న్యూఢిల్లీ: భారత్‌లో పెట్టుబడుల విషయంలో చైనా దిగ్గజ సంస్థ అలీబాబా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్ల తెలుస్తోంది. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని భావించిన అలీబాబా సంస్థ సరిహద్దు వివాదాల నేపథ్యంలో పునరాలోచనలో పడినట్లు రాయిటర్స్ నివేదిక తెలిపింది. దేశంలో అంకుర(స్టార్టప్) పరిశ్రమలను స్థాపించాలని అలీబాబా కంపెనీ గతంలో భావించింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆరు నెలల వరకు వేచిచూడాలని అలీబాబా సంస్థ భావిస్తోందని సమాచారం.
గతంలో అలీబాబా సంస్థకు అనుబంధంగా ఉన్న సంస్థలు 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. అయితే అలీబాబా సంస్థ గతంలో పేటీఎమ్, ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో, నిత్యావసర వస్తువులు అందించే బిగ్‌బాస్కెట్ తదితర సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. కరోనా వైరస్, సరిహద్దు వివాదాల నేపథ్యంలో కొత్త పెట్టబడులు పెట్టే విషయంలో కొంత కాలం వేచి చూడాలని అలీబాబా భావిస్తున్నట్టు తెలుస్తోంది.
చదవండి: అలీబాబాకు ట్రంప్ సెగ
Comments
Please login to add a commentAdd a comment