ఆర్థిక అనిశ్చితితో ప్రపంచమంతా అనేక కంపెనీల్లో నియామకాలు మందగించి లేఆఫ్‌ల బాట పడుతున్న వేళ చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ మంచి వార్త చెప్పింది. ఈ సంవత్సరం 15000 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది.
చైనీస్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ తన ఆరు ప్రధాన వ్యాపార విభాగాలన్నింటిలో కలిపి ఈ ఏడాది మొత్తంగా 15,000 మందిని నియమించుకోనున్నట్లు అలీబాబా గ్రూప్ చైనీస్ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ "వీబో" ద్వారా మే 25న ఒక ప్రకటన విడుదల చేసింది.
కొత్త నియామకాల్లో 3,000 మంది యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేయనున్నట్లు తెలిపింది. అంటే ఫ్రెషర్లకు అవకాశం ఇవ్వనుంది. తమ సంస్థలో భారీగా తొలగింపులు జరగనున్నాయని గతంలో వచ్చిన వార్తలను పుకార్లుగా కొట్టిపారేసింది. ఉద్యోగులు వెళ్లిపోవడం అనేది సాధారణ ప్రవాహంలో భాగమని పేర్కొంది.
కాగా అలీబాబాకు చెందిన క్లౌడ్ విభాగం ఉద్యోగ కోతలను ప్రారంభించిందని, సుమారు 7 శాతం సిబ్బందిని తగ్గించవచ్చని బ్లూమ్‌బెర్గ్ ఇటీవల నివేదించింది. అలీబాబా 15000 ఉద్యోగాల నియామకాల గురించి వెల్లడించడం ద్వారా బ్లూమ్‌బర్గ్ నివేదిక అవాస్తవం అని తెలియజేసింది.
సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేనియల్ జాంగ్ మే నెల ప్రారంభంలో మొదటిసారిగా కంపెనీ వివరాలను వెల్లడించారు. 2023 మార్చి నాటికి సంస్థలో 2,35,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. అప్పటికింకా సంస్థలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు కాలేదు.
ఇదీ చదవండి: Meta Layoffs 2023: మెటాలో తొలగింపులు! వారికి జుకర్‌బర్గ్ ఇస్తానన్న ప్యాకేజీ ఏంటో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment