border tensions
-
ఎల్ఏసీ వెంట చైనా మోహరింపులు
వాషింగ్టన్: అది 2022 సంవత్సరం. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ. ఆ సమయంలో చైనా చడీచప్పుడూ లేకుండా వాస్తవాదీన రేఖ వెంబడి అన్నిరకాలుగా బలపడే ప్రయత్నాలు చేస్తూ వచి్చంది. ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్ వెంబడి సైనిక మోహరింపులను విపరీతంగా పెంచేసింది. డోక్లాం వెంబడి భూగర్భ నిల్వ వసతులను పటిష్టపరుచుకుంది. మరెన్నో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంది. పాంగాంగ్ లేక్ మీదుగా రెండో వంతెనతో పాటు డ్యుయల్ పర్పస్ ఎయిర్‌పోర్టు, మలి్టపుల్ హెలిపాడ్లను నిర్మించుకుంది. తూర్పు లద్దాఖ్ వెంబడి పలుచోట్ల కొన్నేళ్లుగా చైనా సైన్యం కయ్యానికి కాలుదువ్వడం, మన సైన్యం దీటుగా బదులివ్వడం తెలిసిందే. ముఖ్యంగా మూడేళ్లుగా అక్కడ ఇరు సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘చైనాలో సైనిక, భద్రతాపరమైన పరిణామాలు–2023’ పేరిట అమెరికా రక్షణ శాఖ తాజాగా ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. ‘2020 మే నుంచే భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తీవ్ర ఉద్రిక్త స్థాయికి చేరడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రెండు డివిజన్ల జిన్జియాంగ్, టిబెట్ మిలిటరీ డి్రస్టిక్ట్స్ దన్నుతో ఒక బోర్డర్ రెజిమెంట్‌నే ఏర్పాటు చేసింది. నాలుగు కంబైన్డ్ ఆర్మీ బ్రిగేడ్ (సీఏబీ) తదితరాలను 2022లో వాస్తవా«దీన రేఖ వెంబడి రిజర్వులో ఉంచింది. మరో మూడు సీఏబీలను ఇతర కమాండ్ల నుంచి తూర్పు సెక్టార్‌కు తరలించి సిద్ధంగా ఉంచింది. తర్వాత వీటిలో కొన్నింటిని వెనక్కు పిలిపించినా మెజారిటీ సేనలు ఇప్పటికీ వాస్తవా«దీన రేఖ వెంబడే మోహరించే ఉన్నాయి’ అని ఆ నివేదిక స్పష్టంచేసింది. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఇరు సైన్యాలు తీవ్ర ఘర్షణకు దిగడం తెలిసిందే. ఆ నేపథ్యంలో చైనా ఈ చర్యలకు దిగిందని నివేదిక వెల్లడించింది. ఈ మోహరింపులు ఇలాగే కొనసాగవచ్చని అభిప్రాయపడింది. ఇక భూటాన్ వెంబడి వివాదాస్పద ప్రాంత సమీపంలో చైనా ఏకంగా ఊళ్లనే ఏర్పాటు చేసిందని తెలిపింది. చైనా వద్ద 500 అణు వార్హెడ్లు! ప్రయోగానికి అన్నివిధాలా సిద్ధంగా ఉన్న అణు వార్ హెడ్లు చైనా వద్ద ఏకంగా 500 దాకా ఉన్నట్టు పెంటగాన్ నివేదిక పేర్కొంది. ‘గత రెండేళ్లలోనే ఏకంగా 100 వార్హెడ్లను తయారు చేసుకుంది. 2030 కల్లా వీటిని కనీసం 1,000కి పెంచడమే డ్రాగన్ దేశం లక్ష్యంగా పెట్టుకుంది’ అని నివేదిక వివరించింది. 300కు పైగా ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు తదితరాలు ఇప్పటికే చైనా అమ్ములపొదిలో చేరినట్టు వివరించింది. వాటిని దేశవ్యాప్తంగా మూడు చోట్ల అండర్‌గ్రౌండ్ వసతుల్లో అతి సురక్షితంగా ఉంచింది. ‘వీటితో పాటు సంప్రదాయ ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్ల తయారీని మరోసారి వేగవంతం చేసింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నావికా దళం ఇప్పటికే చైనా సొంతం. ఏడాదిలోనే 30 యుద్ధ నౌకలను నిర్మించుకుంది. దాంతో చైనా వద్ద మొత్తం యుద్ధ నౌకలు ఏకంగా 370కి చేరాయి. వీటిని 2025 కల్లా 400కు, 2030 కల్లా 450కి పెంచే యోచనలో ఉంది’ అని పేర్కొంది. ‘విదేశాల్లో సైనిక స్థావరాలను పెంచుకునేందుకు చైనా ముమ్మర ప్రయత్నాలు చేసింది. నైజీరియా, నమీబియా, మొజాంబిక్, బంగ్లాదేశ్, బర్మా, సాల్మన్ దీవులు, థాయ్‌లాండ్, తజకిస్థాన్, ఇండొనేసియా, పపువా న్యూ గినియా వంటి దేశాల్లో వ్యూహాత్మక సైనిక స్థావరాలను పెంచుకునేలా కనిపిస్తోంది’ అని నివేదిక తెలిపింది. -
చైనాను రెచ్చగొట్టిన తైవాన్.. సరిహద్దులో ఉద్రిక్తత
బీజింగ్: తైవాన్, చైనాను రెచ్చగొట్టింది. డ్రాగన్ కంట్రీ వద్దని వారించినా సరే తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ అమెరికా పర్యటనలో అక్కడి హౌజ్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్థీతో భేటీ అయ్యారు. తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టడంతో చైనా భగ్గుమంది. చైనాకు చెందిన మూడు యుద్ధనౌకలు, ఓ ఎయిర్‌క్రాఫ్ట్ తైవాన్ సరిహద్దులో మోహరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తైవాన్ రక్షణ శాఖ సైతం ధృవీకరించింది. పరిస్థితి ప్రస్తుతానికి ఉద్రిక్తంగానే ఉందని, ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నట్లు తైవాన్ రక్షణ మంత్రి తెలిపారు. అంతకు ముందు.. చైనా విదేశాంగ శాఖ సాయ్ ఇంగ్ చర్యను తీవ్రంగా ఖండించింది. చైనా సిద్ధాంతాలకు(వన్ చైనా ప్రిన్స్‌పుల్) వ్యతిరేకంగా ఆమె వ్యవహరించారని మండిపడింది. వన్ చైనా.. వన్ తైవాన్ అంటూ తైవాన్ను తప్పుదోవ పట్టించే తీరును మార్చుకోవాలంటూ అమెరికాను ఆ ప్రకటన ద్వారా చైనా హెచ్చరించింది. అంతకు ముందు.. బుధవారం కాలిఫోర్నియాలో మెక్కార్థీని కలిసిన సాయ్ ఇంగ్ వెన్.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ పరోక్షంగా చైనా నుంచి పొంచి ఉన్న ముప్పును ఉద్దేశించి పేర్కొన్నారు. -
భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతలపై చైనా కీలక వ్యాఖ్యలు..
అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ అనంతరం భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై చైనా తొలిసారి స్పందించింది. సరిహద్దులో స్థిరత్వం నెలకొల్పి ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాము సిద్ధమని చెప్పింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడాలని ఆకాక్షించింది. ఈమేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి వాస్ అధికారిక ప్రకటనలో తెలిపారు. భారత్‌తో తాము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని, దౌత్యపరంగా, సైనిక పరంగా రెండు దేశాలు టచ్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. సరిహద్దులో స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. సరిహద్దులో శాంతి స్థాపనకు డిసెంబర్ 20న చైనాతో 17వసారి కమాండర్ స్థాయి చర్చలు జరిపింది భారత్. పశ్ఛిమ సెక్టార్లో శాంతియుత వాతావరణానికి రెండు దేశాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలోనే చైనా ప్రకటన విడుదల చేసింది. చదవండి: Covid-19: కోట్లలో కోవిడ్ కేసులు.. చైనా దిక్కుమాలిన చర్య.. -
‘మహా’మేళాకు కర్ణాటక నో.. ఉద్రిక్తత, 144 సెక్షన్ విధింపు
బెళగావి: హద్దుల పంచాయితీతో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య వివాదం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తారస్థాయికి చేరుకుంది. ‘మహా’ మేళ నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవటంపై బెళగావి సమీపంలో సోమవారం వందల మంది ఆందోళన చేపట్టారు. కొగ్నోలి టోల్ ప్లాజా వద్దకు ‘మహారాష్ట్ర ఏకీకరణన్ సమితి’(ఎంఈఎస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేతలు, కార్యకర్తలు వందల మంది చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బెళగావి ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున బెళగావిలో ప్రతిఏటా సమావేశం నిర్వహిస్తుంది మహారాష్ట్ర ఏకీకరణన్ సమితి. గత ఐదేళ్లుగా సరిహద్దు వివాదంపై ఆందోళనలు చేస్తోంది ఎంఈఏస్. ఈ ఏడాది కూడా శీతాకాల సమావేశల తొలిరోజున భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే బెళగావి జిల్లా ప్రధాన కేంద్రంలోని తిలక్‌వాడీ ప్రాంతంలో ఉన్న వ్యాక్సిన్ డిపో గ్రౌండ్ వద్ద ఎంఈఎస్ ఆందోళనకు దిగింది. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వందల మంది ఎంఈఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తిలక్‌వాడీ రోడ్డులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. అయినప్పటికీ మహారాష్ట్ర వికాస్ అకాడీ(ఎంవీఏ) కార్యకర్తలు బెళగావిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. 5వేల మంది పోలీసులు.. బెళగావిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు 5,000 మంది పోలీసులను మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఆరుగురు ఎస్పీలు, 11 మంది ఏఎస్పీలు, 43 మంది డిప్యూటీ ఎస్పీలు, 95 మంది ఇన్స్పెక్టర్లు, 241 మంది ఎస్సైలు ఆందోళనల ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. Belagavi, Karnataka | Members of Maharashtra Ekikaran Samiti and NCP stage protest near Kognoli Toll Plaza near Karnataka-Maharashtra border over inter-state border issue pic.twitter.com/XaPJwEbBKv — ANI (@ANI) December 19, 2022 ఇదీ చదవండి: అసెంబ్లీలో వీర్ సావర్కర్ చిత్రపటంపై రగడ.. నిరసనకు దిగిన ప్రతిపక్షం -
ఎల్ఏసీకి అతి సమీపంలో చైనా యుద్ధ విమానాలు.. భయంతోనే అలా!
సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నప్పటికీ చైనా కవ్వింపు చర్యలను ఆపడం లేదు. తూర్పు లద్దాఖ్ సరిహద్దులోని వాస్తవాధీన రేఖకు అతి సమీపంలో యుద్ధ విమానాలలో చక్కర్లు కొడుతోంది. గత మూడ్నాలుగు వారాల్లో భారత సైన్యాన్ని కవ్వించేందుకు పలుమార్లు ప్రయత్నించింది. భారత రక్షణ యంత్రాంగం గుట్టును తెలుసుకునేందుకే డ్రాగన్ దేశం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చైనాకు భారత సైన్యం దీటుగా బదులిస్తోందని సైనిక వర్గాలు తెలిపాయి. డ్రాగన్ దేశం ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా, భద్రతా ముప్పు వాటిల్లేలా చేసినా క్షణాల్లో తిప్పికొట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నాయి. సరిహద్దుకు అతి సమీపంలో మిగ్ 29, మిరాజ్ 2000 యుద్ధ విమానాలకు మోహరించినట్లు వెల్లడించాయి. అదే సమయంలో సంయమనంతో వ్యవహరిస్తూ ఉద్రిక్తతలు పెరగకుండా చూస్తున్నట్లు పేర్కొన్నాయి. భయంతోనే.. అయితే డ్రాగన్ దేశ సైన్యం భయంతోనే యుద్ధ విమానాలతో చక్కర్లు కొడుతున్నట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. లద్దాక్ సెక్టార్లో భారత సైన్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అప్‌గ్రేడ్ చేసిందని, చైనా సైన్యానికి సంబంధించిన కార్యకలాపాలను అత్యంత సమీపం నుంచి పసిగడుతోందని చెప్పాయి. ఆ భయంతో చైనా యుద్ధ విమానాలతో వాస్తవాధీన రేఖకు సమీపంలో చక్కర్లు కొడుతున్నట్లు పేర్కొన్నాయి. జూన్ 24-25 మధ్య చైనా కవ్వింపు చర్యలు మొదలయ్యాయని, జులై 17న ఇరు దేశాల మధ్య జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల్లోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. భారత్ కూడా తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో నిఘాను మరింత పటిష్టం చేసినట్లు సమాచారం. చదవండి: సోనియా గాంధీ గురించి అలా మాట్లాడుతారా? బీజేపీ యాంటీ వుమెన్ -
ఉక్రెయిన్ ఉద్రిక్తత.. భారతీయులకు అలర్ట్
Alert For Indians In Ukraine: ఉక్రెయిన్‌కు రష్యా ముప్పు పెరిగిపోతుండడంతో.. ఆ దేశంలో నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో భారత ప్రభుత్వం స్పందించి.. రాయబార కార్యాలయాన్ని అప్రమత్తం చేసింది. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైన్యం, ప్రతిగా నాటో బలగాల మోహరింపుతో అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో.. రాజధాని కియెవ్లోని భారత రాయబార కార్యాలయం భారత పౌరులకు కీలక సూచన చేసింది. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, భారత పౌరులంతా ఎప్పటికప్పుడు అప్డేట్ల కోసం ఎంబసీ అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా ఫాలో అవ్వాలని కోరింది. ఈ మేరకు తమ క్షేమసమాచారాల్ని ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లోని ఫామ్‌లలో అప్డేట్ చేయాలంటూ భారత పౌరులను కోరింది. ‘‘భారత పౌరులతో వేగంగా సమన్వయం కావాలన్న ఉద్దేశంతో భారత రాయబార కార్యాలయం ఉంది. కాబట్టి, పౌరులు ముఖ్యంగా ఉక్రెయిన్ సరిహద్దులోని విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఫామ్‌ను నింపండి. ఒకవేళ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆప్షన్‌తో భారత్‌కి వెళ్లిపోయిన విద్యార్థులు మాత్రం ఈ ఫామ్ నింపాల్సిన అవసరం లేదు.. అని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది ఎంబసీ. మరింత అప్డేట్స్ కోసం ఎంబసీ వెబ్‌సైట్‌తో పాటు ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో కావాలని, ఏవైనా సాయం కావాలంటే సోషల్ మీడియాలోనూ సంప్రదించవచ్చని సూచించింది. ఒకవైపు రష్యా ఆక్రమణ కోసం ప్రయత్నిస్తోందంటూ ఉక్రెయిన్‌తో పాటు అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సరిహద్దులో సైన్యాన్ని మోహరిస్తూనే తమకు అలాంటి ఉద్దేశం లేదంటూ రష్యా బుకాయిస్తోంది. అసలు కథ.. సుమారు మూడు దశాబ్ధాల కిందట రష్యా నుంచి విడిపోయింది ఉక్రెయిన్. అటుపై కొన్నేళ్లకు(2014లో) యూరప్‌తో ఒప్పందాలను తెంచుకొని రష్యాతో బంధం బలపరుచుకోవాలని భావించింది. కానీ, అది కుదర్లేదు. పైగా ఆ ప్రయత్నాలు వెనక్కి వెళ్లడంతో రష్యా ఆగ్రహంతో ఉక్రెయిన్‌లోని క్రిమియాను ఆక్రమించింది. ఆ సమయంలో జరిగిన హింసాకాండతో రష్యాపై వ్యతిరేకత కారణంగా పాశ్చాత్య దేశాల ఉక్రెయిన్ ఆకర్షితురాలైంది. ఈ నేపథ్యంలో 2024లో యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకుంటామని, నాటోలో చేరాలన్న కోరికను కూడా వ్యక్తం చేసింది. ఇది రష్యాకు మరింత కోపం తెప్పించింది. సాంస్కృతికంగా రష్యాతోనే ఉక్రెయిన్‌కు మంచి సంబంధాలున్నాయని చెబుతూ.. నాటో, ఈయూలో చేరడం కన్నా తమతో కలిసిపోవడం మేలంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. అందుకే సరిహద్దులో సైన్యం మోహరింపు ద్వారా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ తరుణంలో ఉక్రెయిన్ విషయంలో తాము తొందరపడకూడదంటే అమెరికా, మిత్రపక్షాలు కొన్ని హామీలివ్వాలని.. ముఖ్యంగా నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వకుండా ఉండడం, తూర్పు యూరప్‌లో నాటో బలగాల ఉపసంహరణ లాంటి డిమాండ్లు చేస్తోంది. కానీ, అగ్రరాజ్యం అందుకు అంగీకరించడం లేదు. చదవండి: ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోంది?! -
