యూసీ బ్రౌజర్‌పై నిషేధం?
యూసీ బ్రౌజర్‌పై నిషేధం?
Published Wed, Aug 23 2017 12:52 PM | Last Updated on Sun, Sep 17 2017 5:53 PM
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన స్మార్ట్‌ఫోన్ బ్రౌజర్ యూసీ వెబ్ రద్దు కాబోతుంది. డేటా దొంగతనానికి పాల్పడుతుందంటూ చైనీస్ కంపెనీలపై వస్తున్న ఆరోపణల విచారణ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ యూజర్ల డేటా దొంగతనానికి గురైందని వెల్లడైతే, భారత్‌లో యూసీ వెబ్‌పై నిషేధం విధించే అవకాశాలున్నాయని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. యూసీ బ్రౌజర్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని ఆ అధికారి పేర్కొన్నారు. చైనాలోని సర్వర్లకు భారత యూజర్ల మొబైల్ డేటాను ఇది పంపిస్తుందని, ఈ అంశాన్ని తాము పరిగణలోకి తీసుకున్నామని అధికారి తెలిపారు.
యూసీ బ్రౌజర్‌కు భారత్‌లో నెలవారీ యాక్టివ్ యూజర్లు 100 మిలియన్‌కు పైననే. గ్లోబల్‌గా దీని యూజర్ బేస్ 420 మిలియన్లు. గూగుల్ క్రోమ్ తర్వాత భారత్‌లో అత్యధికంగా వాడుతున్న వెబ్ బ్రౌజర్ యూసీ బ్రౌజరే. మొబైల్ ఫోన్ సెగ్మెంట్ యాడ్స్‌లో దీని మార్కెట్ షేరు 48.7 శాతం. అయితే యూసీ వెబ్ సెక్యురిటీని, ప్రైవసీని చాలా సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంటుందని ఆ కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. యూజర్లకు మెరుగైన సేవలందించడానికి ప్రపంచవ్యాప్తంగా సర్వర్లను ఏర్పాటుచేయడం ఐటీ కంపెనీల సాధారణ పద్ధతి అని పేర్కొన్నారు. తాము ఎలాంటి యూజర్ల నమ్మకాన్ని వమ్ముచేయడం లేదని తెలిపారు. యూజర్ల డేటాను సేకరించడంపై ఆ సంస్థ సమర్థించుకుంటుంది. యూజర్ల సమాచారాన్ని, డేటాను సేకరించడం ఇండస్ట్రిలో పద్ధతిలో భాగమని పేర్కొంది. యూజర్ల ప్రయోజనాలను తాము కాపాడతామని చెప్పింది.
Advertisement
Advertisement