UC browser
-
వారిపై ఎలాంటి జరిమానాలుండవు
న్యూఢిల్లీ: గత కొద్దీ నెలల క్రితం టిక్ టాక్, పబ్జి వంటి మరెన్నో పేరొందిన చైనీస్ యాప్ లను ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి మనకు తెలిసిందే. కానీ, ఆ యాప్ అభిమానులు వాటిని యాక్సెస్ చేయడం కోసం ఇతర ఏపీకే లింకుల ద్వారా వాటిని మొబైల్ ఫోన్లలో ఇంస్టాల్ చేసుకొని వాడుతున్నారు. చట్టవిరుద్ధంగా ప్రభుత్వం నిషేదించిన యాప్ లను వినియోగిస్తున్న వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటారంటూ సమాచార హక్కు చట్టం కింద కొందరు ఆర్టీఐ ద్వారా కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా నిషేధిత యాప్‌ల వినియోగానికి సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వం నిషేదించిన యాప్ లను వినియోగిస్తున్న వ్యక్తులపై ఎటువంటి జరిమానా, శిక్షలు విధించడం లేదని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఐటి చట్టం యొక్క సెక్షన్ 69ఎ కింద గుర్తించబడిన మధ్యవర్తులు(సంస్థల)పై మాత్రమే ప్రభుత్వ ఆదేశాలను పాటించనందుకు గాను జరిమానా విధించనున్నట్లు కేంద్రం పేర్కొంది.(చదవండి: మరోసారి తన సత్తా చాటిన షియోమీ) -
యూసీ బ్రౌజర్ సర్వే! ఆసక్తికర విషయాలు
న్యూఢిల్లీ : ప్రముఖ ఆండ్రాయిడ్ యాప్ యూసీ బ్రౌజర్ ఉమెన్స్ డే సందర్భంగా నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 21వ శతాబ్ధంలోనూ ప్రజల ఆలోచనల్లో పెద్దగా మార్పులు రాలేదన్నది ఈ సర్వే సారాంశం. యూసీ బ్రౌజర్ మార్చి మొదటి వారంలో దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఈ సర్వేను నిర్వహించింది. మొత్తం 10 భాషల్లో నిర్వహించిన ఈ సర్వేలో 96వేల మంది పాల్గొన్నారు. మహిళలపై లైంగిక దాడులు జరగటానికి పొట్టి బట్టలే కారణమా? అన్న ప్రశ్నకు 70శాతం మంది అవునని సమాధానమిచ్చారు. మహిళలపై తరచుగా లైంగిక దాడులు జరగటానికి వారువేసుకునే పొట్టి బట్టలే కారణమని చెప్పారు. ఇంట్లో నిర్ణయాధికారం ఎవరిది? ఆడా.. మగా.. అన్న మరో ప్రశ్నకు 63శాతం మంది మగవారిదేనని సమాధానమిచ్చారు. మగవాళ్లు అందుకు సంకోచించటం లేదు మీ ఆడవారి కోసం శానిటరీ ప్యాడ్లు కొనటానికి సంకోచిస్తారా? అన్న ప్రశ్నకు 70 శాతం మంది కాదని సమాధానం ఇచ్చారు. ఈ ప్రశ్నకు మొత్తం 27వేలమంది సమాధానం ఇవ్వగా.. 18వేల మంది తమ ఆడవారి కోసం శానిటరీ ప్యాడ్లు కొనడానికి ఇబ్బందిపడమని చెప్పారు. -
యూసీ బ్రౌజర్ నుంచి ఉచిత క్లౌడ్ స్టోరేజ్
