UC web
-
యూసీ బ్రౌజర్‌పై నిషేధం?
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన స్మార్ట్‌ఫోన్ బ్రౌజర్ యూసీ వెబ్ రద్దు కాబోతుంది. డేటా దొంగతనానికి పాల్పడుతుందంటూ చైనీస్ కంపెనీలపై వస్తున్న ఆరోపణల విచారణ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ యూజర్ల డేటా దొంగతనానికి గురైందని వెల్లడైతే, భారత్‌లో యూసీ వెబ్‌పై నిషేధం విధించే అవకాశాలున్నాయని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. యూసీ బ్రౌజర్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని ఆ అధికారి పేర్కొన్నారు. చైనాలోని సర్వర్లకు భారత యూజర్ల మొబైల్ డేటాను ఇది పంపిస్తుందని, ఈ అంశాన్ని తాము పరిగణలోకి తీసుకున్నామని అధికారి తెలిపారు. యూసీ బ్రౌజర్‌కు భారత్‌లో నెలవారీ యాక్టివ్ యూజర్లు 100 మిలియన్‌కు పైననే. గ్లోబల్‌గా దీని యూజర్ బేస్ 420 మిలియన్లు. గూగుల్ క్రోమ్ తర్వాత భారత్‌లో అత్యధికంగా వాడుతున్న వెబ్ బ్రౌజర్ యూసీ బ్రౌజరే. మొబైల్ ఫోన్ సెగ్మెంట్ యాడ్స్‌లో దీని మార్కెట్ షేరు 48.7 శాతం. అయితే యూసీ వెబ్ సెక్యురిటీని, ప్రైవసీని చాలా సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంటుందని ఆ కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. యూజర్లకు మెరుగైన సేవలందించడానికి ప్రపంచవ్యాప్తంగా సర్వర్లను ఏర్పాటుచేయడం ఐటీ కంపెనీల సాధారణ పద్ధతి అని పేర్కొన్నారు. తాము ఎలాంటి యూజర్ల నమ్మకాన్ని వమ్ముచేయడం లేదని తెలిపారు. యూజర్ల డేటాను సేకరించడంపై ఆ సంస్థ సమర్థించుకుంటుంది. యూజర్ల సమాచారాన్ని, డేటాను సేకరించడం ఇండస్ట్రిలో పద్ధతిలో భాగమని పేర్కొంది. యూజర్ల ప్రయోజనాలను తాము కాపాడతామని చెప్పింది. -
భారత్‌లో యూసీవెబ్ రూ. 120 కోట్ల పెట్టుబడులు
గ్వాంగ్జూ: ఆలీబాబా మొబైల్ బిజినెస్ గ్రూప్‌లో భాగమైన యూసీవెబ్ ..భారత్, ఇండొనేషియాల్లో రూ. 200 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. ఇందులో సుమారు 60 శాతం (దాదాపు రూ. 120 కోట్లు) భారత్‌లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ జీఎం కెనీ యీ తెలిపారు. బ్లాగ్లు, షార్ట్ వీడియోలు, సంప్రదాయేతర న్యూస్ ఫీడ్ మొదలైన వాటిని తమ యూసీ న్యూస్ ప్లాట్‌ఫాం ద్వారా యూజర్లకు చేర్చేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వివరించారు. నియామకాలు, ఇతరత్రా వ్యాపారపరమైన వ్యయాలకు కాకుండా కేవలం కంటెంట్ రూపకల్పన, పంపిణీకే తాజా పెట్టుబడులు ఉపయోగించనున్నట్లు కెనీ తెలిపారు. ఇందుకోసం వుయ్ మీడియా ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తెస్తున్నామని, ఎవరైనా ఇందులో నమోదు చేసుకుని...తమ కంటెంట్‌ను ప్రచురించుకోవచ్చని పేర్కొన్నారు. 2017లో వుయ్ మీడియా ప్లాట్‌ఫాంలో 30,000 మంది పైచిలుకు సెల్ఫ్ పబ్లిషర్స్, బ్లాగర్లు మొదలైన వారిని నమోదు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు కెనీ వివరించారు. అలాగే ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి భారత్‌లో ప్రస్తుతం 40గా ఉన్న తమ సిబ్బంది సంఖ్యను 100కి పెంచుకోనున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మరో 50 శాతం మేర పెంచుకోనున్నామని పేర్కొన్నారు.