చర్చలతో చైనా దారికి రాదు
వాషింగ్టన్: భారత్, చైనా మధ్య గత అయిదారు నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతలకు చర్చలతో పరిష్కారం లభించదని అమెరికా అభిప్రాయపడింది. డ్రాగన్ దేశంతో చర్చలు జరిపి ఇక లాభం లేదని భారత్‌కు హితవు పలికింది. ఇరుదేశాల మధ్యనున్న వాస్తవాధీన రేఖను చైనా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని స్పష్టం చేసింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రియెన్ చైనాతో ఒప్పందాలు, చర్చలు అంటూ కాలయాపన చేయొద్దని, చర్చలతో పరిష్కారం దొరకదన్న విషయాన్ని భారత్ అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా చైనా వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. భారత్ సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉత్తరంగా చైనా 60 వేల మందికి పైగా సైనికుల్ని మోహరించి కయ్యానికి కాలు దువ్వుతోందని అన్నారు. చైనాది దురాక్రమణ బుద్ధి కమ్యూనిస్టు పార్టీ దురాక్రమణ బుద్ధితో భారత్, తైవాన్ దేశాల సరిహద్దుల్ని ఆక్రమించుకోవడానికి కుట్రలు పన్నుతోం దని రాబర్ట్ ఓ బ్రియెన్ అన్నారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తైవాన్ సరిహద్దుల్లో నిరంతరాయంగా సైనిక విన్యాసాలకు దిగుతోందని అన్నారు. చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ (ఓబీఓఆర్) ప్రాజెక్టు కూడా ఇతర దేశాల ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని దెబ్బ తీయడానికేనని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యులైన కంపెనీలకు చైనా బలవంతంగా రుణాలు తీసుకునే పరిస్థితి కల్పిస్తుందని వాటిని చెల్లించలేక అవన్నీ డ్రాగన్ దేశానికి దాసోహం అంటాయని అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కల్పించే మౌలిక సదుపాయాలు అంతిమంగా చైనాకే ప్రయోజనం చేకూరుస్తున్నాయని ఆయన అన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని భారత్ ఇకనైనా చర్చలతో చైనా దారికి రాదు అన్న విషయాన్ని గ్రహించుకోవాలన్నారు. క్వాడ్ దేశాలకు డ్రాగన్‌తో ముప్పు డ్రాగన్ దేశం అత్యంత హీనంగా వ్యవహరిస్తూ క్వాడ్ దేశాలకు ముప్పుగా మారిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ సరిహద్దుల్లో 60 వేల మందికి పైగా సైనికుల్ని మోహరించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంద న్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో చైనాకు చెక్ పెట్టడానికి ఇండో పసిఫిక్ దేశాలు అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా క్వాడ్ గ్రూపుగా ఏర్పడ్డాయి. ఇటీవల ఈ దేశాల విదేశాంగ మంత్రులు టోక్యోలో సమావేశమై చర్చించారు. భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్‌తో ఫలప్రదమైన చర్చలు జరిపానని టోక్యో నుంచి వాషింగ్టన్కు తిరిగి వచ్చిన అనంతరం ఒక టీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
అంతర్జాతీయ సంకేతాలే కీలకం...
ప్రధాన ఆర్థిక గణాంకాలేమీ లేకపోవడంతో ఈ వారం మార్కెట్‌కు అంతర్జాతీయ సంకేతాలే కీలకమని నిపుణులంటున్నారు. వీటితో పాటు చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, కరోనా కేసులు, కరోనా టీకా సంబంధిత వార్తలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి... ఈ అంశాలు కూడా తగినంత ప్రభావం చూపుతాయని వారంటున్నారు. సెప్టెంబర్ సిరీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) కాంట్రాక్టులు ఈ వారమే ముగియనున్నందున ఒడిదుడుకులు తప్పవని విశ్లేషకులంటున్నారు. దేశీయంగా ప్రధాన ట్రిగ్గర్లు ఏమీ లేకపోవడంతో అనిశ్చితి కొనసాగుతుందని, అందుకే ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు. ప్రపంచ పీఎమ్ఐ గణాంకాలు.... అమెరికా ఫెడరల్ రిజర్వ్ తక్షణ తాయిలాలేమీ ఇవ్వకపోవడం గత వారం ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్‌ను కూడా దెబ్బతీసింది. సున్నా స్థాయి రేట్లు మరో మూడేళ్ల పాటు కొనసాగుతాయని సంకేతాలిచ్చిన ఫెడరల్ రిజర్వ్ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ రికవరీపై అనిశ్చితిని వ్యక్తం చేయడం ప్రతికూల ప్రభావం చూపింది. ఇక అంతర్జాతీయంగా చూస్తే, అమెరికా, ఇంగ్లాండ్, యూరోజోన్‌ల పీఎమ్ఐ(పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) గణాంకాలు ఈ వారం విడుదలవుతాయి. ఈ వారం మూడు ఐపీఓలు.... ఈ వారంలో మూడు కంపెనీల ఐపీఓలు వస్తున్నాయి. క్యామ్స్(కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్), కెమ్‌కాన్ స్పెషాల్టీ కెమికల్స్, ఏంజెల్ బ్రోకింగ్ కంపెనీలు తమ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లతో సందడి చేయనున్నాయి. విదేశీ పెట్టుబడులు రూ.3,944 కోట్లు పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉండటంతో ఈ నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మన క్యాపిటల్ మార్కెట్లో రూ.3,944 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. వీటిల్లో నికర పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లో రూ.1,766 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.2,178 కోట్ల చొప్పున ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ జోరుగా బాండ్లను కొనుగోలు చేస్తుండటంతో బాండ్ల రాబడులు తక్కువగా ఉండటం, అంతర్జాతీయంగా అధికంగా లభిస్తున్న లిక్విడిటీ... ఈ కారణాల వల్ల మన మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వస్తున్నాయని నిపుణులంటున్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను సున్సా స్థాయిల్లోనే మరో మూడేళ్ల పాటు కొనసాగించాలని ఫెడరల్ రిజర్వ్ సంకేతాలివ్వడంతో భారత్ వంటి వర్ధమాన మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతుందని వారంటున్నారు. ఐపీఓల సందడి చాలా రోజుల తర్వాత ఈ నెలలో ప్రైమరీ మార్కెట్లో ఐపీఓల సందడి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ నెలలో హాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, రూట్ మొబైల్స్ తమ ఐపీఓలతో దుమ్ము రేపాయి ఇక ఈ వారం మూడు కంపెనీలు–క్యామ్స్(కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్), కెమ్‌కాన్ స్పెషాల్టీ కెమికల్స్, ఏంజెల్ బ్రోకింగ్ కంపెనీలు తమ ఐపీఓలతో సందడి చేయనున్నాయి. ఈ ఐపీఓలకు సంబంధించిన తేదీలు, ప్రైస్‌బాండ్, జీఎమ్‌పీ తదితర వివరాలు..... -
తూర్పులద్దాఖ్‌లో పీఎల్ఏపై ఆర్మీ పైచేయి
