బీజింగ్: తైవాన్, చైనాను రెచ్చగొట్టింది. డ్రాగన్ కంట్రీ వద్దని వారించినా సరే తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ అమెరికా పర్యటనలో అక్కడి హౌజ్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్థీతో భేటీ అయ్యారు. తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టడంతో చైనా భగ్గుమంది.
చైనాకు చెందిన మూడు యుద్ధనౌకలు, ఓ ఎయిర్‌క్రాఫ్ట్ తైవాన్ సరిహద్దులో మోహరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తైవాన్ రక్షణ శాఖ సైతం ధృవీకరించింది. పరిస్థితి ప్రస్తుతానికి ఉద్రిక్తంగానే ఉందని, ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నట్లు తైవాన్ రక్షణ మంత్రి తెలిపారు.
అంతకు ముందు.. చైనా విదేశాంగ శాఖ సాయ్ ఇంగ్ చర్యను తీవ్రంగా ఖండించింది. చైనా సిద్ధాంతాలకు(వన్ చైనా ప్రిన్స్‌పుల్) వ్యతిరేకంగా ఆమె వ్యవహరించారని మండిపడింది. వన్ చైనా.. వన్ తైవాన్ అంటూ తైవాన్‌ను తప్పుదోవ పట్టించే తీరును మార్చుకోవాలంటూ అమెరికాను ఆ ప్రకటన ద్వారా చైనా హెచ్చరించింది. అంతకు ముందు.. బుధవారం కాలిఫోర్నియాలో మెక్‌కార్థీని కలిసిన సాయ్ ఇంగ్ వెన్.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ పరోక్షంగా చైనా నుంచి పొంచి ఉన్న ముప్పును ఉద్దేశించి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment