
డోనాల్డ్ ట్రంప్‌కు, చైనాకు మధ్య భగ్గుమనడానికి పచ్చిగడ్డితో పనిలేదు. చూపులు చాలు! రాజకీయంగా ఎంత శతృత్వం ఉన్నా వ్యాపారంలో చైనాకు అందరూ మిత్రులే. ఆత్మీయులే. తాజాగా అలిబాబా గ్రూప్‌కు చెందిన ఇ–కామర్స్ ప్లాట్‌ఫాం ఒకటి ధ్యానస్థితిలో ఉన్న ట్రంప్ విగ్రహాలను అమ్మకానికి పెట్టింది. ‘ట్రంప్, అందరికంటే బుద్దిజం కాస్త ఎక్కువ తెలిసిన వ్యక్తి’ అని కామెంట్ కూడా పెట్టింది. ‘మనమేమిటీ, మన చరిత్ర ఏమిటీ, ట్రంప్ విగ్రహం ఏమిటీ మన పరువంతా పోయింది’ అంటూ నిరసనలేవీ భగ్గుమనలేదు. విచిత్రమేమింటే ట్రంప్ విగ్రహాలే కాదు ట్రంప్ ఫేస్‌మాస్క్‌లు, మోడల్స్, టీషర్ట్‌లు... బ్రహ్మాండంగా అమ్ముడవుతున్నాయట!
Comments
Please login to add a commentAdd a comment