న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద థర్డ్ పార్టీ వెబ్ బ్రౌజర్ అయిన ‘యూసీ బ్రౌజర్’ భారత మార్కెట్లో తన కార్యకలాపాలను పెంచుకునే దిశగా వ్యూహాన్ని మార్చుకుంటోంది. భారత వినియోగదారులకు ఇన్‌యాప్ క్లౌడ్ స్టోరేజీ సేవలను ‘యూసీ డ్రైవ్’ రూపంలో ఆఫర్ చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. భారీ క్లౌడ్ స్టోరేజీ సదుపాయంతో ఉచితంగా దీన్ని అందిస్తున్నట్టు తెలిపింది. -
యూసీ బ్రౌజర్ కనిపించడం లేదు
ప్రపంచ వ్యాప్తంగా 500 మిలియన్ల మందికి పైగా ఉపయోగిస్తున్న మొబైల్ ఇంటర్నెట్ సర్ఫింగ్ అప్లికేషన్ యూసీ బ్రౌజర్, గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించడం లేదు. ఇన్స్టాల్ చేసుకోవడానికి `యూసీ బ్రౌజర్` అని సెర్చ్ చేస్తే కేవలం యూసీ మినీ యాప్ మాత్రమే కనిపిస్తోంది. ఈ విషయంపై కంపెనీ ఎలాంటి అధికారిక వివరణను ప్రకటించనప్పటికీ, యూసీ బ్రౌజర్‌పై గతంలో చాలా వివాదాలు వచ్చాయి. యూసీ బ్రౌజర్ యూజర్ల డేటాను దొంగతనం చేస్తుందని, దీన్ని చైనాలో సర్వర్లకు పంపిస్తుందని గత ఆగస్టులో ఆరోపణలు వచ్చాయి. ఈ బ్రౌజర్‌ను యూజర్ అన్ఇన్స్టాల్ చేసినప్పటికీ డేటాను సేకరిస్తుందని రిపోర్టులు తెలిపాయి. ఈ బ్రౌజర్‌పై భారత ప్రభుత్వం నిఘా కూడా పెట్టింది. యూసీ బ్రౌజర్ తాత్కాలికంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించడానికి మరో కారణం కూడా వినిపిస్తోంది. ఇన్స్టాల్స్ సంఖ్యను పెంచడం కోసం తప్పుదారులు ఎంచుకుని, ఇష్టం వచ్చినట్లు అడ్వర్టైజ్మెంట్లను యూసీ బ్రౌజర్ ఇస్తుందని, ఇది ఆండ్రాయిడ్ పాలసీలకు విరుద్ధం కావడంతో తాత్కాలికంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూసీ బ్రౌజర్ యాప్‌ను ఆండ్రాయిడ్ తొలగించిందని ఓ మేగజైన్ పేర్కొంది. యూసీ బ్రౌజర్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తాజా ఘటనపై స్పందించారు. 'నాకు ఈరోజు ఉదయం ఓ మెయిల్ వచ్చింది. యూసీ బ్రౌజర్‌ను 30 రోజులపాటు తాత్కాలికంగా ప్లేస్టోర్ నుంచి తీసివేస్తున్నట్లు అందులో సమాచారం ఉంది. డౌన్లోడ్లు పెంచుకునేందుకు యూజర్లను తప్పుదారి పట్టించినందుకు, అనారోగ్యకర విధానాలను అవలంబించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో ఉంది'' అని అతను పేర్కొన్నాడు. కాగ యూసీ బ్రౌజర్ మినీ, యూసీ న్యూస్ ఇంకా ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. -
యూసీ బ్రౌజర్‌పై నిషేధం?