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో భారత ఆర్మీ చైనా పీఎల్ఏపై పైచేయి సాధించింది. ఒక వైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే గడిచిన మూడు వారాల్లో కీలకమైన 20 పర్వత ప్రాంతాలను భారత సైన్యం ఆధీనంలోకి తీసుకుంది. భారత్ ఇచ్చిన షాక్‌తో దిమ్మెర పోయిన చైనా ఆర్మీ అరుణాచల్‌ప్రదేశ్‌తో గల సరిహద్దుల్లో మోహరింపులు పెంచి, కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ నేపథ్యంలో భారత్, చైనా కమాండర్ స్థాయి ఆరో విడత చర్చలు సోమవారం జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ సమావేశంలో భారత బృందంలో విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి కూడా పాలు పంచుకునే అవకాశముంది. ఈ చర్చలు తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖకు చైనావైపున్న మోల్దోలో జరగనున్నాయి. లద్దాఖ్ గగనతలంపై రఫేల్ యుద్ధ విమానాలు పహారా కాస్తున్నాయి.‘ఆగస్టు 29 మొదలు సెప్టెంబర్ రెండో వారం వరకు భారత సైన్యం 20 ప్రధాన పర్వత ప్రాంతాలను ఆక్రమించింది. ఆర్మీ ఆధీనంలోకి తీసుకున్న వాటిలో మగార్ హిల్, గురుంగ్ హిల్, రెచెన్ లా, రెజంగ్ లా, మొఖ్‌పరితోపాటు ఫింగర్ 4కు సమీపంలోని పర్వతప్రాంతం ఉన్నాయి’ ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ‘ఇంతకుముందు ఈ ప్రాంతాల్లో చైనా ఆర్మీ పీఎల్ఏ ఆధిపత్యం ఉండేది. తాజా పరిణామంతో మన బలగాలు ఈ ప్రాంతంలో శత్రువుపై పైచేయి సాధించినట్లయింది’అని ఆ వర్గాలు తెలిపాయి. భారత భూభాగం వైపున పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణం వైపు ఉన్న ఈ పర్వత భాగాలను ఆక్రమించుకునే క్రమంలో చైనా ఆర్మీ ప్రతిఘటించిందనీ, ఈ సందర్భంగా మూడు పర్యాయాలు గాల్లోకి కాల్పులు కూడా జరిగాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత ఆర్మీ కదలికలతో ఇప్పటికే ఉన్న బలగాలకు తోడు మరో 3,000 బలగాలను చైనా అదనంగా రెజంగ్ లా, రెచెన్ లా పర్వత ప్రాంతాలకు సమీపంలోకి రప్పించిందని తెలిపాయి. దీంతోపాటు మోల్డో సైనిక స్థావరంలోకి అదనపు బలగాలను తరలించిందని వివరించాయి. అరుణాచల్ సరిహద్దుల్లో చైనా కుట్ర తూర్పు లద్దాఖ్ అనంతరం చైనా దృష్టి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులపై పడింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలతో అప్పర్ సుబన్‌సిరిలోని అసపిలా, లాంగ్జు, బిసా, మఝా ప్రాంతాల్లోకి పీఎల్ఏ మోహరింపులు పెరిగాయి. దీంతోపాటు ఎల్ఏసీకి సమీపంలోని బిసాలో ఒక రోడ్డును కూడా నిర్మించింది. భారత సైన్యం కూడా దీటుగా స్పందించింది. ఆరు సమస్యాత్మక ప్రాంతాలు, 4 సున్నిత ప్రాంతాల్లో గస్తీని పెంచింది. ఎలాంటి దురాక్రమణనైనా తిప్పికొట్టేందుకు సర్వం సన్నద్ధమైంది. -
ఉద్రిక్తతల తొలగింపే లక్ష్యం
మాస్కో: తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించే లక్ష్యంతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం రష్యా రాజధాని మాస్కోలో సమావేశమయ్యారు. ప్యాంగాంగ్ సరస్సు కేంద్రంగా రెండు దేశాలు భారీగా బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న ఈ మే నెల నుంచి రెండు దేశాల విదేశాంగ మంత్రులు ముఖాముఖీ భేటీ కావడం ఇదే ప్రథమం. గల్వాన్ లోయలో చోటు చేసుకున్న తీవ్ర స్థాయి ఘర్షణల సమయంలో జూన్ 17న ఇరువురు నేతలు ఫోన్లో చర్చలు జరిపారు. చైనా దురాక్రమణ చర్యలు కొనసాగిస్తుండటంతో పాటు భారీగా సైనిక దళాలను మోహరించడం, కొన్ని నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడంతో.. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోకి భారత్ అదనపు బలగాలను, యుద్ధ ట్యాంకులను, ఇతర సామగ్రిని భారీగా తరలించింది. ‘కాసేపట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశమవనున్నారు. సరిహద్దు సమస్యను వారిద్దరు చర్చిస్తారు’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం సాయంత్రం మీడియాకు వెల్లడిం చారు. ‘దౌత్య, మిలటరీ మార్గాల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలనే భారత్, చైనా భావిస్తున్నాయి’ అన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు జైశంకర్, వాంగ్ మాస్కో వెళ్లారు. ఆర్ఐసీ విదేశాంగ మంత్రుల భేటీ ఎస్సీఓ సమావేశాల సందర్భంగా గురువారం మాస్కోలో రష్యా, భారత్, చైనా(ఆర్ఐసీ) విదేశాంగ మంత్రులు వరుసగా సెర్గీ లెవ్రోవ్, జైశంకర్, వాంగ్ సమావేశమయ్యారు. పరస్పర సహకారం, స్నేహం, విశ్వాసం స్ఫూర్తిగా త్రైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల విషయమై వారు చర్చించారు. భేటీ అనంతరం వారు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. అంతర్జాతీయంగా అభివృద్ధిదాయక శాంతి, సుస్థిరతలు నెలకొనడానికి ఈ మూడు దేశాల మధ్య త్రైపాక్షిక సహకారం ఆవశ్యకమని అందులో పేర్కొన్నారు. వ్యూహాత్మక పర్వతాలపై భారత్ పాగా ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో చైనా దళాలు ఉన్న ప్రదేశాలపై దృష్టి పెట్టేలా కీలకమైన పలు పర్వతాలపై భారత బలగాలు నియంత్రణ సాధించాయి. రెండు దేశాల ఆర్మీలకు చెందిన బ్రిగేడ్ కమాండర్లు, కమాండింగ్ అధికారులు వేర్వేరుగా చర్చలు జరిపారని అధికార వర్గాలు తెలిపాయి. -
రఫేల్ రాక.. చైనాకు స్ట్రాంగ్ కౌంటర్
అంబాలా, హరియాణా : సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత అమ్ముల పొదిలోకి ఐదు రఫేల్ యుద్ధ విమానాలు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రఫేల్ రాకను గేమ్ చేంజర్‌గా వర్ణించారు. భారత వైమానిక దళంలోకి రఫేల్ జెట్లను ప్రవేశపెట్టడం చారిత్రాత్మక క్షణంగా వర్ణించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘రఫేల్ రాకతో ప్రపంచానికి ముఖ్యంగా మనల్ని వక్ర దృష్టితో చూసే ధైర్యం చేసేవారికి ఒక బలమైన సందేశాన్ని పంపుతున్నాం. ప్రస్తుత సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది చాలా కీలకమైన ఘటన’ అంటూ పరోక్షంగా చైనాకు వార్నింగ్ ఇచ్చారు రాజ్‌నాథ్. అంతేకాక ‘ఎల్ఏసీ వద్ద ఉద్రిక్తతల సమయంలో ఐఏఎఫ్ చూపించిన సమయస్ఫూర్తిని, నిబద్ధతని ఈ సందర్భంగా నేను ప్రశంసిస్తున్నాను. సరిహద్దులో మోహరించిన వాయుసేన దళాలను చూస్తే.. వారు ఏలాంటి పరిస్థితిని ఎదుర్కొగలరని.. భవిష్యత్తులో యుద్ధం సంభవిస్తే.. ఐఏఎఫ్ కీలక నిర్ణయాధికారిగా ఉంటుందని’ అన్నారు రాజ్‌నాథ్. (చదవండి: రఫేల్... గేమ్ చేంజర్) దేశంలోని పురాతన వైమానిక దళ స్థావరం అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫోరెన్స్ పార్లీ, డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ పాల్గొన్నారు. భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రఫేల్ యుద్ధ విమానాల కోసం భారత్ 59 వేల కోట్ల రూపాయలతో ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దశలో జులై 29న 5 రఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ రఫేల్ యుద్ధ విమానాలు 17వ స్క్వాడ్రన్‌లో చేరాయి. రఫేల్ చేరికతో భారత ఎయిర్‌ఫోర్స్ సామర్ధ్యం మరింత బలోపేతమైంది. -
కన్సాలిడేషన్ కొనసాగుతుంది..!
భారత–చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించిన వార్తలతో పాటు కరోనా వైరస్ సంబంధిత వార్తలు కూడా ఈ వారం మార్కెట్ గమనానికి కీలకం కానున్నాయని నిపుణులంటున్నారు. ప్రపంచ మార్కెట్ల పరిణామాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం... తదితర అంశాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని విశ్లేషకులంటున్నారు. మరోవైపు మారటోరియం రుణాలపై వడ్డీ మాఫీ విషయమై తదుపరి విచారణ ఈ నెల 10న జరగనున్నది. దీనికి సంబంధించిన పరిణామాలను బట్టి బ్యాంక్ షేర్ల కదలికలుంటాయి. ఫలితాల సీజన్ ముగింపు...! గత వారం విడుదలైన వివిధ గణాంకాలు ఆర్థిక రికవరీకి చాలా కాలమే పడుతుందని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఈ శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడనున్నాయి. ఇక ఈ వారంతో జూన్ క్వార్టర్ ఫలితాల సీజన్ ముగియనున్నది. ఈ వారంలో మొత్తం 341 కంపెనీలు తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ వారంలో భెల్, ఐఆర్సీటీసీ, ఫ్యూచర్ కన్సూమర్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ తదితర కంపెనీలు ఫలితాలను వెల్లడిస్తాయి. కన్సాలిడేషన్ కొనసాగుతుంది...! మార్కెట్ కన్సాలిడేటెడ్ మూడ్‌లో ఉందని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనలిస్ట్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. లాభాల స్వీకరణ జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని వివరించారు. ఆగస్టులో నికర కొనుగోలుదారులుగా నిలిచిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు గత వారంలో మాత్రం రూ.3,800 కోట్ల మేర నికర అమ్మకాలు జరిపారని గణాంకాలు వెల్లడించాయి. -
మార్కెట్‌పై బేర్ ఎటాక్!
