ మాల్ వేర్ సహాయంతో హ్యాక్ చేసే అవకాశం ఎక్కువ ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఇటీవల కాలంలో ఇంటి నుంచి పనిచేసే వారి శాతం రోజు రోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. వారు తమ కార్యాలయ పనులతో పాటు ముఖ్యమైన పనులకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను ల్యాప్‌టాప్, పీసీలోని గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లలో సేవ్ చేసుకుంటున్నారు. అయితే, ఇలా చేయడం వల్ల భారీ ముప్పు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఆహ్న్ ల్యాబ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మధ్యకాలంలో ఒక కంపెనీకి చెందిన ఉద్యోగి ఇంటి నుంచి పనిచేస్తున్న సమయంలో ఇతర ఉద్యోగులు వాడే ల్యాప్‌టాప్‌లో పనిచేసేవారు. అయితే, ఆ ల్యాప్‌టాప్‌లో సమాచారాన్ని దొంగిలించే రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ ఉందనె విషయం అతనికి తెలియదు. ఈ విషయం తెలియక ఆ ఉద్యోగి తను వాడుతున్న ల్యాప్‌టాప్‌లో గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను సేవ్ చేశాడు. అప్పటికే ల్యాప్‌టాప్‌లో ఉన్న రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ ఆ సమాచారాన్ని మొత్తం హ్యాకర్ల చేతికి ఇచ్చింది. అయితే, మరో కీలక విషయం ఏమిటంటే. ఈ రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ చాలా తక్కువ ధరకు లభిస్తున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ డార్క్ వెబ్ సైట్లలో దీనిని $150కు కొనుగోలు చేయవచ్చు. అంటే, ఎవరైనా, మీ ల్యాప్‌టాప్, పీసీలలో ఈ స్పై సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే ఇక మీ పని అంతే అని నిపుణులు అంటున్నారు. అందుకే, మీ సొంత ల్యాప్‌టాప్, పీసీలతో కంపెనీ ఇచ్చే వాటిలో పాస్‌వర్డ్‌లను సేవ్ చేసుకోకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఈ రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ మొదట మార్చి 2020లో రష్యన్ డార్క్ వెబ్‌లో కనిపించింది. ఇలాంటి మాల్ వేర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. (చదవండి: 50 బిలియన్ డాలర్ల లక్ష్యం..! యాపిల్..మేక్ ఇన్ ఇండియా..!) -
క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజర్లు జాగ్రత్త!
మీరు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని వీడియోలను డౌన్లోడ్ కోసం ఆడ్-అన్స్ ఉపయోగిస్తున్నారా? అయితే, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు వీడియోల కోసం, ఇతర అవసరాల కోసం ఆడ్-అన్స్ ను గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ల నుండి డౌన్లోడ్ చేసుకుంటే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 28 ఆడ్-అన్స్ వరకు మాల్వేర్ సోకినట్లు ఇటీవల గుర్తించబడ్డాయి. యూజర్లను అసురక్షితమైన వెబ్సైట్లకు ఈ ఆడ్-అన్స్ మళ్లిస్తున్నట్లు కనుగున్నారు. దీని ద్వారా ఇమెయిల్ చిరునామాలు, మొబైల్ నంబర్స్, బ్యాంక్ కార్డ్ సమాచారం వంటి వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీటి ద్వారా సుమారు 3 మిలియన్ల మంది ప్రభావితమై ఉండవచ్చని భద్రతా సంస్థ అవాస్ట్ తన నివేదికలో పేర్కొంది.(చదవండి: వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్) యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని వీడియోలను డౌన్లోడ్ కోసం బ్రౌజర్లో ఉపయోగించే ఆడ్-అన్స్ ద్వారా ఇప్పటికే మాల్వేర్ సోకినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక ఆడ్-అన్స్ జాబితాను అవాస్ట్ విడుదల చేసింది. ఈ ఆడ్-అన్స్ ద్వారా సులభంగా హానికరమైన కోడ్లను మీ డెస్క్ టాప్ లేదా లాప్ టాప్ లోకి పంపించవచ్చని అవాస్ట్ తెలిపింది. ఈ 28 ఆడ్ల-ఆన్స్ లో మాల్వేర్లను సులభంగా ప్రవేశించే విదంగా హానికరమైన జావాస్క్రిప్ట్ ఉన్నట్లు ఇటీవల కనుగొన్నారు. సాధారణంగా ఏదైనా లింక్ క్లిక్ చేసిన సమయంలో ఆడ్-అన్స్ ద్వారా డేటా మొత్తం హ్యాకర్ల సర్వర్‌కు వెళ్తుంది. దింతో వారు ఒక్కసారి మనం చూడాలనుకున్న వెబ్‌సైట్‌కు కాకుండా వేరే వెబ్‌సైట్‌కు దారి మళ్లించి వినియోగదారుల డేటాని చోరీ చేసే అవకాశం ఎక్కువ ఉన్నట్లు అవాస్ట్ పేర్కొంది. "ఈ ఆడ్ ఆన్స్ ద్వారా లాగిన్ సమయం, పరికరం పేరు, ఆపరేటింగ్ సిస్టమ్, ఉపయోగించిన బ్రౌజర్, వెర్షన్, ఐపీ చిరునామాలతో సహా యూజర్ పుట్టిన తేదీలు, ఇమెయిల్ చిరునామాలు వంటి డేటా మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్తుంది. అలాగే వినియోగదారు యొక్క సుమారు లొకేషన్ హిస్టరీ తెలుసుకోవడానికి సహాయపడుతున్నట్లు” అవాస్ట్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ సమాచారం ద్వారా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేయడం లేదా మీ సమాచారాన్ని ఇతర థర్డ్ పార్టీ వారికీ అమ్మడం చేయవచ్చు. ఇలాంటి హానికరమైన ఆడ్-ఆన్స్ గురుంచి గూగుల్, మైక్రోసాఫ్ట్ రెండింటినీ సంప్రదించినట్లు అవాస్ట్ తెలిపింది. దీనికి రెండు కంపెనీలు "ప్రస్తుతం ఈ సమస్యను పరిశీలిస్తున్నామని" చెప్పాయి అని పేర్కొంది.