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన స్మార్ట్‌ఫోన్ బ్రౌజర్ యూసీ వెబ్ రద్దు కాబోతుంది. డేటా దొంగతనానికి పాల్పడుతుందంటూ చైనీస్ కంపెనీలపై వస్తున్న ఆరోపణల విచారణ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ యూజర్ల డేటా దొంగతనానికి గురైందని వెల్లడైతే, భారత్‌లో యూసీ వెబ్‌పై నిషేధం విధించే అవకాశాలున్నాయని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. యూసీ బ్రౌజర్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని ఆ అధికారి పేర్కొన్నారు. చైనాలోని సర్వర్లకు భారత యూజర్ల మొబైల్ డేటాను ఇది పంపిస్తుందని, ఈ అంశాన్ని తాము పరిగణలోకి తీసుకున్నామని అధికారి తెలిపారు. యూసీ బ్రౌజర్‌కు భారత్‌లో నెలవారీ యాక్టివ్ యూజర్లు 100 మిలియన్‌కు పైననే. గ్లోబల్‌గా దీని యూజర్ బేస్ 420 మిలియన్లు. గూగుల్ క్రోమ్ తర్వాత భారత్‌లో అత్యధికంగా వాడుతున్న వెబ్ బ్రౌజర్ యూసీ బ్రౌజరే. మొబైల్ ఫోన్ సెగ్మెంట్ యాడ్స్‌లో దీని మార్కెట్ షేరు 48.7 శాతం. అయితే యూసీ వెబ్ సెక్యురిటీని, ప్రైవసీని చాలా సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంటుందని ఆ కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. యూజర్లకు మెరుగైన సేవలందించడానికి ప్రపంచవ్యాప్తంగా సర్వర్లను ఏర్పాటుచేయడం ఐటీ కంపెనీల సాధారణ పద్ధతి అని పేర్కొన్నారు. తాము ఎలాంటి యూజర్ల నమ్మకాన్ని వమ్ముచేయడం లేదని తెలిపారు. యూజర్ల డేటాను సేకరించడంపై ఆ సంస్థ సమర్థించుకుంటుంది. యూజర్ల సమాచారాన్ని, డేటాను సేకరించడం ఇండస్ట్రిలో పద్ధతిలో భాగమని పేర్కొంది. యూజర్ల ప్రయోజనాలను తాము కాపాడతామని చెప్పింది. -
క్రోమ్ ను అధిగమించిన యూసీ బ్రౌజర్
హైదరాబాద్: అలీబాబా గ్రూప్‌కు చెందిన యూసీ బ్రౌజర్ తాజాగా క్రోమ్‌ను వెనక్కు నెట్టింది. నెలకు 40 కోట్ల మంది యాక్టివ్ యూజర్లతో ఆసియాలో అగ్ర పీఠాన్ని, అంతర్జాతీయంగా రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు వెబ్ ట్రాఫిక్ అనలిటిక్స్ సంస్థ స్టాట్ కౌంటర్ వెల్లడించింది. అందరికీ నాణ్యమైన, సౌకర్యవంతమైన ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందించేందుకు కృషి చేస్తున్నామని అలీబాబా మొబైల్ బిజినెస్ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ జీఎం కెన్నీ యె తెలిపారు. క్లౌడ్ ఆధారిత బ్రౌజింగ్, వేగవంతమైన డౌన్లోడ్స్, కస్టమైజ్డ్ కంటెంట్ వంటి అంశాలు తమ బ్రౌజర్ ప్రత్యేకతలన్నారు. యూసీ క్రికెట్‌కు మంచి ఆధరణ లభించిందని... ఇక మీదట మ్యూజిక్, వీడియోస్ వంటి తదితర వాటిల్లో స్థానిక కంటెంట్‌ను అధికంగా ఇస్తామని తెలిపారు. -
ఫ్లిప్‌కార్ట్‌తో యూసీ బ్రౌజర్ ఒప్పందం
హైదరాబాద్: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్, ఫ్లిప్‌కార్ట్, యూసీ(చైనా) బ్రౌజర్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా యూసీ బ్రౌజర్ హోమ్ స్క్రీన్‌లో ఫ్లిప్‌కార్ట్ సైట్ లభ్యమవుతుందని యూసీ బ్రౌజర్ ఒక ప్రకటనలో తెలిపింది. స్థానిక ఇ-టెయిలర్లు భారీ డిస్కౌంట్లను, ఆఫర్లను అందిస్తున్నారని, ఎం-కామర్స్ మార్కెట్ జోరుగా వృద్ధి సాధిస్తోందని యూసీవెబ్ ఇండియా జనరల్ మేనేజర్ రాబర్ట్ బు పేర్కొన్నారు. ఉత్తమమైన షాపింగ్ అనుభవాన్ని వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి అందిస్తామని తెలిపారు.