ప్రపంచ మార్కెట్ల పతన ప్రభావంతో మన మార్కెట్ కూడా శుక్రవారం భారీగా నష్టపోయింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు బాగా క్షీణించడం, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు మరింత ముదురుతుండటం, కరోనా కేసులు పెరుగుతుండటం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 33 పైసలు పుంజుకొని 73.14కు చేరినా మన మార్కెట్ పతనం ఆగలేదు. సెన్సెక్స్ 634 పాయింట్లు పతనమై 38,357 పాయింట్ల వద్ద, నిఫ్టీ 194 పాయింట్లు క్షీణించి 11,334 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే సెన్సెక్స్ 1.63 శాతం, నిఫ్టీ 1.68 శాతం చొప్పున నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు క్షీణించాయి. ఇక వారం పరంగా చూస్తే సెన్సెక్స్ 1,110 పాయింట్లు, నిఫ్టీ 314 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలు.. సెన్సెక్స్, నిఫ్టీలు భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. సెన్సెక్స్ 666 పాయింట్లు, నిఫ్టీ 174 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రోజంతా ఈ నష్టాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 741 పాయింట్లు, నిఫ్టీ 224 పాయింట్లమేర నష్టపోయాయి. లోహ, విద్యుత్తు, టెలికం, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. మరిన్ని విశేషాలు.. ► సెన్సెక్స్‌లోని 30 షేర్లలో ఒక్క మారతీ సుజుకీ షేర్ మాత్రమే లాభపడింది. మిగిలిన 29 షేర్లు నష్టపోయాయి. ► యాక్సిస్ బ్యాంక్ 4 శాతం నష్టంతో రూ.455 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ భారీగా పతనమైనా, దాదాపు వందకు పైగాషేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. వొడాఫోన్ ఐడియా,అదానీ గ్యాస్, గ్రాన్యూల్స్ ఇండియా, వీఎస్టి టిల్లర్స్, అంబర్ ఎంటర్ప్రైజెస్, ఆస్ట్రాజెనెకా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► అమెరికాలో టెక్నాలజీ షేర్ల పతనం కారణంగా మన దగ్గర కూడా ఐటీ షేర్లు నష్టపోయాయి. ► త్వరలో వాహన తుక్కు విధానాన్ని (స్క్రాపేజ్ పాలసీ) ప్రభుత్వం ప్రకటించనున్నదన్న అంచనాలతో వాహన షేర్లు లాభపడ్డాయి. ► ఫ్యూచర్ గ్రూప్ షేర్లు వరుసగా నాలుగో రోజూ లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఈ షేర్లతో పాటు మరో 200కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. అదానీ గ్రీన్, మ్యాక్స్ ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. రూ.2.23 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.2.23 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.23 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.154.63 లక్షల కోట్లకు తగ్గింది. అప్రమత్తంగా ఉండండి..: నిపుణులు కరోనా కేసుల జోరు, ప్రపంచ మార్కెట్ల పతనం, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, మన మార్కెట్ వేల్యూయేషన్లు అధికంగా ఉండటం.. ఇవన్నీ కీలకమైన రిస్క్ అంశాలని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. పతనానికి ప్రధాన కారణాలు అమెరికా స్టాక్ సూచీల పతనం: గత రెండు నెలల్లో భారీగా ఎగసిన టెక్నాలజీ షేర్లలో గురువారం లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో అమెరికా స్టాక్ సూచీలు 3–5 శాతం రేంజ్లో నష్టపోయాయి. ఈ ప్రభావంతో శుక్రవారం ఆసియా, యూరప్ మార్కెట్లు కూడా నష్టపోవడం మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది. బ్యాంక్ షేర్ల పతనం..: మారటోరియం రుణాలపై వడ్డీ వసూలు విషయమై సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. హెవీ వెయిట్స్‌కు నష్టాలు..: సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లలో జోరుగా అమ్మకాలు జరిగాయి. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు..: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. -
సరిహద్దు ఉద్రిక్తతలు.. చైనాలో ఆహార సంక్షోభం
బీజింగ్: కరోనా వైరస్ కారణంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన చైనా.. ఆహార సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు జి జిన్‌పింగ్ వెల్లడించారు. ఈ క్రమంలో 2013 నాటి ‘క్లీన్ యువర్ ప్లేట్’ కార్యక్రమాన్ని మరోసారి ప్రారంభించారు. ప్రజలు ఖర్చులను తగ్గించుకోవాలని ఆయన సూచించారు. అయితే ఈ కార్యక్రమానికి, లద్దాఖ్, దక్షిణ సముద్రంలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధం ఉందంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వ చర్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసమే డ్రాగన్ సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వేలా ప్రవర్తిస్తూ.. ఉద్రిక్తతలను పెంచుంతుందంటున్నారు విశ్లేషకులు. గతంలో మావో జెడాంగ్ కూడా ఇలానే చేశారని గుర్తు చేసుకుంటున్నారు. 1962లో ఆహార వృథాని అరికట్టడానికి మావో ‘గ్రేట్ లీఫ్ పార్వర్డ్ మూమెంట్’ని ప్రారంభించాడు. ఫలితంగా కోట్ల మంది చైనీయులు ఆకలితో చనిపోయారు. అయితే ఈ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికే కాక.. ప్రపంచ దేశాలతో పాటు స్వంత ప్రజల దృష్టిని మరల్చడానికి 1962లో భారత్‌తో సరిహద్దు వివాదాన్ని ముందుకు తెచ్చాడని.. ప్రస్తుతం జిన్‌పింగ్ కూడా అదే పద్దతిని అనుసరిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ఆహార వృథా విపరీతంగా ఉంది. ఈ గణాంకాలు విస్మయానికి గురిచేసేలా ఉన్నాయి. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలి’ అని అధికారులకు జిన్‌పింగ్ సూచించినట్లు చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఆహార వృథాను సిగ్గుచేటుగా ప్రజలు భావించేలా చేయాలని ఆయన అభిప్రాయపడ్డట్లు సమాచారం. జిన్‌పింగ్ ప్రకటన విడుదలైన వెంటనే.. ఆహారాన్ని ఎవరూ వృథా చేయకూడదంటూ అన్ని మీడియాల్లోనూ ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. 2015లో చైనాలోని మహా నగరాల్లో 17 నుంచి 18 టన్నుల ఆహారాన్ని వృథా చేసినట్లు గణాంకాలను మీడియాలో చూపిస్తున్నారు. ఈ మొత్తం దక్షిణ కొరియా పరిమాణంలో ఉన్న దేశానికి ఆహారంగా ఇవ్వడానికి ఇది సరిపోతుందని ప్రభుత్వ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అంచనా వేసింది. మీడియాలో ఆహార వృథా, బాధ్యతారాహిత్య ప్రవర్తనల ప్రచారం నడుమ ఆహార సంక్షోభాన్ని ప్రభుత్వం దాచి పెడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనాలో ఈ సారి ఆహార సంక్షోభం వచ్చే అవకాశాలు ఉన్నాయని పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే గోధుమల సేకరణ 20శాతం తగ్గినట్లు తెలుస్తోంది. అయితే, కరువు అంశాన్ని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ కొట్టిపారేసింది. 