సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దుల్లో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న క్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ దళాల చీఫ్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీతోనూ రాజ్‌నాథ్ సింగ్ సమావేశమై సరిహద్దులో తాజా పరిస్ధితులపై సమీక్షించారు. మరోవైపు ఉన్నతాధికారులతో 90 నిమిషాల పాటు సాగిన భేటీలో రక్షణ మంత్రి తాజా పరిణామాలపై చర్చించారు. చైనా కవ్వింపు చర్యల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై సంప్రదింపులు జరిపారు.
కాగా, ఇండో-చైనా సరిహద్దుల్లో గాల్వాన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఆర్మీ అధికారి, ఇద్దరు జవాన్లు మరణించారని మరికొంతమంది భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని భారత సైన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. చైనా సైనికులకూ కొందరికి గాయాలయ్యాయని తెలిపింది. సరిహద్దులో చైనా చర్యపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా లదాఖ్ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య గతకొంత కాలంగా ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment