
యూసీ బ్రౌజర్
యూసీ బ్రౌజర్ సర్వే! ఆసక్తికర విషయాలు..
న్యూఢిల్లీ : ప్రముఖ ఆండ్రాయిడ్ యాప్ యూసీ బ్రౌజర్ ఉమెన్స్ డే సందర్భంగా నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 21వ శతాబ్ధంలోనూ ప్రజల ఆలోచనల్లో పెద్దగా మార్పులు రాలేదన్నది ఈ సర్వే సారాంశం. యూసీ బ్రౌజర్ మార్చి మొదటి వారంలో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఈ సర్వేను నిర్వహించింది. మొత్తం 10 భాషల్లో నిర్వహించిన ఈ సర్వేలో 96వేల మంది పాల్గొన్నారు. మహిళలపై లైంగిక దాడులు జరగటానికి పొట్టి బట్టలే కారణమా? అన్న ప్రశ్నకు 70శాతం మంది అవునని సమాధానమిచ్చారు. మహిళలపై తరచుగా లైంగిక దాడులు జరగటానికి వారువేసుకునే పొట్టి బట్టలే కారణమని చెప్పారు. ఇంట్లో నిర్ణయాధికారం ఎవరిది? ఆడా.. మగా.. అన్న మరో ప్రశ్నకు 63శాతం మంది మగవారిదేనని సమాధానమిచ్చారు.
మగవాళ్లు అందుకు సంకోచించటం లేదు
మీ ఆడవారి కోసం శానిటరీ ప్యాడ్‌లు కొనటానికి సంకోచిస్తారా? అన్న ప్రశ్నకు 70 శాతం మంది కాదని సమాధానం ఇచ్చారు. ఈ ప్రశ్నకు మొత్తం 27వేలమంది సమాధానం ఇవ్వగా.. 18వేల మంది తమ ఆడవారి కోసం శానిటరీ ప్యాడ్‌లు కొనడానికి ఇబ్బందిపడమని చెప్పారు.