120 కోట్ల కిలోల ధాన్యం అదనంగా పండించామని పేర్కొంది. కానీ దక్షిణ చైనాలో ఈ ఏడాది భారీగా వరదలు ముంచెత్తడంతో కొంత నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికా నుంచి వచ్చే ఆహార దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. చైనా ఆహార అవసరాలను 30శాతం వరకు దిగుమతులే తీరుస్తాయి. మరోవైపు భారత్, వియత్నాంలు కరోనావైరస్ కారణంగా వరి ఎగుమతులపై ఆంక్షలు విధించాయి. మరోవైపు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా చైనాలో 100 మిలియన్ల పందులను చంపారు. దేశంలో మెజారిటీ జనాభాకు పందులే ప్రధాన ఆహార వనరు. ప్రస్తుతం అవి తక్కువగా లభ్యమవుతుండటంతో పంది మాంసం ధర 85 శాతం పెరిగినట్లు సమాచారం. (చదవండి: నెంబర్ వన్ సాధించడమే లక్ష్యం: బాదల్) అలానే చైనాకు అవసరమైన బియ్యంలో అధిక భాగం యాంగ్జీ నది పరివాహక ప్రాంతం నుంచే వస్తాయి. అయితే ఈ ఏడాది సంభవించిన భారీ వరదల కారణంగా వరి ఉత్పత్తిలో భారీ తగ్గుదల కనిపించింది. చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ గణాంకాల ప్రకారం, చైనా ధాన్యం దిగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే జనవరి మరియు జూలై మధ్య కాలంలో 22.7 శాతం (74.51 మిలియన్ టన్నులకు) పెరిగాయి. 910,000 టన్నుల దిగుమతితో గోధుమ దిగుమతులు సంవత్సరానికి 197 శాతం పెరిగాయి. ఈ నెలలో మొక్కజొన్న దిగుమతులు కూడా 23 శాతం పెరిగి 880,000 టన్నులకు చేరుకున్నాయి. -
సరిహద్దు ఉద్రిక్తత.. దోవల్ సమీక్ష
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో మంగళవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నతాధికారులతో సమవేశమయ్యి.. పరిస్థితులను సమీక్షించారు. అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వీరితో భేటీ కానున్నారు. ఆగస్టు 29న ఎల్ఏసీ వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి గాను 150-200 మంది చైనా సైనికులు ప్రయత్నించినట్లు భారత సైన్యం గుర్తించింది. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ దళాలు.. డ్రాగన్ చర్యలను తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో ప్రస్తుతం చుషుల్ వద్ద బ్రిగేడ్ కమాండర్ స్థాయిలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.(చదవండి: చైనా కుట్ర: దోవల్ ఆనాడే హెచ్చరించినా..) ఈ నేపథ్యంలో దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే చర్చల ద్వారా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత్, చైనా మధ్య ఈ ఏడాది ఏప్రిల్, మే నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనా ఆర్మీ భారత్‌కు చెందిన ప్యాంగ్యాంగ్ త్సో, ఫింగర్ ఏరియా, గల్వాన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్, కొగ్రుంగ్ నాలా ప్రాంతాల్లోకి వచ్చాయి. -
భారత్‌లో పెట్టుబడులు; పునరాలోచనలో అలీబాబా
న్యూఢిల్లీ: భారత్‌లో పెట్టుబడుల విషయంలో చైనా దిగ్గజ సంస్థ అలీబాబా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్ల తెలుస్తోంది. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని భావించిన అలీబాబా సంస్థ సరిహద్దు వివాదాల నేపథ్యంలో పునరాలోచనలో పడినట్లు రాయిటర్స్ నివేదిక తెలిపింది. దేశంలో అంకుర(స్టార్టప్) పరిశ్రమలను స్థాపించాలని అలీబాబా కంపెనీ గతంలో భావించింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆరు నెలల వరకు వేచిచూడాలని అలీబాబా సంస్థ భావిస్తోందని సమాచారం. గతంలో అలీబాబా సంస్థకు అనుబంధంగా ఉన్న సంస్థలు 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. అయితే అలీబాబా సంస్థ గతంలో పేటీఎమ్, ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో, నిత్యావసర వస్తువులు అందించే బిగ్‌బాస్కెట్ తదితర సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. కరోనా వైరస్, సరిహద్దు వివాదాల నేపథ్యంలో కొత్త పెట్టబడులు పెట్టే విషయంలో కొంత కాలం వేచి చూడాలని అలీబాబా భావిస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: అలీబాబాకు ట్రంప్ సెగ -
భారత సైన్యం కదలికలపై కన్నేసిన డ్రాగన్
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో డ్రాగన్ దొంగదెబ్బ తీసినా దీటుగా బదులిచ్చిన భారత్ పాటవాన్ని తక్కువగా అంచనా వేయరాదని చైనా భావిస్తోంది. భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం సెంట్రల్ సెక్టార్ కదలికలపై డ్రాగన్ కన్సేసిందని నిఘా వర్గాల నివేదిక వెల్లడించింది. గల్వాన్ లోయలో జూన్ 15న జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన అనంతరం భారత్-చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెచ్చుమీరిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలోని భారత్ సరిహద్దుల్లో బారహోటి ప్రాంతం వరకూ తన నిఘా వ్యవస్ధను చైనా విస్తరించినట్టు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. భారత్-చైనాల మధ్య ప్రస్తుత ఉద్రిక్తతల దృష్ట్యా డ్రాగన్ నియంత్రణ రేఖ పొడవునా నిఘా పరికరాలను ఆధునీకరించిందని తెలిపాయి. నియంత్రణ రేఖ వెంబడి 180 డిగ్రీల్లో తిరుగాడేలా చైనా రెండు కెమెరాలను అమర్చిందని ఈ నివేదిక పేర్కొంది. ఈ ప్రాంతంలో పలు స్తంభాలను చైనా ఏర్పాటు చేసిందని, ఇక్కడే భారీ సోలార్ ప్యానెల్‌ను, విండ్ మిల్‌ను నిర్మించిందని నిఘా వర్గాల నివేదిక వెల్లడించింది. ఈ ప్రాంతంలో చిన్న పక్కా ఇంటిని నిర్మించి అందులో నిర్మాణ సామాగ్రిని, నిఘా పరికరాలను చైనా ఉంచిందని పేర్కొంది. బారహోతి ప్రాంతంలో భారత సేనల కదలికలను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పసిగట్టేలా కెమెరాలను అమర్చిందని వెల్లడించారు. చదవండి : పాక్ కుయుక్తులు : కశ్మీర్‌పై డ్రాగన్‌తో మంతనాలు -
ఆగని డ్రాగన్ ఆగడాలు
న్యూఢిల్లీ: డ్రాగన్ దేశం మళ్లీ బుసలు కొడుతోంది. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారక ముందే మరోవైపు నుంచి దురాక్రమణకు సిద్ధమైంది. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో లిపులేఖ్ పాస్‌లో సైనికుల్ని మోహరించింది. వెయ్యి మందికి పైగా చైనా సైనికులు లిపులేఖ్‌లో మోహరించినట్టుగా భారత్ మిలటరీ సీనియర్ కమాండర్ చెప్పారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు లద్దాఖ్‌లో సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని జాతీయ భద్రతా సలహాదారు దోవల్, చైనా విదేశాంగ మంత్రి చాంగ్ యీ మధ్య జరిగిన చర్చల్లో ఒక అంగీకారానికి వచ్చినా చైనా మాట నిలబడలేదు. లిపులేఖ్ పాస్, ఉత్తర సిక్కింలో కొన్ని ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా లిబరేషన్ ఆర్మీ సైన్యం తిష్ట వేసిందని అధికారి చెప్పారు. చైనా ఆగడాలను దీటుగా ఎదుర్కోవడానికి భారత్ కూడా సన్నాహాలు చేస్తోంది. హిమాలయాల్లో గడ్డకట్టే చలిని తట్టుకోవడానికి భారతీయ సైన్యానికి దుస్తులు, టెంట్లను అమెరికా, రష్యా, యూరప్ నుంచి కొనుగోలు చేయనుంది. ఏమిటీ లిపులేఖ్ పాస్? హిందువులకి అత్యంత సాహసోపేతమైన యాత్ర మానస సరోవరానికి వెళ్లే మార్గంలో లిపులేఖ్ పాస్ ఉంది. 1992లో చైనాతో వాణిజ్య సంబంధాల కోసం ఈ లిపులేఖ్ మార్గంలో తొలిసారిగా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి ప్రతీ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు వాణిజ్య కార్యకలాపాల కోసం ఈ మార్గాన్ని తెరిచి ఉంచుతారు. ఆ సమయంలో సరిహద్దులకి రెండు వైపులా ఉండే ఆదివాసీలు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో హిమాలయాల వరకు భారత్ 80కి.మీ. రోడ్డుని నిర్మించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో లిపులేఖ్ పాస్ తరచూ వార్తల్లోకెక్కుతోంది. ఇప్పుడు చైనా ఈ మార్గంపైనే కన్నేసింది. ఐరాసకు నేపాల్ కొత్త మ్యాప్ భారత్ వ్యతిరేక ధోరణిని నేపాల్ మరింత తీవ్రతరం చేస్తోంది. మన దేశ భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురాలను నేపాల్‌లో అంతర్భాగంగా చూపిస్తూ తయారు చేసిన మ్యాప్‌ను ఐక్యరాజ్య సమితికి. గూగుల్‌కి పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాంతాలను తమ దేశ భాగంలో చూపించడానికి నేపాల్ రాజ్యాంగ సవరణ చేసిన విషయం తెలిసిందే. నేపాల్ ఈ చర్యల వెనుక చైనా ఒత్తిడి ఉన్నట్టుగా ఆరోపణలున్నాయి. -
వెల్కమ్ రఫెల్
-
రఫేల్... గేమ్ చేంజర్
న్యూఢిల్లీ: చైనా అండదండలతో జిత్తులమారి పాకిస్తాన్ కూడా కయ్యానికి కాలుదువ్వుతుందన్న అంచనాలున్న నేపథ్యంలో భారత్ అమ్ములపొదిలోకి రఫేల్ చేరడంతో భారత్ వాయుసేన సామర్థ్యం మరింతగా పెరిగింది. సరిహద్దుల్లో చైనా ఆటలు ఇక సాగవని, రఫేల్ ఒక గేమ్ చేంజర్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా యుద్ధవిమానం చెంగ్డూ జే–20 కంటే రఫేల్ అత్యంత శక్తిమంతమైనదని చెబుతున్నారు. ‘‘జే–20 కంటే రఫేల్ అత్యంత శక్తిసామర్థ్యాలు కలిగినది. జే–20 అయిదో తరానికి చెందిన యుద్ధవిమానమని చైనా చెబుతున్నప్పటికీ దాని ఇంజిన్ మూడో జనరేషన్‌కి చెందినది. సుఖోయ్ యుద్ధ విమానం తరహా ఇంజిన్ అందులో ఉంది’’ అని రఫేల్ యుద్ధ విమానాన్ని పరీక్షించి చూసిన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ నంబియార్ చెప్పారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దగ్గరున్న జే–20 అత్యంత ఆధునికమైనదైతే ఆ దేశం రష్యా నుంచి సుఖోయ్ యుద్ధ విమానాలను కొనాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. గగనతలం నుంచి గగనతలం లక్ష్యాలను ఛేదించే మీటియోర్ క్షిపణి వ్యవస్థ, ఉపరితల లక్ష్యాలను ఛేదించగలిగిన స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థ, స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ కలిగి ఉన్న రఫేల్ యుద్ధ విమానం దరిదాపుల్లోకి కూడా చైనా జే–20 రాలేదని బాలా కోట్ దాడుల వ్యూహకర్త, మాజీ ఎయిర్ మార్షల్ బీఎస్ ధనూవా అభిప్రాయపడ్డారు. -
పక్షుల్లా వచ్చేశాయ్
చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ నిప్పులు చిమ్ముకుంటూ పిడుగులు కురిపించేందుకు శత్రువుల్ని గాలిదుమారంలా చుట్టేయడానికి మన దేశ వాయుసేనకు మరింత సత్తా చేకూర్చేలా జాతి యావత్తూ ఎదురుచూపులు ఫలించేలా ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన రఫేల్ యుద్ధ విమానాలు రెక్కలు కట్టుకొని మరీ పక్షుల్లా వాలిపోయాయి. అంబాలా: రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన అయిదు రఫేల్ యుద్ధ విమానాలు ఏడు వేల కి.మీ.లు ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. రఫేల్ విమానాలు భారత్ గగనతలంలోకి ప్రవేశించగానే రెండు సుఖోయ్–30 యుద్ధ విమానాలు వాటికి ఎదురేగి వెంట వచ్చాయి. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియాతో పాటుగా భారత వైమానికి దళానికి చెందిన ఉన్నతస్థాయి అధికారులు అంబాలా ఎయిర్‌బేస్‌లో స్వాగతం పలికారు. సంప్రదాయ బద్ధమైన వాటర్ కెనాన్లతో విమానాలకు సెల్యూట్ కార్యక్రమం నిర్వహించారు. శత్రువుల వెన్నులో వణుకు: రాజ్‌నాథ్ రఫేల్ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్‌బేస్‌కు చేరుకోగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ట్వీట్లు చేశారు. పక్షులు సురక్షితంగా దిగాయంటూ ట్వీట్ చేశారు. చైనాకు హెచ్చరికలు పంపారు. మన ప్రాదేశిక సమగ్రతకు ముప్పు కలిగించాలనుకునే వారికి రఫేల్ రాకతో వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు. భారత్ భూభాగంలోకి రఫేల్ యుద్ధవిమానాలు దిగడం మన దేశ సైనిక చరిత్రలో నవ శకానికి నాందిగా అభివర్ణించారు. యుద్ధ విమానాల్లో క్షిపణులు, ఆయుధాలు, రాడార్లు, ఎలక్ట్రానిక్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని రాజ్‌నాథ్ తన ట్వీట్లో వివరించారు. రఫేల్ యుద్ధ విమానాల రాక దేశానికే గర్వకారణమని హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఫ్రాన్స్‌లోని దసో ఏవియేషన్ తయారు చేసిన 36 రఫేల్ యుద్ధ విమానాలను రూ. 59 వేల కోట్లకు కొనుగోలు చేయడానికి 2016లో ఎన్డీయే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, రఫేల్ యుద్ధ విమానాల రావడంపై భారత వాయుసేనకి రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేశారు. ఒక్కో యుద్ధ విమానంపై రూ.526 కోట్లకు బదులుగా రూ.1670 కోట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. సంస్కృతంలో ప్రధాని ట్వీట్ యుద్ధ విమానాలకు స్వాగతం చెప్తూ ప్రధాని మోదీ సంస్కృతంలో ట్వీట్ చేశారు. ‘జాతి రక్షణకు మించిన ధర్మం లేదు. దేశ భద్రతకు మించిన అత్యుత్తమ యజ్ఞం లేదు’ అని అన్నారు. కీర్తి ప్రతిష్టలతో సమున్నతంగా ఆకాశాన్ని తాకాలని ఆకాక్షించారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
భారత్ సవాళ్ళేంటి?
-
4 నెలల గరిష్టానికి సూచీలు
చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం çకలసి వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ల దన్నుతో సెన్సెక్స్, నిఫ్టీలు దూసుకుపోయాయి. నాలుగు నెలల గరిష్ట స్థాయికి ఎగిశాయి. సెన్సెక్స్ 466 పాయింట్లు లాభపడి 36,487 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 156 పాయింట్లు ఎగసి 10,764 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే సెన్సెక్స్ 1.29 శాతం, నిఫ్టీ 1.47 శాతం మేర పెరిగాయి. వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. ఈ నాలుగు రోజుల్లో ఈ సూచీలు చెరో 4.5 శాతం మేర ఎగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆరంభ లాభాలను కోల్పోయి 2 పైసల నష్టంతో 74.68 వద్ద ముగిసింది. కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నా, కరోనా వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య (రికవరీ రేటు) పెరుగుతుండటం సానుకూల ప్రభావం చూపుతోంది. ► మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 7 శాతం లాభంతో రూ.571 వద్ద ముగిసింది. ► మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో ఐదు షేర్లు–బజాజ్ ఆటో,హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్, హిందుస్తాన్ యూనిలివర్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ షేర్లు మాత్రమే నష్టపోయాయి. ► దాదాపు 1200కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ఐడీబీఐ బ్యాంక్, ఐటీఐ,ఎస్కార్ట్స్, ఆర్తి డ్రగ్స్, టేస్టీ బైట్, బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఈ జాబితాలో ఉన్నాయి. రిలయన్స్ @ 12 లక్షల కోట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ జోరు కొనసాగుతోంది. గత శుక్రవారం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇంటెల్ రూ.1,895 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసింది. ఇక ఈ కంపెనీ తాజాగా జియోమీట్యాప్ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇంట్రాడేలో 3.9 శాతం లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,858ను తాకిన ఈ షేర్ చివరకు 3.5 శాతం లాభంతో రూ.1,851 వద్ద ముగిసింది. సెన్సెక్స్ మొత్తం 466 పాయింట్ల లాభంలో రిలయన్స్ వాటా మూడో వంతు(189 పాయింట్లు)కు పైగా ఉంది. ఇక రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.11,73,677 కోట్లకు ఎగసింది. భారత్‌లో అత్యధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీ ఇదే. పార్ట్లీ పెయిడ్ రైట్స్ షేర్లను కూడా కలుపుకుంటే ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.12.14 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది మార్చిలో రూ.867కు పడిపోయిన ఈ షేర్ మూడున్నర నెలల్లోనే రెట్టింపునకు పైగా లాభపడింది. -
వెనక్కి తగ్గిన చైనా బలగాలు
-
మా పేరు ‘కరోనా’ కాదు.. మేం భారతీయులమే
కోల్‌కతా: చైనా ఈ పేరు వినగానే అమ్మో వాళ్లా! మొన్నటికి మొన్న ‘కరోనా’ తెచ్చారు. ఇప్పుడేమో భారత భూభాగం తమదేనంటున్నారు. వాళ్లను ఊరికే వదలకూడదు. చైనాతో వాణిజ్య సంబంధాలను తెంచేసుకోవాలి. ఆర్థికంగా కుంగదీసి గొంతు నులిమెయ్యాలి అంటూ చైనీయుల గురించి, వారి ఆహారపు అలవాట్ల గురించి కఠినంగా మాట్లాడుకుంటున్న వాళ్లు ఎందరో. ఇది నాణానికి ఓ వైపైతే.. మరోవైపు తామూ భారతీయులమేనంటూ, మమ్మల్ని వేరుగా చూడొద్దంటూ వేలాది భారతీయ చైనీయులు గళం విప్పుతున్నారు. మమ్మల్ని ‘కరోనా’ అని పిలుస్తుంటే మానసికంగా కుంగిపోతున్నామని, ఉన్న ఊరిని, పెంచుకున్న బంధాలను వదిలేసి ఎలా వెళ్లిపొమ్మంటారని ప్రశ్నిస్తున్నారు. పోలిక చైనీయులదే అయినా పాలు తాగి పెరిగింది భరతమాత గుండెలపైనేనంటున్నారు. కోల్‌కతా మహానగరం మన దేశంలో చైనీయులు సెటిల్ అయిన ప్రదేశం. ఇక్కడి చైనా టౌన్ లో ఐదు వేల మంది చైనా మూలాలు కలిగిన వారు నివసిస్తున్నారు. ఇండియాలో చైనా పుట్టుపూర్వోత్తరాలు కలిగిన వ్యక్తులు నివసిస్తున్న ఏకైక ప్రాంతం ఇదే. కోవిడ్–19 వచ్చిన తర్వాత వీళ్లను ఇరుగుపొరుగు వాళ్లు కరోనా అంటూ సూటిపోటి మాటలంటున్నారట. వాళ్ల రెస్టారెంట్ల వైపు కనీసం ఎవరూ కన్నెత్తి కూడా చూడటం లేదట.(125 రోజుల్లో 1.25 కోట్ల ఉద్యోగాలు!) 70 ఏళ్ల క్రితమే కోల్‌కతాకు.. దాదాపు ఏడు దశకాల కిందట చైనా నుంచి వచ్చిన కొందరు కోల్‌కతాలో నివసించడం మొదలుపెట్టారు. వారి తర్వాత మూడు తరాలు ఇక్కడే పుట్టి పెరిగారు. స్వేచ్ఛగా జీవిస్తూ, వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ల జీవితాలు కరోనా, గల్వాన్ ఘటనలతో తలకిందులయ్యాయి. జూన్ 15న గల్వాన్ ఘటనతో సగటు చైనా టౌన్ వాసి ఇళ్లలో నుంచి బయటకు రావడానికి వణికిపోయాడు. భారతీయులు తమపై దాడి చేస్తారని భావించి ఇళ్లకే పరిమితమయ్యారు. ‘మేము ఇక్కడ ఓటు వేస్తున్నాం. ఇక్కడే పుట్టాం. పెరిగాం. కానీ కొందరు చదువుకోని, చరిత్ర తెలియని మూర్ఖులు మమ్మల్ని వెటకారంగా పిలుస్తూ అవమానిస్తున్నారు. మమ్మల్ని తిరిగి వెనక్కి వెళ్లిపోవాలంటూ వీధుల్లో తిరుగుతూ కేకలు పెడుతున్నారు’ అని చైనా టౌన్ లో జీవిస్తున్న 65 ఏళ్ల లీ యావో సియన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘భారతీయ చైనీయులు ఎప్పటినుంచో ఇండియాలో జీవిస్తున్నారు. మాకు భారతీయులతో ఎనలేని అనుబంధం ఉంది. మమ్మల్ని వేరు చేసి చూడొద్దు’ అని చైనా టౌన్ లో ఓ రెస్టారెంట్ ను నడుపుతున్న ఫ్రెడ్డీ లావో కోరారు. (నేను ఇందిరా మనువరాలిని..) కోల్ కతా చైనా టౌన్ ప్రఖ్యాత చైనా వంటకాలతో పాటు చైనా లెదర్ ఉత్పత్తులకు బాగా ప్రసిద్ధి. ఇక్కడ దాదాపు 40 రెస్టారెంట్లు, చిరుతిళ్ల బండ్లు, ఫ్యాక్టరీలు ఉన్నాయి. లెదర్ ను ప్రాసెస్ చేసే 350 యూనిట్లను కోల్‌కతా లెదర్ కాంప్లెక్స్‌కు ఇటీవల మార్చారు. తమ షిప్ మెంట్లను కస్టమ్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారని లెదర్ కంపెనీల యజమానులు వాపోతుండగా, అలాంటిదేమీ లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. ‘మేమూ భారతీయులమే’ ‘కరోనా వల్ల మేం ఆర్థికంగానే నష్టపోయాం. కానీ, ఇండియా–చైనా వివాదం వల్ల అభద్రతకు గురవుతున్నాం. మీలా మేం కూడా భారతీయులమే. మమ్మల్ని ఎక్కడికి వెళ్లమంటారు’ అని చైనా టౌన్ లోని ఇండో చైనీయులు వాపోతున్నారు. 2017లో డొక్లాం ఉద్రిక్తల సమయంలో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొలేదని లెదర్ యూనిట్లను నడుపుతున్న లీ చెప్పారు. 1962 యుద్ధ సమయంలో మాత్రం ఇండియాలో ఉన్న చైనీయులందరినీ రాజస్థాన్ లోని డియోలిలో ఏర్పాటు చేసిన డిటెన్షన్ సెంటర్ కు తరలించారని వెల్లడించారు. చైనాలో టౌన్ లో ఫేమస్ రెస్టారెంట్లు బీజింగ్, గోల్డెన్ ఎంపైర్. బీజింగ్ ను ఇంకా తెరవక పోగా, నాలుగు రోజుల క్రితం తెరిచిన గోల్డెన్ ఎంపైర్ నుంచి ఆహారం కొనే వాళ్లు కరువయ్యారు. ‘మేం కొంతమంది రెగ్యులర్ కస్టమర్లకు ఫోన్ చేసి మాట్లాడాం. అన్ని జాగ్రత్తలతో ఆహారం తయారు చేస్తున్నామని చెప్పాం. కానీ వాళ్లు మీరు చైనీయులు కదా, మీ రెస్టారెంట్ నుంచే కరోనా వస్తుంది. మాకు ఫుడ్ వద్దు’అని చెప్పారని హోటల్ యజమాని హెన్రీ చెప్పారు. ‘నేను, మా నాన్న ఇక్కడే పుట్టాం. మా తాతగారు 1947కి ముందు కోల్‌కతా వచ్చి స్థిరపడ్డారు. మా ముఖాలు చైనీయుల్లా కనిపిస్తున్నా మేం కూడా భారతీయులమే. ప్రస్తుతం మా పిల్లలు ఇళ్లు వదిలి బయటకు వెళ్లలేని స్థితి నెలకొంది. కేవలం చైనీయుల కోసం కట్టించిన పార్కుకి మాత్రమే వాళ్లు వెళ్తున్నారు’ అని హెన్రీ ఆవేదన చెందారు. చైనా టౌన్ లో చైనా వస్తువులు తగలబెడుతూ నిరసనలు తెలిపేందుకు పలువురు చేసిన ప్రయత్నాలను ఇండో చైనీయులు తృణమూల్ నేతల సాయంతో అతి కష్టం మీద ఆపించారు. ‘వాళ్లు అభద్రత, భయంతో బాధపడుతున్నారు. మమ్మల్ని కలిసి వాళ్ల పరిస్థితిని వివరించారు. దాంతో చైనా టౌన్ లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాం. పోలీసులతో పహారా కాయిస్తున్నాం. అక్కడ ఉంటున్న వారిలో దాదాపు 5 వేల మంది ఓటు హక్కును కలిగివున్నారు. కాబట్టి, వాళ్లందరూ భారతీయులే’ అని తృణమూల్ కౌన్సిలర్ ఫయాజ్ ఖాన్ పేర్కొన్నారు. చైనా నుంచి ఆగిన రవాణా చైనా టౌన్ లో తయారవుతున్న చాలా వస్తువులకు చైనా దేశం నుంచి ముడి సరుకు అవసరం. అక్కడి నుంచి వందల సంఖ్యలో కన్సైన్మెంట్లు వస్తుంటాయి. కానీ, వీటిని అధికారులు అడ్డుకుంటున్నారని భారతీయ చైనీయులు ఆరోపిస్తున్నారు. బాయ్ కాట్ చైనాలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. దీనిపై స్పందించిన ఓ సీనియర్ కస్టమ్స్ ఆఫీసర్ చైనా కార్గోలను ఆపాలనే ఆదేశాలేవీ రాలేదని పేర్కొన్నారు. కరోనా వల్ల తక్కువ స్టాఫ్ తో విధులు నిర్వహిస్తున్నామని అందుకే కొంచెం ఆలస్యమవుతోందని చెప్పారు. కార్గోల అడ్డగింతపై వ్యవస్థాగత ఆర్డర్ పాస్ చేసి ఉండొచ్చని కోల్‌కతా లెదర్ అసోసియేషన్ సెక్రటరీ ఇమ్రాన్ ఖాన్ అనుమానం వ్యక్తం చేశారు. అందుకే వారాల తరబడి కార్గోలు ఎయిర్ పోర్టుల్లో ఆగిపోయాయన్నారు.